Advertisement
సమయం సాయత్రం 5 గంటలు, స్థలం సెయింట్ జేవియర్ కాలేజ్, ఆదివారం.. ప్రోగ్రామ్ పేరు “looses a foot,walks a mile” డ్యాన్స్ షో.. కొందరిలో సంశయం ..కొందరిలో ఆసక్తి.. వెరసి అందరూ తన రాకకోసం, తన ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఆ షో నిర్వాహకులలో చిన్న అనుమానం.. తను వచ్చింది.. స్టేజ్ పై డ్యాన్స్ వేస్తోంది..వేసింది..ఒక్కొక్కరు ఉద్వేగానికి లోనయ్యారు.. కొందరు కన్నీలాపుకోలేకపోయారు..ఒక్కసారిగా అందరూ నిలబడి చప్పట్లు కొట్టారు..ఇదే తను కోరుకుంది..తనపై తనకున్న నమ్మకం తనని విజేతగా నిలబెట్టింది..ఆ షో తర్వాత ప్రపంచమే తనవైపు చూసింది. తనే సుధాచంద్రన్ భరతనాట్య కళాకారిణి…. కృత్రిమ కాలుతో డ్యాన్స్ చేసి అందరిని మెప్పించిన నర్తికి.
ముంబైలో స్థిరపడిన తమిళ కుటుంబంలో జన్మించింది సుధాచంద్రన్..మూడేళ్ల వయసులోనే నృత్యంపై ప్రేమ మొదలైంది..డైలి స్కూల్ తర్వాత డ్యాన్స్ క్లాస్ అటెండ్ అయి.. ఇంటికి చేరుకునే సరికి రాత్రి తొమ్మిదిన్నర అయ్యేది.. టెన్త్ పూర్తి చేసే లోపే వందల సంఖ్యలో నృత్యప్రదర్శను ఇచ్చింది..అనేక పోటిలలో గెలిచింది..స్కూల్ విద్య తర్వాత అందరిలా సైన్స్ వైపు వెళ్లకుండా డ్యాన్స్ స్ట్రీమింగ్లోనే విద్యను ఎంచుకుంది..
సజావుగా సాగిపోతుందనుకున్న జీవితం బస్ యాక్సిడెంట్ రూపంలో u-టర్న్ తీసుకుంది… ట్రిచి నుండి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో కుడికాలు చీలమండకి గాయం అయింది..దానికి కట్టిన కట్టు కారణంగా ఇన్పెక్షన్ అయి అది శరీరమంతా పాకే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంతో..గత్యంతరం లేని పరిస్థితుల్లో తన అరికాలుని తొలగించడానికి సుధా తల్లిదండ్రులు అతికష్టంగా అనుమతినిచ్చారు..వారికి తెలుసు సుధ ఇక జీవితంలో డ్యాన్స్ చేయలేదని.. కాని కూతురి ప్రాణాలకంటే వారికి ఆ సమయంలో ఏది ఎక్కువగా అనిపించలేదు.
Advertisement
Advertisements
తర్వాత స్పృహలోకి వచ్చిన సుధాచంద్రన్ ఇక జీవితంలో డ్యాన్స్ చేయలేననే విషయం తెలుసుకుని కృంగిపోయింది.. జైపూర్ ఫూట్ తన కలల్ని పునరావృతం చేసింది..ప్లాస్టిక్ కాలుతో తను స్వయంగా నడవడానికే 4నెలలు పట్టింది.. మళ్లీ మునుపటిలా జీవించడానికి 3సంవత్సరాల పైనే ఫిజియోధెరపీ చేయించుకుంది..అయినప్పటికి తను డ్యాన్స్ చేయలేదని డాక్టర్లు తేల్చి చెప్పారు..కానీ సుధా వెనక్కి తగ్గలేదు.
మెళ్లిమెళ్లిగా ప్రాక్టీస్ చేసేది..చిన్నచిన్న స్టెప్పులకే కాలునుండి రక్తం కారుతూ,నొప్పి పుట్టేది..డ్యాన్స్ చేయలేకపోతున్నాననే భయంతో,బాధతో మరింత ఎక్కువగా డ్యాన్స్ చేసేది..దాంతో మరింత రక్తస్రావం, నొప్పి పెరిగేది అయినప్పటికీ, అంతటి బాధలో కూడా తాను డ్యాన్స్ చేయగలుగుతున్నాని గ్రహించి,ఇక ఎప్పటికి డ్యాన్స్ వదలకూడదని ఆమె నిశ్చయించుకుంది..
Advertisements
అంకితభావంతో కృషిచేసింది..కృత్రిమపాదంతో నాట్యకదలికలన్నింటిని నేర్చుకుంది.. ..తనతో డ్యాన్స్ షో నిర్వహించడానికి చాలామంది అనుమానం వ్యక్తం చేసారు.. షో ప్లాప్ అయితే పెట్టిన డబ్బులు నష్టం అని భావించారు.కాలు కోల్పోయినతర్వాత డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎంత కష్టపడిందో అంతకంటే ఓపికగా స్టేజ్ షో చేయడానికి ఎదురుచూసింది. అలా వచ్చిన అవకాశమే “LOOSES A FOOT, WALKS A MILE”..తొలిప్రదర్శనకే టికెట్స్ పూర్తిగా అమ్ముడుపోయాయి.. ఆ షో సుధ జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది..ప్రపంచవ్యాప్తంగా సుధాచంద్రన్ పేరు మారుమోగిపోయింది…