Advertisement
అనామికా శుక్లా .. 13 నెలల్లో కోటి రూపాయలు ఈటీచర్ గా గతనెలలో వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.! ఈ కేసు విచారణలో షాకింగ్ విషయాలు బయటికొస్తున్నాయి.
అసలు దొంగలు :
అసలు సూత్రధారులు పుష్పేంద్ర ఆయన తమ్ముడు జస్వంత్.! వీళ్లిద్దరూ టీచర్లే…వీళ్లు కూడా ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాన్ని సంపాదించుకున్నవారే.! మంచి పర్సెంటేజ్ ఉన్న సర్టిఫికేట్ల వివరాలను సేకరించి…ఆ సర్టిఫికెట్స్ పోయినట్టుగా పేపర్ ప్రకటన ఇచ్చి, ఆ ప్రకటనతో వీళ్లే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తిరిగి సర్టిపికెట్స్ ని పొంది …. ఆ సర్టిఫికెట్ల కు అనుగుణంగా తమ పేర్లు మార్చుకొని…. ఉద్యోగం పొందారు ఈ అన్నదమ్ములు.!
అనామిక పేరుతో ఉద్యోగాలకు డిఫరెంట్ ప్లాన్:
Advertisement
2017 లో, అనామిక శుక్లా ( ఒరిజినల్ క్యాండేట్ )ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్‌పూర్, జౌన్‌పూర్, బస్తీ, మీర్జాపూర్ మరియు లక్నోలోని KGBV లలో దరఖాస్తు చేసుకుంది. కానీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమె కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయారు. మంచి మెరిట్ మార్క్స్ ఉన్న ఆమె సర్టిఫికెట్ల కాపీని జౌన్‌పూర్‌లోని ప్రాథమిక విద్యా విభాగంలో గుమస్తాగా ఉన్న ఆనంద్ సింగ్ యాక్సెస్ చేసి…వాటిని ప్రధాన సూత్రధారి పుష్పేంద్రకు అందచేశాడు. వాటినే 9 జిరాక్స్ కాపీలుగా మార్చి 9 మంది మహిళలకు ఇచ్చి వారినుండి 3,3 లక్షలు వసూల్ చేశాడు పుష్పేంద్ర!
Advertisements
Advertisements
ఉత్తరప్రదేశ్ లోని….వివిధ పాఠశాలల్లో…ఈ 9 మందిలో 6 గురికి ఉద్యోగాలిప్పించారు.! ఈ ఆరుగురే 13 నెలలుగా దాదాపు కోటి రూపాయల వరకు జీతం డ్రా చేశారు. వీరందరూ ఒకే పేరు మీద, ఓకే సర్టిఫికేట్స్ తో ఉద్యోగం సంపాదించిన వారే.! KGBV కి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడగకపోవడం వీళ్లకు కలిసొచ్చింది. ఇంటర్వ్యూ కూడా నామమాత్రం జరగడంతో అక్కడ కూడా చక్రం తిప్పారు ఈ సోదరులు.!
స్కామ్ బయటికొచ్చిందిలా…?
KGBV స్కూల్ టీచర్లకు సంభందించి డేటాబేస్ ను రూపొందిస్తున్న సమయంలో …ఒకే పేరుతో ఆరు KGBV స్కూల్స్ లో టీచర్లుండడం మొదట ఆశ్చర్యానికి గురిచేసింది.. సర్టిఫికేట్స్ కూడా సేమ్ ఉండడంతో అసలు విషయం బయటపడింది.!