1985 జంధ్యాల దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న EVV సత్యనారాయణ… .ఆడది మగాడైతే అనే పేరుతో ఓ కథ రాసి ఆంధ్రజ్యోతి పత్రికకు పంపాడు. ఆడవారికి మగ లక్షణాలు , మగవారికి ఆడ లక్షణాలు వస్తే ఎలా ఉంటుందనేది ఈ కథ సారాంశం… కథను చదివిన పేపర్ వాళ్లు….. ఇది కూడా ఓ కథేనా? అంటూ తిప్పి పంపించారట! అదే కథను తన గురువు జంధ్యాల కు వినిపిస్తే…. బానే ఉంది కాని సినిమాగా ఆడుతుందో లేదో చెప్పలేం అనడంతో కథ పక్కకు పడిపోయింది!
అదే కథ సినిమాగా మారిన వైనం:
ఆంధ్రజ్యోతి పత్రికకు పంపిన కథకు ఇంకాస్త మసాలా జోడించి…. పూర్తి స్థాయి కథను సిద్దం చేశాడు EVV …. జంద్యాల దగ్గర పనిచేసే టైమ్ లో పరిచయమైన డివివి దానయ్య సంప్రదించి కథ చెప్పారు….అయినదీ అదే డౌట్….? కథ ఓకే కానీ సినిమాగా ఆడుతుందా? అని.! మీకు అంతలా భయం ఉంటే నేను కూడా కొంత అమౌంట్ పెడుతాను సినిమా సూపర్ గా ఆడుతుంది అని అతన్ని ఒప్పించాడు.
హీరో, హీరోయిన్ ఎంపిక:
కథ రాసేటప్పుడే రాజేంద్ర ప్రసాద్ ను హీరోగా ఊహిస్తూ కథ రాసుకున్నాడు EVV. కానీ రాజేంద్రప్రసాద్ ఫుల్ బిజీ డేట్స్ ఖాళీగా లేవు…దీంతో నరేష్ ను అప్రోచ్ అయ్యారు. నరేష్ కు కథ బాగా నచ్చింది. హీరోగా ఓకే చెప్పేశాడు.! హీరోయిన్ గా నలుగురైదుగురిని అడిగితే ఎవ్వరూ ఒప్పుకోలేదు . దాంతో తమిళ్ లో రెండు సినిమాలు హీరోయిన్ గా చేసిన మీనాక్షి అనే అమ్మాయిని తీసుకున్నారు . మీనాక్షి పేరుని ఆమనిగా మార్చి తెలుగు తెరకు పరిచయం చేశాడు EVV .
టైటిల్ …..:
మొదట ఈ సినిమాకు రివర్స్ గేర్ అనే పేరు పెట్టారు.! ప్రొడ్యూసర్ కి ఇది మొదటి సినిమా కావడంతో ఆ పేరు సెంటిమెంట్ గా వర్క్ అవుట్ కాదని జంబలకిడిపంబగా మార్చారు!
షూటింగ్ :
వైజాగ్ పరిసర ప్రాంతాల్లో … 50 లక్షల బడ్జెట్ తో ….నెల రోజుల్లోనే షూటింగ్ ను పూర్తిచేశారు.
రిలీజ్ ….వెనక్కొచ్చిన బాక్స్ లు.!
1992 డిసెంబర్ లో సినిమా రిలీజ్ అయ్యింది. ఎవరికీ పెద్దగా ఎక్కలేదు. బాక్స్ లన్ని తిరిగి వెనక్కి వొచ్చేసాయి. అంతా సినిమా ప్లాప్ అని డిసైడ్ అయిపోయారు . అసలు ఈ సినిమా వచ్చి పోయినట్టు కూడా ఎవరికి తెలియదు.
1993లో EVV నాగార్జున హీరోగా వారసుడు సినిమా చేశారు. అది బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. దీంతో EVV కి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ హోదా వచ్చింది. ఆ పేరును ఉపయోగించుకుంటూ….తన జంబలకిడిపంబ ను మరోసారి 1993 జులై 12 న రిలీజ్ చేశారు…. స్లోగా స్టార్ట్ అయిన ఈ సినిమా ….హిట్….సూపర్ హిట్…బంపర్ హిట్ అయిపోయింది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవడానికి మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వచ్చారు
ముఖ్యంగా స్కూల్ ఎపిసోడ్ హిలేరియస్!
కలెక్షన్స్ :
50 లక్షలతో తీసిన ఈ సినిమా…… 2 కోట్ల కలెక్ట్ చేసింది. విజయవాడ , కాకినాడ థియేటర్లలో 100 రోజులు ఆడింది