Advertisement
గాల్వాన్ లోయలో చైనా దాడిలో మరణించిన సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ సిఎం KCR 5 కోట్ల నష్టపరిహారం ప్రకటించారు. దీంతో పాటు భార్యకు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగం. నివాస స్థలాన్ని ప్రభుత్వం తరఫున ఇస్తామని హామీ ఇచ్చారు.
అంతే కాకుండా…చైనాతో ఘర్షణలో మరణించిన ప్రతి సైనికుడికి తెలంగాణ ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలను ఇస్తున్నట్టు ప్రకటించారు.!
సంతోష్ బాబుది తెలంగాణ లోని సూర్యాపేట. కోరుకొండ సైనిక్ స్కూల్ లో చదివిన సంతోష్ బాబు అంచెలంచెలుగా కల్నల్ స్థాయి వరకు ఎదిగారు. ప్రమాదమని తెలిసినా..సంతోష్ బాబు తన సైన్యంతో చైనాను గాల్వాన్ లోయ వద్ద నిలువరించే ప్రయత్నం చేశారు. ముందుగానే ప్లానింగ్ తో వచ్చిన చైనా రాళ్లతో, మేకులున్న చెక్కలతో దాడి చేసింది. కత్తులు కూడా తీసుకొచ్చిందనే సమాచారం అందుతోంది.!
Advertisement
ఒప్పందం ప్రకారం గాల్వాన్ ప్రాంతంలో ఇరుదేశ సైనికులు ఆయుధాలను వాడడం నిషేదం అందుకే …ఆ సమయంలో ఎవరి చేతిలో తుపాకులు లేవు…అందుకే చైనా రాళ్లు, మేకులున్న చెక్కలు, కత్తులతో మన సైనికుల మీద దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 20 మంది ఇండియన్ సైనికులు వీర మరణం పొందారు.
Advertisements
రాత్రి ప్రాంతం…మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత,…ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం…దీనికి తోడు బలమైన గాయాలు…వీటి కారణంగా మన సైనికులు అమరులయ్యారు.
తమిళనాడుకు చెందిన సైనికుడు పళనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది. కుటుంబంలో ఓ ఉద్యోగాన్ని ఇస్తామని కూడా హామీ ఇచ్చారు తమిళనాడు సిఎం.
Advertisements