Advertisement
తనతో పెళ్లికి నిరాకరించిందని …ఓ అమ్మాయిని పట్టపగలు కిడ్నాప్ చేసిన ఘటన కర్నాటకలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం….కర్నాటకలోని కోలార్ ప్రాంతానికి చెందిన ఓ యువతి 11:30 ప్రాంతంలో తన స్నేహితురాలితో కలిసి రోడ్డు పక్కన నడుస్తుండగా….. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు …ఇన్నోవా కార్ లో వచ్చి …ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు.! ఆమెతో పాటు ఉన్న మరో అమ్మాయి తన స్నేహితురాలిని కిడ్నాపర్ల చెర నుండి విడిపించడానికి విశ్వప్రయత్నం చేసింది! అప్పటికే వాళ్లు అక్కడి నుండి కార్ లో పారిపోయారు. ఈ దృశ్యాలు అక్కడి CCTV లో రికార్డ్ అయ్యాయి!
Advertisement
కిడ్నాప్ చేసిన వారిలో శివశంకర్ అనే అతను …తనను పెళ్లి చేసుకోడానికి నిరాకరించిన కారణంగానే కిడ్నాప్ చేశానని…తనను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని తుముకూరులోని లాడ్జ్ లో బంధించి… ఆ యువతిని బలవంత పెట్టాడు…. ఆ అమ్మాయి తెలివిగా వ్యవహారించి…తన కిడ్నాప్ ఉదంతాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో అలర్ట్ అయిన పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. దీంతో కిడ్నాపర్లు అక్కడే తమ కార్ ను వదిలి పారిపోయారు. అమ్మాయి సురక్షితంగా బయటపడింది. కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.!
Watch Video :
Advertisements
Advertisements