Advertisement
కుక్కకు నెయ్యి ఇమడదు అని సామెత.. ఎమ్మార్వో స్థాయి అధికారి ప్రజలకు నేరుగా సాయం చేస్తూ ప్రజల మనిషిగా ఉండాల్సిన వ్యక్తి, తన భవిష్యత్ ని తనే కాలరాసుకోవడం అంటే ఇదే.. పక్క మండలంలో లంచం వేధింపులు తట్టుకోలేక అధికారిణిని రైతు సజీవ దహనం చేసినా కూడా భయం లేని పరిస్థితి అంటే ఎంత దిగజారారో అర్దం చేసుకోవచ్చు.. ఎసిబి చరిత్రలోనే తొలిసారి ఒక ఎమ్మార్వో కోట్లకు పడగలెత్తిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..
మేడ్చల్ డిస్ట్రిక్ట్ కీసర తహసీల్దార్ నాగరాజు 1కోటి పదిలక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.. భూరికార్డుల్లో పేర్లు మార్చడం, పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వడం కోసం రెండు కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం..అందులో తొలివిడతగా కోటి రూపాయలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు నాగరాజు ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు…
Advertisement
కీసర మండలంలోని రాంపల్లి దాయర గ్రామానికి చెందిన సర్వే నంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టులో కేసు నడుస్తోంది.. ఈ వ్యవహారంలో ఓ వర్గానికి అనుకూలంగా రికార్డులు తయారుచేయడానికి తహసీల్దార్ రూ.2 కోట్ల లంచం డిమాండ్ చేసి, శుక్రవారం రాత్రి ఏఎస్‌రావు నగర్‌లోని తన ఇంటివద్ద మొదటి విడతగా రూ.కోటీ 10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు..ఎమ్మార్వోకి సహకరించిన కందాడి అంజిరెడ్డి, శ్రీనాథ్ యాదవ్, వీఆర్‌ఏ సాయిరాజ్ ముగ్గురినీ కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు..
టైపిస్ట్ నుండి కోట్లకు పడగలు..
Advertisements
ఎమ్మార్వో స్థాయి అధికారి ఇంత పెద్దమొత్తంలో లంచం డిమాండ్ చేయడం ఎసిబి చరిత్రలోనే తొలిసారి.. టైపిస్ట్ గా ప్రారంభమైన నాగరాజు ఉద్యోగజీవితం ప్రమోషన్ పై తహసీల్దార్ గా మారాడు..డిప్యూటి తహసీల్దార్ గా ఉన్నప్పుడు కూడా అవినీతికి పాల్పడి ఎసిబికి చిక్కాడు..గతంలో ఈయనగారి లంచాల బాధ తట్టుకోలేక చీర్యాలలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisements