Advertisement
నకుల్ బాల్ …..ఇటీవల ఫాస్ట్ బౌలర్లు సంధిస్తున్న ఆస్త్రం! ఒక్కసారిగా తమ బాల్ వేగాన్ని తగ్గించి బ్యాట్స్ మన్ ను కన్ఫ్యూజ్ చేసేందుకు అప్పుడప్పుడు ఫాస్ట్ బౌలర్లు వాడుతున్న స్ట్రాటజీ ఇది!
సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు…బాల్ గ్రిప్ పై చూపుడు వేలు,మధ్యవేలును ఉంచి…రన్ అప్ తర్వాత బాల్ ను వేగంగా విసురుతారు. ఈ నకుల్ బాల్ వేసే సమయంలో మాత్రం చూపుడు వేలు, మద్య వేలును బాల్ గ్రిప్ పై సమాంతరంగా కాకుండా…చివర్లో పట్టుకుంటారు…బాల్ ను విసరకుండా నెడతారు….విసిరితే బాల్ వేగంగా వస్తుంది, నెడితే బాల్ స్లో గా వస్తుంది….అప్పటి వరకు బౌలర్ స్పీడ్ కు అలవాటు పడిన బ్యాట్స్ మన్ ….ఇలా ఒక్క సారిగా తగ్గిన వేగాన్ని అంచనా వేయకుండా…అడ్వాన్స్ గా బ్యాట్ ను ఊపుతాడు…బాల్ మాత్రం మెల్లిగా వచ్చి వికెట్లను తాకడమో….. బ్యాట్ కు కనెక్షన్ కుదరక క్యాచ్ గా వెళ్లడమో అవుతుంది!
Advertisement
నకుల్ బాల్ వెనుక….న్యూటన్ మూడవ సూత్రం ఉంది. బాల్ ఏ యాంగిల్ లో వేస్తే అదే యాంగిల్ లో వెళుతుంది. అందుకే ఎత్తు ఎక్కువగా ఉన్న బౌలర్లకు నకుల్ బాల్ వేసే సమయంలో ఎక్కువ బౌన్స్ లభిస్తుంది!
నకుల్ బాల్ ను ఇండియాకు పరిచయం చేసింది ఎవరు?
జహీర్ ఖాన్….2011 వరల్డ్ కప్ సందర్భంగా ఈ నకుల్ బాల్స్ ను సమర్థవంతగా ఉపయోగించి సక్సెస్ అయ్యాడు… ఈ ఐపియల్ లో కూడా భువనేశ్వర్, జోఫ్రా ఆర్చర్ నకుల్ బాల్స్ తో ఆకట్టుకుంటున్నారు!
Advertisements
Watch Video : జహీర్ ఖాన్ తన నకుల్ బాల్ తో గిల్ క్రిస్ట్ ను బోల్తా కొట్టించిన వీడియో!
Advertisements