Advertisement
జీవితంలో ఎంతో కష్టపడితేనే గానీ డబ్బు సంపాదించలేం. కానీ కౌన్ బనేగా కరోడ్ పతి (KBC ) అనబడే ఒక్క షో మాత్రం అతి సామాన్యులకు కూడా కోటీశ్వరులయ్యే అవకాశాన్ని కల్పించింది. గతంలో ఎంతో మంది ఆ షోలలో పాల్గొని రూ.1 కోటి ప్రైజ్ మనీని గెలుపొందారు. అయితే ఇప్పుడు వారంతా ఏం చేస్తున్నారు ? అప్పుడు ప్రైజ్ మనీగా గెలుచుకున్న ఆ డబ్బును వారు ఏం చేశారు ? అనే ప్రశ్నలు సహజంగానే కొందరికి వస్తుంటాయి. మరి వాటికి సమాధానాలను కనుక్కునే ప్రయత్నం చేద్దామా..!
1. హర్షవర్ధన్ నవాతే (సీజన్ 1):
కేబీసీ సీజన్ 1 విజేత హర్షవర్ధన్ నవాతే. తొలి సీజన్‌లోనే ఈయన రూ.1 కోటి ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. కేబీసీలో మొదటగా రూ.1 కోటి గెలుచుకున్న అభ్యర్థిగా నిలిచాడు. ఈయన ఆ మొత్తంతో యూకేలో ఎంబీఏ చదివాడు. ఇండియాకు వచ్చి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్నాడు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
2. రవి సైని, కేబీసీ జూనియర్ విన్నర్ (సీజన్ 2):
Advertisements
14 సంవత్సరాల వయస్సులోనే రవి సైని రూ.1 కోటి ప్రైజ్ మనీని కేబీసీ షోలో గెలుచుకున్నాడు. యూపీఎస్‌సీ పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఐపీఎస్ అయ్యాడు.
3. రహత్ తస్లీం (సీజన్ 4):
ఈమె దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చింది. కేబీసీ షోలో తనకు వచ్చిన మొత్తంతో ప్రస్తుతం గార్మెంట్ స్టోర్ నడిపిస్తోంది.
4. సుశీల్ కుమార్ (సీజన్ 5)
కేబీసీ చరిత్రలోనే రూ.5 కోట్లు గెలుచుకున్న మొదటి వ్యక్తిగా సుశీల్ కుమార్ రికార్డులకెక్కాడు. ఆ మొత్తంతో ఇల్లు కొనుక్కుని సంతోషంగా ఉందామనుకున్నాడు. కానీ అతనిప్పుడు ఆర్థికంగా సమస్యల్లో ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగం, డబ్బు లేక సమస్యలలో ఉన్నట్లు సమాచారం.
5. సన్‌మీత్ కౌర్ (సీజన్ 6)
Advertisement
ఈమె ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంది. షోలో రూ.5 కోట్లు గెలుచుకుంది. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్ అయ్యి తన సొంత బ్రాండ్ పేరిట దుస్తులను విక్రయిస్తోంది.
6. తాజ్ మహమ్మద్ రంగ్రెజ్ (సీజన్ 7)
ఇతను కేబీసీ షోలో తనకు వచ్చిన మొత్తంతో తన కుమార్తెకు వైద్య చికిత్స అందించగలిగాడు. సామాజిక సేవా కార్యక్రమాలు చేశాడు. సొంతంగా ఇల్లు కొన్నాడు. ఇద్దరు అనాథ యువతుల పెళ్లికి సహాయం చేశాడు.
7. అచిన్ నరులా, సార్థక్ నరులా (సీజన్ 8)
వీరిద్దరూ అన్నదమ్ములు. కేబీసీ షోలో తమకు వచ్చిన రూ.7 కోట్లతో క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ తల్లికి చికిత్స అందించారు. కానీ ఆమె కొన్నాళ్లకు చనిపోయింది. ఇక మిగిలిన మొత్తంతో ఇద్దరూ కలిసి వ్యాపారం ప్రారంభించారు.
8. అనామిక మజుందార్ (సీజన్ 9)
ఈమె కేబీసీలో రూ.1 కోటి గెలుచుకుంది. ఆ మొత్తాన్ని తాను సొంతంగా నడిపిస్తున్న ఎన్‌జీవోకు ఇచ్చింది. వాటిని ఆమె సమాజ సేవకు ఉపయోగించింది.
9. బినితా జైన్ (సీజన్ 10)
ఈమె భర్త ఉగ్రవాదుల దాడిలో మరణించాడు. కేబీసీ షోలో పాల్గొనేనాటికి ఈమె తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. ఈమె ఆ షోలో వచ్చిన రూ.1 కోటితో కోచింగ్ సెంటర్ ప్రారంభించి దానిపై ఆధారపడి జీవిస్తోంది.
10. సనోజ్ రాజ్ (సీజన్ 11)
ఇతను లేటెస్ట్ సీజన్ కేబీసీ షో విన్నర్. యూపీఎస్సీ పరీక్షలు రాసి సివిల్ సర్వెంట్‌గా సేవలు అందించాలని యత్నిస్తున్నాడు. అతని కల నిజం కావాలని కోరుకుందాం.
Advertisements