Advertisement
న్యూక్లియర్ స్విచ్ నా టేబుల్ మీద ఉంది.. ప్రెస్ చెయ్యమంటారా? అంటూ పెద్ద పెద్ద దేశాలనే షేక్ చేస్తున్న వ్యక్తి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్. స్వేచ్ఛ అనే పదమే వినపడనివ్వకుండా…ఓ నియంతలా తన దేశాన్ని పాలిస్తున్నాడు. అయితే ప్రస్తుతం అయన ఆరోగ్యంపై అనేక వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భోజనం : అట్టాంటిట్టాంటి భోజనం సర్ కి పడదు… సారు తినాలంటే డెన్మార్క్ నుండి ఫ్రెష్ పంది మాంసం కావాలి. లేదా ఇరాన్ నుండి కేజీ 23 లక్షలు పలికే చేపజన( గుడ్లు) కావాలి. అంతెందుకండీ సారు బ్రెజిల్ కాఫీ మాత్రమే తాగుతారు …దానికి ఒక ఏడాదికి అయ్యే ఖర్చు – అక్షరాలా 6 కోట్లు ( Only For Coffee )
మందు : మంచి మందు బాబు మన సారు. అమెరికా రమ్ము, జర్మనీ వైన్ మాత్రమే తాగుతారు అది కూడా కాస్ట్లీ బ్రాండ్స్ మాత్రమే..ఒక బాటిల్ ధర 3 లక్షలు. మందు కోసం నెలకు కోటి దాకా ఖర్చు అవుతుందట.!
Advertisements
సిగరెట్లు: ఎవరైనా బట్టలు డిజైన్ చేయించుకుంటారు…ఈయన గారు సిగరెట్లు కూడా డిజైన్ చేయించుకున్నారు . ఈయన తాగే సిగరెట్టు ప్యాకెట్ ధర 3000 అయితే …ఆ ప్యాకెట్ డిజైన్ కి అయ్యే ఖర్చు 12000 .
Advertisement
గడియారాలు : ఖరీదైన గడియారాలు పెట్టుకోవడం ఈయన అలవాటు ..ఒకసారి వాడింది మరో సారి వాడకపోవడం ఈయన గుర్తింపు. అందుకే ఖరీదైన వాచెస్ ను ఎగుమతి చేసే స్విస్ సైతం ఉత్తర కొరియా కు వాచెస్ ను ఎగుమతి చేయడం ఆపేసిందింట…ఎందుకంటే వాటి విలువను కిమ్ తగ్గిస్తున్నాడనేది వారి ఫీలింగ్.
130 మంది డాక్టర్స్ బృందం ఎప్పుడు అతనితోనే…మనోనికి ఉన్న అలవాట్లకు ఎప్పుడు ఏమైద్దో తెలియదు కదా!
భార్యకు ఖరీదైన గిఫ్ట్స్…. ఏ గిఫ్ట్ కొన్నా మినిమం 10 లక్షల పైనే.. ఇంతే కాక ఆయనకంటూ అందమైన అమ్మాయిలతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు వారిని Pleasure Squad అంటారు. తన అవసరాలు తీర్చిన వారికి సైతం విలువైన గిఫ్ట్స్ ఇస్తుంటాడు.
100 కు పైగా లగ్జరీ కార్లు, 1. ప్రైవేట్ జెట్ , 60 కోట్ల విలువ చేసే యాచ్ , 17 పెద్ద పెద్ద భవంతులు , ఒక ద్వీపం ఇలా చెప్పుకుంటూ పొతే మనోడి లగ్జరీస్ కి ఎండ్ ఏ లేదు.
Advertisements