Advertisement
ప్రపంచంలో అనేక దేశాల్లో రకరకాల మాంసాలను తినేవారు ఉన్నారు. ముఖ్యంగా చైనా విషయానికి వస్తే అక్కడ అదీ, ఇదీ అని లేదు. దేన్ని పడితే దాన్ని తింటారు. ముఖ్యంగా కుక్క మాంసానికి అక్కడ గిరాకీ ఎక్కువ. దీంతో అనేక షాపుల్లో అక్కడ కుక్క మాంసం విక్రయిస్తుంటారు. అలాగే కుక్క మాంసంతో వండిన వంటకాలను అక్కడి అనేక రెస్టారెంట్లలో వడ్డిస్తుంటారు. అయితే నిజానికి చైనాలో ఏడాదికి సుమారుగా 1 కోటికి పైగానే కుక్కలను మాంసం కోసం చంపుతున్నారట.
అంటే దాదాపుగా రోజుకు అక్కడ 27వేల వరకు కుక్కలను మాంసం కోసం చంపుతున్నట్లు లెక్క. ఈ క్రమంలోనే కుక్కలను అక్కడ మాంసం కోసం పెంచడం కూడా పరిపాటిగా మారింది. మనం ఇక్కడ చికెన్, మటన్ తిన్నట్లుగా చైనీయులు అక్కడ కుక్క మాంసాన్ని ఇష్టంగా తింటారు. అయితే కుక్క మాంసం అమ్మడం ఏమోగానీ వాటిని వారు అక్కడ అనేక చిత్రహింసలకు గురి చేస్తారట. వాటిని ఇనుప బోన్లలో బంధించి చిత్ర హింసలు పెడుతూ చంపి తరువాత వాటి నుంచి మాంసాన్ని సేకరిస్తారట.
Advertisement

ఇక అక్కడ కేజీ కుక్క మాంసం ధర సుమారుగా 10 నుంచి 20 యువాన్ల మధ్య ఉంటుంది. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.110 నుంచి రూ.220 వరకు ఉంటుందన్నమాట. ఇక ఒక్క కుక్క నుంచి వచ్చే మొత్తం మాంసం కావాలంటే దాదాపుగా 80 యువాన్లు (రూ.878) చెల్లించాలి. ఈ క్రమంలోనే అక్కడ కుక్క మాంసం వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది.
అయితే కుక్కలను హింసిస్తూ వాటి మాంసాన్ని సేకరిస్తున్నందున అక్కడ కొన్ని జంతు సంరక్షణ సంస్థలు ఈ విషయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. జంతు ప్రేమికులు అడపా దడపా కుక్కలను చంపవద్దని ప్రదర్శనలు ఇస్తూనే ఉంటారు. అయినప్పటికీ వారు వింటే కదా.. కుక్కలను చంపడం, తినడం ఇదేవారి పని..!
Advertisements