Advertisement
మన చట్టాలలో మహిళలు-నేరాలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలున్నాయి… ముఖ్యంగా ఆడవాళ్లని సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేయకూడదు అనే నిబంధన ఉంది.మహిళలను అరెస్ట్ చేయాలంటే మహిళా పోలీస్/కానిస్టేబుల్ మాత్రమే ఉండాలి.. ఒకవేళ ప్రెగ్నెంట్ మహిళను అరెస్ట్ చేస్తే..ఆమె నేరం రుజువై జైలుకు వెళ్లాల్సి వస్తే..జైలులో ఆ ప్రెగ్నెంట్ మహిళా ఖైదీని ఎలా ట్రీట్ చేస్తారు..
Advertisement
- గర్భిణి స్త్రీ ఖైధీగా జైలులో అడుగుపెట్టిన నాటి నుండి ఆమె సంరక్షణ మొత్తం జైలు అధికారులే తీసుకుంటారు.ఆమెకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆమె నుండి లేదా వారి బంధువుల నుండి సేకరిస్తారు..
- ఆమెకి నెలనెలా హెల్త్ చెకప్ జైలులో ఉండే వైద్యాదికారి దగ్గరే చేయిస్తుంటారు..వారి ఆరోగ్య రిత్యా మరింత మెరుగైన వైద్య సదుపాయం అవసరం అనుకున్నప్పుడు జైలు బయట ఉండే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు.
- డాక్టర్ చెకప్ తర్వాత వారి సూచనల ప్రకారమే ఆహారం, మందులు అందిస్తారు.
- మెడికల్ కేర్ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో డెలివరి చేయిస్తారు.. డెలివరి తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాక మళ్లీ జైలుకి తీసుకుని వెళ్తారు.
- తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ వైద్య నిపుణుల ప్రిస్క్రిప్షన్ ప్రకారం వారికి అవసరమైన ఆహారం అందిస్తారు..పిల్లలకి టీకా షెడ్యూల్ జాగ్రత్తలు తీసుకుంటారు మరియు పిల్లల కోసం ,పిల్లల హెల్త్ కోసం హాస్పిటల్ విజిట్స్ ని ఏర్పాటు చేస్తారు.
- పిల్లలకి సంబంధించిన ఆహారం, బట్టలు, మందులు అన్ని సదుపాయాలు కల్పిస్తారు..దానికి తల్లి చేసిన నేరంతో సంబంధం లేకుండా పిల్లల సంరక్షణ బాద్యతలు తీసుకుంటారు.
- బిడ్డ పుట్టిన దగ్గర నుండి ఆరు సంవత్సరాల వయస్సు ఉన్న ఏ బిడ్డ అయినా తల్లితో కలిసి ఉండటానికి అనుమతి ఉంది. ప్రతి జైలులో ఈ వయస్సు వరకు అవసరమైన పిల్లల సంరక్షణ ఏర్పాట్లు మరియు విద్యా సౌకర్యం అందుబాటులో ఉన్నాయి.
రాజీవ్ గాంధీ హత్యోదంతంలో ఏడుగురు నేరస్తుల్లో ఒకరైన నళిని .. అరెస్ట్ అయ్యేటప్పటికి ప్రెగ్నెంట్.. నళిని కూతురు హరిత్ర వెళ్లోర్ జైలులోనే పుట్టింది..అక్కడే రెండేళ్ల పాటు తల్లితో పాటే ఉండి పెరిగింది..తర్వాత బంధువుల సంరక్షణలో పెరిగిన హరిత్ర ప్రస్తుతం యుకెలో ఉంటుంది..
Advertisements