Advertisement
30 లక్షలు పెట్టి… కొత్త కార్ ను షోరూమ్ నుండి బయటి తీస్తూనే గోడకు గుద్దేసి….తన అత్యుత్సాహానికి తనే బాధపడిన వ్యక్తికి కియా కంపెనీ ఆ కార్ ప్లేస్ లో మరో కొత్త కారును ఇచ్చినట్టు సమాచారం!
జూన్ 20 న ఓ కస్టమర్ తను ఆర్డర్ చేసిన కియా కార్నివాల్ కార్ ను తానే షో రూమ్ నుండి బయటకు తీసుకొస్తూ…ఎదురుగా ఉన్న గోడను గుద్దాడు. దీంతో కార్ బ్యానెట్ దెబ్బ తినడమే కాకుండా ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.! సేల్స్ ఎగ్జ్యూటివ్ వివరిస్తుండగానే కార్ స్టార్ట్ చేసి…సదరు వ్యక్తి ఎదురుగా ఉన్న గోడను గుద్దడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది!
అప్పటి వరకు మ్యానువల్ కార్ ను నడిపిన సదరు వ్యక్తి… ఆటో మేటిక్ కార్ డ్రైవింగ్ పై అవగాహన లేకపోవడంతో ఈ ఘటన జరిగింది! కార్ ను ఇన్సురెన్స్ చేసే కొన్నాడు కాబట్టి….కార్ కు ఇన్సురెన్స్ క్లెయిమ్ అయ్యిందట.! కియా మోటర్స్ కూడా పాత కార్ ప్లేస్ లో కొత్తది ఇచ్చిందని సమాచారం!
Advertisement
ఆ సందర్భంలో…. కొత్త కార్ ఓపెనింగ్ ను వీడియో తీస్తున్న వ్యక్తి పక్కకు తప్పుకోకపోయింటే కార్ అతడిని గుద్దుకుంటూనే వెళ్లేది.! మొత్తానికి తీపి జ్ఞాపకం గా ఉండాల్సిన కార్ ఓపెనింగ్ ఓనర్ కు అలా చేదు జ్ఞాపకం గా మిగిలింది.! ఇప్పుడు కొత్త కార్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు!
ఇన్సురెన్స్ బతికించింది:
సాధారణంగా…. వాహనాలను ఇన్సురెన్స్ చేయనిదే అమ్మడం జరగదు.! కానీ ఈ ఇన్సురెన్స్ అప్ డేట్ అవ్వడానికి కనీసం రెండు రోజుల సమయం పడుతుంది. ! ఈ కేసులో ఇన్సురెన్స్ తొందరగానే క్లెయిమ్ అయ్యినట్టుంది!
Advertisements
Advertisements
అప్పటి ఆ ఘటనకు కారణాలు..
- ఓనర్ ఉత్సాహం.
- అప్పటి వరకు సాధారణ గేర్ల వాహనాన్ని నడిపిన అతనికి ఆటోమేటిక్ గేర్ల కార్ పై పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం.
- ఇరుకైన స్థలంలో షోరూమ్ నిర్వహించడం.
Watch Video :