Advertisement
నలుగురు ఈదుతున్న వ్యక్తులు…ఒకరు స్పృహలో లేని వ్యక్తి . ఈ వీడియోను షేర్ చేస్తూ నలుగురు కలిసి ఒకడిని అమానుషంగా చంపేస్తున్నారనే ట్యాగ్ లైన్ తో …ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. ఇది ఫేక్ న్యూస్. నిజానికి ఆ నలుగురు కలిసి అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని వక్రీకరించి ఇరు వర్గాల మద్య వైషమ్యాలను పెంచేదిగా కొంత మంది….ఈ వీడియోను నెగెటివ్ గా ప్రచారం చేశారు.
అసలు విషయం : వృత్తి రీత్యా మత్స్యకారుడైన మహ్మద్ గజ ఈతగాడు.. వరదల్లో, నీటిలో నుండి శవాల్ని వెలికితీయడంలో కర్నాటక ప్రభుత్వం ఇతని సహాయం తీసుకుంటుంది. గత యేడాది నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకున్న కాఫీ డే ఓనర్ సిద్దార్థ శవాన్ని వెతికే ప్రయత్నాల్లో కూడా ఇతను పాల్గొన్నాడు. ఇటీవల ఇతని సెల్ ఫోన్ కి ఎవరో కాల్ చేశారు.- తమ గ్రామ సమీపంలో ఉన్న పనెమంగలూరు బ్రిడ్జిపై నుండి ఓ వ్యక్తి నీళ్ళలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడనేది – ఆ కాల్ సారాంశం.
Advertisement
మరో ఆలోచన లేకుండా, క్షణాల్లో తన నలుగురు స్నేహితులతో అక్కడికి చేరుకున్న మహ్మద్ నీళ్లలోకి దూకేశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తూ – ఆ వ్యక్తి మరుసటిరోజు ఆస్పత్రిలో చనిపోయాడు. ఆ వ్యక్తి పేరు – నిషాంత్.
ఫేక్ న్యూస్ పుట్టించారిలా:
మహమ్మద్, అతని మిత్రులు నీళ్లల్లోకి దూకి ఆ వ్యక్తిని కాపాడే దృశ్యాల్ని, బ్రిడ్జ్ పై ఉన్న కొంతమంది తమ సెల్ ఫోనుల్లో షూట్ చేశారు. ఇది ఒక ఫోన్ నుండీ మరో ఫోన్ కి ఫార్వర్డ్ చేయబడి కొన్ని వేలమంది దానిని చూశారు.వారిని మెచ్చుకున్నారు. ఇదే వీడియోను “నలుగురు కలిసి ఒకడిని అమానుషంగా చంపేస్తున్నారు” అంటూ వక్రీకరించారు..అది అలాగే మరింత వేగంగా సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొట్టింది. కాపాడడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెగించిన అతన్ని ఉగ్రవాదిని చేసేశారు…తమ తమ మెసేజెస్ తో….!
Advertisements
We Are All one…JAIHIND
Watch video:
Advertisements