Advertisement
1500 ఏళ్ల క్రితం రాసిన శిలప్పదికారంలోని ముఖ్య పాత్ర కణ్ణగి. మన దేశంలో రామాయణ మహాభారతాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో….తమిళంలో అంతే ప్రాధాన్యం గల రెండు రచనల్లో ఇలాంగో అడింగల్ రాసిన శిలప్పదికారం ఒకటి.! మరోటి మణిమేఖలై.
కణ్ణగి మణయకన్ అనే వ్యాపారి కూతురు. తండ్రి ఆమెను కావేరీ పట్టణపు ధనిక వ్యాపారి కుమారుడు కోవలన్ కి ఇచ్చి పెళ్లి చేశాడు. వీరి కాపురం ఆనందభరితంగా సాగుతున్న సమయంలో …. మాధవి అనే రాజ నర్తకితో ప్రేమలో పడతాడు కోవలన్.! ఆమె వ్యామోహంలో తన ఆస్తినంతా ఆమెకు ధారాదత్తం చేస్తాడు.
తన తప్పును తెలుసుకుకొని భార్య దగ్గరికి వస్తాడు కోవలన్..! తినడానికి తిండి లేని సమయంలో తన విలువైన కాలి గజ్జెల్లో ఒకదానిని కోవలన్ కు ఇచ్చి అమ్ముకురమ్మని చెబుతుంది కణ్ణగి…. అదే సమయంలో మధురై ను పాలిస్తున్న పాండ్య రాజు నెడుంజ్ చెలియన్ 1 భార్య కాలిగజ్జెల్లో ఒకటి దొంగిలించబడుతుంది.
Advertisements
కోవలన్ తన భార్య గజ్జెను అమ్ముతున్న సమయంలో….ఇది రాణిగారి కాలి గజ్జె అని దానిని కోవలన్ దొంగిలించాడని అనుకొని…భటులు కోవలన్ ను రాజు దగ్గరకు తీసుకెళతారు. విచారణ లేకుండానే అతనిని చంపేస్తారు.
Advertisement
ఈ విషయం తెల్సుకున్న కణ్ణగి… ఆగ్రహంతో రాజదర్భార్ లో ప్రవేశించి రాజుతో వాదనకు దిగుతుంది. తన దగ్గరున్న ఇంకొక కాలి గజ్జెను తెచ్చి… దానిని విరగొట్టి దానిలోని కెంపులను చూపిస్తుంది. తన భర్త దొంగిలించాడని భావించిన కాలిగజ్జెను కూడా విరగొట్టగా అందులో కూడా కెంపులే ఉంటాయి. ఇప్పుడు రాణి దగ్గర ఉన్న కాలిగజ్జెను విరగొట్టగా అందులో ముత్యాలుంటాయి. ఈ రెండు వేర్వేరని …తన భర్తను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారని కణ్ణగి కన్నీరుమున్నీరవుతుంది. తన తప్పుకు ఆ రాజు అక్కడే మరణిస్తాడు!
తన భర్త మరణాన్ని తట్టుకోలేకపోయిన కణ్ణగి తన ఒక రొమ్మును కోసి…మధురై నగరం మీదకు విసిరి..నగరం తగలబడిపోవాలంటూ శపిస్తుంది. దేవతల కోరికపై తన శాపాన్ని విరమించి మోక్షం పొందుతుంది. తమిళనాడులో ఈమె పేరు ఓ గుడి కూడా కట్టబడింది.
Advertisements