Advertisement
జానీలీవర్.. బాలివుడ్లో టాప్ మోస్ట్ కమెడియన్లలో ఒకరు.. మన తెలుగులో బ్రహ్మానందం గారెలాగో..బాలివుడ్లో జానీలివర్ అలా..కేవలం సినిమాలతో మాత్రమే కాదు ఎన్నో స్టేజ్ షోలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన,ఇప్పటికి నవ్విస్తున్న జానీలివర్ మన తెలుగువాడే అనే విషయం చాలామందికి తెలియదు..బాలివుడ్ హాస్యనటుడు జానీలివర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..
జానీలివర్ అసలు పేరు జాన్ ప్రకాశరావు జనుమల.. స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కనిగిరి, తల్లిదండ్రులు ప్రకాశరావు,కరుణమ్మ.. జానీలివర్ తండ్రి ప్రకాశ్ రావు హిందుస్తాన్ లివర్ లో ఆపరేటర్ గా చిన్న ఉద్యోగం చేసేవాడు..ముంబైలో ఉద్యోగం కావడంతో కుటుంబం అంతా అక్కడే స్థిరపడింది.జానీలివర్ పుట్టి పెరిగింది ముంబయిలోనే.. కానీ వీరి చుట్టాలంతా ప్రకాశం జిల్లాలోని కనిగిరి,దర్శి,సంత నూతలపాడులోనే ఉన్నారు..వారందరిని కలవడానికి జానీ అప్పుడప్పుడు ప్రకాశం జిల్లాకు వస్తుంటారు.
హింది నటుడు,ముంబయిలోనే పుట్టి పెరిగాడు కాబట్టి హింది మాత్రమే వచ్చుండొచ్చు అనుకుంటే పొరపాటు.. జానీ హింది,ఇంగ్లీష్ తో పాటు స్వచ్చమైన తెలుగు భాష మాట్లాడగలరు..ఏడవతరగతితోనే చదువు ఆపేసిన జానీ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండడానికి ఎన్నో పనులు చేసాడు.ముంబై వీధుల్లో పెన్నులు అమ్మాడు..బాలివుడ్ నటులని అనుకరిస్తూ రోడ్లపై వెళ్లేవాళ్లని నవ్వించి డబ్బులు సంపాదించాడు..ఒకరోజు హిందుస్తాన్ లివర్ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్నాడు..ఆ స్టేజ్ షో లో సంస్థలోని పెద్దలని అనుకరిస్తూ మిమిక్రి చేశాడు..జాన్ మిమిక్రికి హిందుస్తాన్ లివర్ ముంబై ఉద్యోగులంతా పెద్ద ఫ్యాన్స్..జాన్ నుండి జానీలివర్ గా మారింది అప్పుడే..జాన్ తన పేరుని జానీగా మార్చుకుంటే..అక్కడి ఉద్యోగులు కంపెనిలోని లివర్ పేరుని జానీకి జోడించి జాన్ ప్రకాశరావుని జానీలివర్ గా మార్చారు..
Advertisements
Advertisement
తర్వాత మెళ్లిమెళ్లిగా స్టేజి షోలతో కళాకారుడిగా మారాడు..తన స్టాండప్ కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగలిగినప్పటికి పూర్తి స్థాయిలో సెటిల్ కావడానికి సుమారు ఆరేళ్లు కష్టపడ్డాడు..తుమ్ పర్ హమ్ కుర్బాన్ జానీ నటించిన తొలిచిత్రం..ఆ సినిమాలో జానీలోని హాస్య చతురత గుర్తించిన సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ మలి అవకాశం ఇవ్వడంతో మొదలైన జానీ కెరీర్ సుమారు 340చిత్రాల వరకు సాగింది..జానీ మొదటి మేజర్ హిట్ అంటే షారూక్ నటించిన బాజిగర్..
జానీ భార్య సుజాత తెలుగు అమ్మాయే..జానికి ఇద్దరు పిల్లలు కూతురు జామిలివర్, కొడుకు జెస్సీ లివర్.. తండ్రి పోలికలు కూతురికి వచ్చాయి..జామి లండన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యుటివ్ గా పనిచేసే రోజుల్లో అనుకోకుండా ఒకరోజు కామెడి క్లబ్ లో పార్టిసిపేట్ చేయాల్సొచ్చింది..తనదైన స్టైల్లో వేసిన పంచ్ లకు జనాలు పడిపడి నవ్వడంతో,తండ్రి నుండి తనకు వారసత్వంగా వచ్చిందని భావించిన జామి..అప్పుడే ఉద్యోగాన్ని వదిలేసి ఇండియా వచ్చేసింది.అప్పటి నుండి కామెడి షోస్ చేస్తూ ఇండియన్ స్టాండ్ అప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది..తండ్రి కూతుర్లు కలిసి ఇప్పటి వరకు 150కి పైగా లైవ్ షోలు చేసారు..జానీ కొడుకు జెస్సి కూడా మనకు సుపరిచితుడే..బాలివుడ్లో అవకాశాలతో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాడు..
Advertisements
జానీలివర్ ఇప్పటివరకు 340 చిత్రాల్లో నటించారు, ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో స్టేజ్ షోలు ఇచ్చారు.. బుల్లితెరపై కామెడి షోలకు యాంకర్ గా, జడ్జ్ గా వ్యవహరించారు.ఒకట్రెండు పాటలు కూడా పాడారు.. సుమారు పదమూడు సార్లు ఫిలింఫేర్ అవార్డ్ నామినేషన్లకు ఎన్నికై రెండు సార్లు గెలుపొందారు..