Advertisement
బాహుబలి.. మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకు చాటిచెప్పింది.. అటువంటి సినిమాలో ఒక పాత్ర పోషించారు సుబ్బరాజు.. ఆ సినిమాలో నటించిన ఎందరో ప్రముఖ నటులు ప్రభాస్, రానా, అనుష్క, నాజర్, రమ్యకృష్ణ, సత్యదేవ్ వీళ్లందరని పక్కనపెట్టి మరీ సుబ్బరాజుకి పట్టం కట్టారు జపనీయులు… జపాన్ వాళ్లకు సుబ్బు క్యారెక్టర్లో నచ్చిందేంటి.. వారు సుబ్బుపై చూపించిన ప్రేమ ఎలాంటిదో తెలిస్తే ఆశ్చ్యపోతాం..
బాహుబలి సినిమా అనగానే మనకు… బాహుబలి, భల్లాలదేవ,కట్టప్ప, దేవసేన, శివగామి పాత్రలు గుర్తొస్తాయి. మ్యాగ్జిమమ్ వీటిలో ఏదో ఒక పాత్రని ఇష్టపడతాం..కానీ జపాన్ వాళ్లకు మాత్రం….కుమార వర్మ పాత్ర చాలా ఇష్టమట.! మొదట్లో పిరికి వానిగా ఉన్న కుమారవర్మ తర్వాత ధైర్యవంతుడిగా మారడం,ప్రాణాలకు తెగించి మరీ ఇతరులను రక్షించడానికి ముందుకు రావడం జపనీయులకు ఎక్కువగా నచ్చిన అంశమట..దాంతో కుమారవర్మకి సంబంధించిన మీమ్స్,రకరకాల బొమ్మలు చేస్తూ వాళ్లు సుబ్బుపై తమ ప్రేమను ప్రకటించారు.
బాహుబలి సినిమాకు సంబంధించి వివిధ దేశాల టూర్ వెళ్లేటప్పుడు జపాన్ కి సుబ్బుని పంపాలని చిత్రయూనిట్ నిర్ణయించిందట..అంతేకాదు సుబ్బరాజుని పంపాలని జపనీయులు ప్రత్యేక ఆహ్వానం పంపడం కూడా ఒక కారణం.. జపాన్ వెళ్లిన సుబ్బరాజుకి అడుగడుక్కి ఎన్నో సర్ఫ్రైజ్ లు.. వాటన్నింటిని ఇండియా వచ్చాక షేర్ చేసుకున్నారు సుబ్బు.. జపాన్ టూర్లో బాహుబలి షో వేసారు.. సినిమా ప్రారంభానికి ముందు చూద్దామన్న థియేటర్ ముందు,చుట్టుపక్కల పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఒక్కరు కనపడలేదట..ఆ షోకి సుబ్బరాజు బాహుబలిలోని కుమారవర్మ పాత్రలోనే అటెండ్ అయ్యాడు..సుబ్బరాజుని చూడగానే థియేటర్లో జనం అంతా హడావిడిగా వెళ్లి సుబ్బరాజుపై పడిపోకుండా చాలా మర్యాదగా ప్రవర్తించారట..
Advertisement
Advertisements
రోడ్లపై కూడా ఎవరూ టైంపాస్ కి కబుర్లు చెప్పుకుంటూ కనపడిన దాఖలాలే లేవట..సుబ్బు రోడ్ పై కనపడితే అతడి దగ్గరకి వచ్చి పర్మిషన్ అడిగి మరీ క్యూలైన్ లో వచ్చి మరీ ఆటోగ్రాఫ్ తీసుకున్నారట.. జపాన్ టూర్ అయిపోయి సుబ్బరాజు ఇండియా వచ్చేటప్పుడు ఎన్నో గిఫ్ట్స్ పట్టుకుని వచ్చాడు..వాటన్నింటిని అక్కడ వారు స్వయంగా తయారు చేసినవే..
ఈ అభిమానం ఆ ఒక్క సినిమాతో పోలేదు.. అక్కడితో అయిపోలేదు.. ఇప్పటికి జపాన్ నుండి సుబ్బరాజుకి రకరకాల గిఫ్ట్స్ అందుతూనే ఉంటాయి..పుట్టినరోజని,తనది ఏదన్నా కొత్త సినిమా రిలీజైతేనో..ఇలాకారణం ఏదైనా సుబ్బుకి గిఫ్ట్స్ పంపుతూనే ఉంటారు..ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాని జపాన్లో రిలీజ్ చేశారు..అందులో చిన్నపాత్రలో సుబ్బరాజు కనిపించగానే..అక్కడివారందరూ ఆనందంతో వీడియోలు చేసి మరీ సుబ్బుకి పంపించారు.,సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
సూపర్ స్టార్ రజిని కాంత్ కి జపాన్ కంట్రిలో విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం మనకు తెలిసిందే..ఆ తర్వాత ఆ స్థాయిలో అభిమానం పొందిన నటుడు మన సుబ్బరాజే.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్,విలన్,కామెడి విలన్ ని మన దేశంలో వారు గుర్తించకపోయినా జపాన్ ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారు..!
Advertisements