Advertisement
సాధారణంగా కోటలు అంటే ఒకప్పుడు రాజులు నివాసం ఉండేవారు. కానీ ఇప్పుడు వాటిని పర్యాటక ప్రాంతాలుగా మార్చారు. కొందరు బడాబాబులు వాటిని హోటల్స్‌గా, టూరిస్టు ప్లేసులుగా మార్చి వ్యాపారం చేస్తున్నారు. కొన్ని కోటలను పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే ఆ కోట మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. దాన్ని అప్పట్లో రాజులు వదిలిపెట్టాక అందులో కొన్నేళ్లకు ప్రజలు నివాసం ఉండడం మొదలు పెట్టారు. అవును.. ఇప్పటికీ అందులో జనాలు నివాసం ఉంటున్నారు. ఇంతకీ ఆ కోట ఎక్కడ ఉందంటే..?
రాజస్థాన్‌లోని జైసల్మీర్ ప్రాంతంలో ఉన్న కోటను క్రీస్తు శకం 1156లో అప్పటి రాజు రావల్ జైశ్వాల్ నిర్మించారు. ఆ కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తించింది. అయితే అందులో ఆశ్చర్యంగా జనాలు నివసిస్తున్నారు. అవును.. ఇలా ఎందుకు జరిగిందంటే.. ఒకప్పుడు ఆ కోట నిర్మానుష్యంగానే ఉండేది. కానీ అప్పట్లో సిల్క్ వ్యాపారం చేసే వర్తకులతోపాటు మసాలా దినుసులు, టీ పొడి, విలువైన రాళ్లను అమ్మే వ్యాపారులు ఈ కోట వద్ద బస చేసేవారు. దీంతో ఈ ప్రాంతం రద్దీగా మారింది. ఇక క్రమంగా ఈ కోటలో జనాలు నివాసం ఉండడం మొదలు పెట్టారు. తరువాత వారి కుటుంబ సభ్యులు ఆ కోటలో కంటిన్యూ అయ్యారు. దీంతో ఇప్పటికీ జనాలు అందులో నివసిస్తూనే ఉన్నారు.
Advertisement
ఈ కోటలో ప్రస్తుతం సుమారుగా 4వేల మంది వరకు నివాసం ఉంటున్నారు. ఈ కోట 250 అడుగుల ఎత్తు ఉంటుంది. 25 అంతస్థుల ఎత్తు ఉన్న కొండ ప్రాంతంపై దీన్ని నిర్మించారు. పసుపు రంగులో ఉండే శాండ్ స్టోన్ ఇటుకలతో ఈ కోటను నిర్మించారు. అందువల్ల ఈ కోట ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా ఇంకా చెక్కు చెదరకుండా దృఢంగానే ఉంది. ఇక ఈ కోటకు మొత్తం 99 బురుజులు ఉన్నాయి.
Advertisements
Advertisements
ఈ కోటలో నివాసం ఉండే వారు తమ ఇళ్ల నిర్మాణాలపై సుమారుగా 3 అడుగుల ఎత్తులో బురదను పేర్చుతారు. అందువల్ల వేసవిలో కోటలో చల్లగా ఉంటుంది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఉండేలా ఈ కోటను అప్పట్లో నిర్మించారు. ఇక ఈ కోటలో ఉండే అనేక కుటుంబాలు అన్నీ ప్రధానంగా టూరిజంపైనే ఆధార పడ్డాయి. ఒకరికొకరికి వ్యాపారంలో పోటీ ఉంటుంది. అయినప్పటికీ శుభకార్యాలైనా, పండుగలైనా, చావులైనా.. వీరందరూ ఆయా కార్యక్రమాలను కలిసే జరుపుకుంటారు. వీరు ఎప్పుడూ ఐక్యంగా ఉంటారు.