Advertisement
ఒక రాజు దగ్గర 10 అడవి కుక్కలుండేవి. తన సైనికుల్లో తప్పుచేసిన వారిపై, తప్పుడు సలహాలు ఇచ్చిన వారిపై ఈ కుక్కలను వదిలేవాడు.. ఆకలిమీదున్న ఆ కుక్కలు వారిమీద పడి ఏ కండకు ఆ కండ పీక్కుతినేవి.! ఇలా ఓ సైనికుడికి కూడా ఇదే శిక్ష వేశాడు ఆ రాజు …. తప్పైంది క్షమించండంటూ ఎంతగా బతిమిలాడినా ఆ రాజు వినలేదు.. ఓ పదిరోజులు శిక్షను వాయిదా వేశాడు.
ఆ సైనికుడు కుక్కల పెంపకందారుడి దగ్గరికి వెళ్లి..ఈ పదిరోజులు ఈ కుక్కలను నేను పెంచుతానన్నాడు..మొదట నిరాకరించినా తర్వాత ఒప్పుడుకున్నాడు. ప్రతిరోజు ఆ కుక్కలను తింటిపెట్టడం, స్నానం చేయించడం దువ్వడం లాంటి పనులు చేసి ఆ కుక్కలకు దగ్గరయ్యాడు ఆ సైనికుడు.
Advertisement
పదిరోజులు గడిచాయి..శిక్ష అమలు చేసే రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా…. శిక్షను అమలు చేయండంటూ రాజు ఆదేశించాడు….మద్యలో ఉన్న అతని మీదకి కుక్కలను వదిలారు….కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చి అతని కాళ్లు నాకడం ప్రారంభించాయి….షాక్ అయిన రాజు నా కుక్కలకేమైంది.? ఎందుకిలా చేస్తున్నాయంటూ అరిచాడు.
అప్పుడు ఆ సైనికుడు…”10 రోజులు వాటిని చూసుకున్నందుకే కుక్కలు ఇంతటి విశ్వాసాన్ని చూపాయి..మరి పదేళ్లు మీకోసం మీ రాజ్యంకోసం పనిచేసిన నన్ను మీరు పట్టించుకోలేదు”..అన్నాడు. తన తప్పు తెల్సుకున్న అతను ఆ రోజు నుండి ఆ శిక్షను నిలిపేశాడు. సైనికులను ప్రేమగా చూడడం ప్రారంభించాడు..ఆ సైనికుడిని సైన్యాధ్యక్షుడిగా ప్రమోట్ చేశాడు.
Advertisements
Advertisements