Advertisement
అది 1989 వ సంవత్సరం… తమిళనాడు సిఎం కరుణానిధి బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. మీవన్నీ తప్పుడు హమీలు..కాగితపు లెక్కలంటూ ప్రతిపక్ష పార్టీ నాయకురాలైన జయలలిత ఆ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. DMK పార్టీ నేతలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు…అది కాస్త గొడవకు దారి తీసింది. ఈక్రమంలో జయలలిత పై దాడి జరిగింది. చినిగిన చీరతో అసెంబ్లీని వీడుతూ….. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతానని శపథం చేసింది జయలలిత.
Advertisement
అనుకున్నట్టుగానే 1991 ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలోని AIADMK పార్టీ… 234 సీట్లలో 225 సీట్లను గెలిచి అధికారంలోకి వచ్చింది. జయలలిత తొలిసారిగా తమిళనాడు సిఎం అయ్యారు. తన శపథం ప్రకారం సిఎంగానే తమిళనాడు శాసనసభలో అడుగుపెట్టారు.
Advertisements
Advertisements