Advertisement
కేరళ సిఎం పినరయ్ విజయన్ సామాన్య కల్లుగీత కార్మిక కుటుంబం నుండి వచ్చిన సంగతి తెలిసిందే.. ఒక రాష్ట్రానికి సిఎం అయినప్పటికి అతను సాధారణ జీవితమే గడుపుతుంటాడు.కులం వద్దు,మతం వద్దు అని చాలామంది మాటల్లో ఆదర్శం వల్లెవేస్తుంటారు..కానీ వాస్తవం వేరుగా ఉంటుంది..కానీ కూతురి పెళ్లి అతి సాధారణంగా జరపడమే కాదు, మతాంతర వివాహం చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు విజయన్..
రియాజ్ – వీణాల పరిచయం,పరిణయం..
Advertisement
విద్యార్ధి నాయకుడిగా రాజకీయాల్లో ఉన్న రియాజ్ ప్రస్తుతం DYFI జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు..గత ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు.. DYFI పిలుపునిచ్చిన బీఫ్ ఫెస్టివల్ లో రియాజ్ ప్రముఖంగా పాల్గొన్నారు..అదే కార్యక్రమంలో పాల్గొన్న వీణాకి రియాజ్ తో పరిచయం ఏర్పడింది. ఒరాకిల్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసిన వీణ,ప్రస్తుతం బెంగళూర్ లో ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెడ్ గా ఉన్నారు.. ఈ కంపెనీని ఆమె స్వయంగా స్థాపించారు.. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వీణకి రియాజ్ తో పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో ఇద్దరూ ఏకం అయ్యారు..రియాజ్, వీణలిద్దరికి ఇది రెండో వివాహమే..వీణకి ఏడేళ్ల కుమారుడు ఉన్నారు..
Advertisements
Advertisements
సిఎం కూతురి పెళ్లి అంటే కొంచెం హంగూ ఆర్బాటం సహజం..కానీ ఈ పెళ్లిలో అవేం లేవు..సిఎం అధికారిక భవనంలో పెళ్లి కొడుకు,పెళ్లికూతురు.. దగ్గర కుటుంబ సభ్యులు, ముప్పై మందికి మించని అతిధులు.. రెండు దండలు.. పెళ్లి తంతు ముగిసింది..