Advertisement
మన దేశంలో అక్షరాస్యత విషయంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కేరళలోనే అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. అక్కడ చదువుకున్నవారు ఎక్కువ. ఇక ఆ రాష్ట్రంలో విద్యకు కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. అవును.. కింద ఇచ్చిన ఫొటో కూడా ఆ విషయాన్నే రుజువు చేస్తుంది. ఒక విద్యార్థిని పరీక్షల కోసం ఒక బోటును ఉపయోగించారు. అందులో కేవలం ఆమెనే ప్రయాణం చేసింది. ఇతర ప్రయాణికులెవరూ లేకున్నా.. కేవలం ఆమె ఆ కోసమే ఆ బోటును నడిపారు.
శాండ్రా బాబు అనే విద్యార్థినిది అళప్పుర జిల్లాలోని కైనకరి ప్రాంతం. కానీ ఆమె అదే జిల్లాలోని ఎంఎన్ బ్లాక్ ప్రాంతంలో బంధువుల ఇంట్లో ఉంటోంది. కొట్టాయం జిల్లాలోని కాంజీరాంలో ఉన్న ఎస్ఎన్‌డీపీ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఆమె 11వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆంక్షలు సడలించడంతో ఆ బోర్డు ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది. అయితే అందుకు గాను ఆమెకు రవాణా సదుపాయం లేదు. దీంతో ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లేందుకు ఆమె ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయితే విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర వాటర్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం అధికారులు ఆమెకు ఓ బోటులో రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisements
ఆ బోటులో నిజానికి 70 మంది ప్రయాణికులు వెళ్లవచ్చు. కానీ ఆ విద్యార్థిని పరీక్షలు రాయాల్సి ఉండడంతో ఎమర్జెన్సీగా ప్రయాణం కోసం ఆ బోటును వినియోగించారు. దీంతో ఇతర ప్రయాణికులెవరూ లేకున్నా.. కేవలం ఆమె కోసమే బోటును నడిపారు. ఆ బోటులో ఆమె ఒక్కతే ప్రయాణించింది. మే 29, 30 తేదీల్లో ఆమెను బోటులో స్కూల్ వద్ద దింపారు. పరీక్ష కాగానే తిరిగి తీసుకువచ్చి ఇంటి వద్ద దిగబెట్టారు. ఈ క్రమంలో ఆమె విజయవంతంగా పరీక్షలు రాసింది. అందుకు గాను ఆమె అక్కడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. చూశారుగా.. అదీ కేరళలో విద్యకు ఇచ్చే విలువ.. అందుకనే ఆ రాష్ట్రం అక్షరాస్యతలో నంబర్ వన్ స్థానంలో ఉంది.
Advertisements