Advertisement
కర్ణాటకకు చెందిన అన్నదమ్ములు తజముల్ , ముజమిల్ లు కోలార్ లో తమకున్న స్థలాన్ని అమ్మి దానితో వొచ్చిన 25 లక్షలతో …లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఆకలితో అలమటిస్తున్న వారికి సరుకులను అందిస్తున్నారు . ఇప్పటి వరకు 2800 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించారు. మరోవైపు ఇంటి ముందే టెంట్ వేసి వండుకునే సదుపాయాలు లేని వారికి వీరే వంట చేసి భోజనాలు పెడుతున్నారు ..ఇప్పటి వరకు 2000 మందికి భోజనాలు పెట్టారు.
Advertisement
ఆస్తి అమ్ముకొని మరీ పెట్టాల్సిన అవసరమేంటని …అడిగిన దానికి ఆ అన్నదమ్ములు ఇచ్చిన సమాధానం నిజంగా అభినందనీయం వారిచ్చిన సమాధానం ” మేము చిన్నప్పుడు మా ఊరు నుండి ఇక్కడికి బతకడానికి వచ్చాము…తినడానికి తిండి లేకపోతే…ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాకింత అన్నం పెట్టారు…4వ తరగతి వరకే చదివిన మేము ఎలాగోలా మా జీవితాలను నిలబెట్టుకొని ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాము… అప్పుడు మాకొచ్చిన పరిస్థితి ఇప్పుడు వేరే వారికొచ్చింది…గతం గుర్తున్న మేము ….వారికి కాస్తైనా సహాయంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం”
Advertisements