Advertisement
ఆస్కార్ అవార్డ్స్ 2021 కోసం బెస్ట్ ఇంటర్నేషన్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఇండియా నుండి జల్లికట్టు అధికారికంగా ఎంపికైంది. ఈ ఎంట్రీ కోసం ఇండియా నుండి మొత్తం 27 సినిమాలను పరిశీలించిన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు జల్లికట్టు ను సెలెక్ట్ చేశారు.
సినిమా కాన్సెప్ట్ ఏంటి?
హరీష్ ఎస్ రచించిన ‘మావోయిస్ట్’ అనే షార్ట్ స్టోరీ ఆధారంగా లిజో జోసే పెల్లిస్సెరీ మళయాల దర్శకుడు తెరకెక్కించిన సినిమానే జల్లికట్టు…. మనుషులు జంతవుల కంటే కూడా మొరటుగా ఉన్నారనే థీమ్ తో తెరకెక్కింది ఈ సినిమా.
Advertisements
ఏ ఏ సినిమాలను వెనక్కి నెట్టింది?
Advertisement
ఆస్కార్ బరిలో ఇండియా నుండి మొత్తం 27 ఎంట్రీస్ వచ్చాయి. అందులో అమితాబ్ బచ్చన్ ‘గులాబో సితాబో’, దీపికా పదుకొనె ‘ఛపాక్’ తో పాటు ‘ది డిసిపిల్’, ‘శకుంతలా దేవి’, ‘శిఖర’, ‘గుంజన్ సక్సేనా’, ‘ఏకే వర్సస్ ఏకే’, , ‘భోంస్లే’, ‘ఛలాంగ్’, ‘ఈబ్ అల్లేయ్ ఊ!’, ‘చెక్ పోస్ట్’, ‘అట్కన్ చట్కన్’, ‘సీరియస్ మెన్’, ‘బుల్‌బుల్’, ‘కామ్యాబ్’, ‘ది స్కై ఈజ్ పింక్’, ‘చింటు కా బర్త్‌డే’, ‘బిట్టర్‌స్వీట్’ లాంటి చిత్రాలు పోటీ పడ్డాయి…..వీటన్నింటినీ కాదని జల్లికట్టుకు ఓటేసింది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు
ఇతర విశేషం:
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి మలయాళ సినిమా ఆస్కార్‌కు ఎంపిక కావడం ఇది మూడోసారి. 2011లో ‘అడమింటే మకన్ అబు’, 1997లో ‘గురు’ ఇప్పుడు జల్లికట్టు..అయితే గతంలోని రెండు సినిమాలు కూడా అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్‌లో స్థానం సంపాధించలేకపోయాయి.
Advertisements
సౌండింగ్ , లైటింగ్, టేకింగ్ ఈ సినిమాలో సరికొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా సౌండింగ్ విషయంలో మాత్రం అవార్డ్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో అందుబాటులో ఉంది. కుదిరితే చూడండి.