Advertisement
భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలకు చెందిన వారు అనేక ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మతాల విషయానికి వస్తే మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లు ముఖ్యమైనవి. ఇక ఇతర మతాలు కూడా ఉన్నాయి. వాటిల్లో జైన మతం కూడా ఒకటి. మన దేశంలో తమిళనాడులో జైనిజంను పాటించే వారు ఇప్పటికీ ఉన్నారు. ఇక వారికి గాను పలు ఆలయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమలై:
తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో తిరుమలై కొండపై కుండవయేశ్వరం అనే ఆలయం ఉంది. దీన్ని రాజరాజ చోళుడి సోదరి కుండవై నిర్మించింది. ఈ ఆలయంలో నెమినాథుడు కొలువై ఉన్నాడు.
Advertisements
చిత్తరల్:
కన్యాకుమారి జిల్లాలో ఈ ఆలయం ఉంది. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. అనేక మంది జైనులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇది టూరిస్టు స్పాట్‌గా కూడా మారింది. రిషబనాథ, పద్మావతి, మహావీర్ స్వామి విగ్రహాలు కనిపిస్తాయి.
సమనర్మలై, మదురై:
మదురై నగరానికి అత్యంత సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. ఇది కూడా టూరిస్ట్ స్పాట్‌గా ఉంది. కలభ్ర వంశస్థులు దీన్ని నిర్మించారు.
జినా కంచి జైన మఠం:
Advertisement
కాంచీపురంలోని మెల్ సితాముర్‌లో ఈ మఠం ఉంది. తమిళనాడులో జైనులకు ఇది అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ఈ మఠంలో అనేక విగ్రహాలు ఉన్నాయి.
త్రిలోక్యనాథ ఆలయం:
ఈ ఆలయం కూడా కాంచీపురంలోనే ఉంది. దీన్ని 8వ శతాబ్దంలో పల్లవులు నిర్మించారు.
కారంధై, తిరువన్నామలై జిల్లా:
తమిళ జైనులకు ఇది కూడా ముఖ్య ఆలయంగా ఉంది. ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో అనేక మంది జైనులు నివసిస్తుంటారు. దీంట్లో రిషబనాథ, నెమినాథ, మహావీర, మల్లినాథ, పద్మావతి, సరస్వతి విగ్రహాలు ఉన్నాయి.
వీడూర్ మల్లినాథర్ స్వామి ఆలయం:
తిరువన్నామలై జిల్లాలో ఈ ఆలయం ఉంది. దీంట్లో తీర్థంకర మల్లినాథుడు కొలువై ఉన్నాడు.
చంద్రప్రభు జైన్ ఆలయం:
చెన్నైలోని సౌకార్‌పెట్టైలో ఈ ఆలయం ఉంది. చెన్నైలోని మార్వాడీలు ఎక్కువగా ఈ ఆలయానికి వెళ్తుంటారు. 19-20 శతాబ్దాల్లో దీన్ని నిర్మించారు. ఆ ప్రాంతంలో ఉండే అనేక మంది మార్వాడీలు జైన మతాన్ని అనుసరిస్తారు. అందుకనే ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. దీన్ని నగరి నిర్మాణ శైలిలో నిర్మించారు. తీర్థంకర చంద్రప్రభు ఇందులో కొలువై ఉన్నాడు.
Advertisements