Advertisement
సోషల్ మీడియా మొత్తం ….ఇప్పుడు ఈ జంట హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.! విపరీతమైన ట్రోల్స్ ఒకవైపు, గుడ్ క్రియేటివిటీ అంటూ పొగడ్తలు మరోవైపు! ఇంతకీ ఎవరీ జంట…ఈ ఫోటోలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
ఈ ఫోటోల్లో కనిపించే జంట….హృతి కార్తికేయన్, లక్ష్మీ. వీరిది కేరళ. సెప్టెంబర్ 16 న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు లాక్ డౌన్ కారణంగా అప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటోలు దిగలేదు. అందుకే ఇప్పుడు హనీమూన్ కమ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ ను ప్లాన్ చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగినవే ఈ ఫోటోలు.
Advertisement
తమ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోలు డిఫరెంట్ గా ఉండాలని…హృతి కార్తికేయన్ తన స్నేహితుడైన అఖిల్ ను సంప్రదింస్తే …అఖిల్ ఇచ్చిన ఐడియా ఇది.! అఖిల్ ఫోటో గ్రాఫర్ కావడంతో …అతనే ఈ ఫోటోలను తీశాడు. కేరళ లోని ఇడుక్కి వేగమోన్ టీ తోటల్లో….. వధూవరులిద్దరూ వైట్ బెడ్ షీట్లను చుట్టుకొని రకరకాల భంగిమల్లో దిగిన ఫోటోలే ఇవి.!
Advertisements
తమ మీద వస్తున్న ట్రోల్స్ పై వధువు లక్ష్మీ స్పందిస్తూ …… అందరిలా సాంప్రదాయ దుస్తువులు ధరించి, ఒకరి చేయి ఒకరు పట్టుకొని గుడి చుట్టూ ప్రదిక్షణలు చేస్తూ రొటీన్ గా ఫోటోలు దిగాలనిపించలేదు…అందుకే ఇలా ప్లాన్ చేశాం. ట్రోల్స్ గురించి నేను పట్టించుకోనంటూ తెలిపింది!
Advertisements