Advertisement
KCR ప్రెస్ మీట్ స్టార్ట్ చేశాడంటే చాలు… “రాహుల్ వచ్చాడా ? ఈ సారి ఏం ప్రశ్న అడుగుతాడో” అంటూ జనాలు ఎదురుచూస్తున్నారు. నిజంగా ఏ రిపోర్టర్ కు రాని క్రేజ్ రాహుల్ కు వచ్చింది. సిఎం ఎంత పరుషంగా మాట్లాడిన మరో ప్రెస్ మీట్ లో అంతే నిబద్దతగా జనం తరఫున ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు రాహుల్. యూట్యూబ్ ఛానల్స్ రాహుల్ కు పంచ్ ఇచ్చిన కెసిఆర్ అంటూ ఎన్ని వీడియోస్ చేసిన …వాటి కింద కామెంట్స్ లో మాత్రం రాహుల్ ను తెగ పొగుడుతున్నారు నెటీజన్లు.!
Advertisement
ఈ పొగడ్తలకు, జనాల అభిమానానికి రాహుల్ 100 శాతం అర్హుడు. ఆయన నిబద్దత, నిజాయితీ అలాంటివి మరి.! ది హిందూ పత్రికలో సీనియర్ రిపోర్టర్ అయిన రాహుల్….. సిఎం వ్యవహారాలకు సంబంధించిన న్యూస్ ను తన పత్రికలో రాస్తుంటారు. ప్రభుత్వ పరిపాలన గురించి సమగ్రంగా తెలిసిన వారు కావడం చేత ఆయన ప్రశ్నలు సైతం లోతుగా ఉంటాయి.
రాహుల్ మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి క్లాస్ మేట్…ఇద్దరూ నిజాం కాలేజ్ లో కలిసి చదువుకున్నారు. కిరణ్ సిఎంగా ఉన్నప్పుడు నామినేటెడ్ పదవి ఇస్తానని ఆశ చూపిన వెళ్లలేదట! అంతటి నిజాయితీ ఆయన సొంతమని మీడియా జనం రాహుల్ ను గురించి చెప్పుకుంటారు!
Advertisements