Advertisement
ఒక బిజినెస్ మ్యాన్….తన ఆఫీస్ లోని మీటింగ్ కు అటెండ్ అవ్వడానికి త్వరగా రెడీ అయ్యి..తన కార్ డోర్ తీసాడు.! ఇంతలో అప్పటికే కార్ దగ్గరున్న ఓకుక్క అతడిని కరిచింది. ఆ కోపంలో రెండు రాళ్లు తీసుకొని కుక్క మీదకు విసిరేసాడు బిజినెస్ మాన్…కానీ ఆ రాళ్ళేవి కుక్కకు తాకలేదు, కుక్క పారిపోయింది.
అదే కోపంతో మీటింగ్ కు వెళ్లిన బిజినెస్ మాన్…ఆ కోపాన్నంతా తన మేనేజర్ మీద తీసాడు. మేనేజర్ ఆ ఫ్రస్టేషన్ ను తన కింది ఉద్యోగుల మీద తీసాడు….ఇలా కోపం ట్రాన్స్ఫర్ అవుతూ ….చివరకు ఆ ఆఫీస్ లో పని చేసే ప్యూన్ మీద తీయ్యబడింది… నిజానికి ఇది అతనికి ఏ మాత్రం సంబంధం లేని అంశం.
Advertisement
ఆఫీస్ టైం అయిపోయింది…ప్యూను ఇంటికి వెళ్లి , డోర్ కొట్టాడు. డోర్ తీసిన భార్య… “ఏంటండీ ఇంత లేట్” అని అడిగింది. కోపం తట్టుకోలేని అతను లాగి భార్య చెంప మీద కొట్టాడు. ‘పనికి వెళ్లి వచ్చిన వారిని విసిగించొద్దని తెలియదా’ అంటూ నోటికొచ్చినట్టు తిట్టేసాడు. భర్త తనను కొట్టడాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది. బెడ్ రూమ్ లోకి వెళ్లాలనుకుంది…హాల్ లో టీవీ చూస్తున్న కొడుకు దగ్గరికి వెళ్లి …ఎప్పుడూ టీవీ యేనా..? చదవడం ఏం లేదా అంటూ కొడుకుని కొట్టింది …తల్లి కొట్టడంతో మనస్తాపానికి గురైన కొడుకు …ఇంట్లోంచి బయటికి పరిగెత్తాడు…అలా పరిగెత్తుతున్న ఆ పిల్లాడి వెంట ఓ కుక్క పడింది….కుక్కను గమనించిన ఆ పిల్లాడు రాయి తీసుకొని గురి చూసి విసిరాడు ..రాయి కుక్కకు తగిలింది, ఆ దెబ్బకు కుక్క నొప్పితో విలవిలలాడుతూ పడిపోయింది .. ఈ కుక్కే మొదట్లో బిజినెస్ మాన్ ను కరిచిన కుక్క .
Advertisements