Advertisement
బిగ్ బాస్ -2 విన్నర్….కౌశల్ లైవ్ లో చైనా ఫోన్ ను పగులగొట్టాడు. ఈ వీడియోను తన ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇండియా-చైనా బోర్డర్ లో జరిగిన ఘటన కారణంగా 20 మంది భారతజవాన్లు అమరులైన సంగతి తెలిసిందే…చైనా వక్రబుద్దికి నిరసనగా తాను చైనా ఉత్పత్తి చేసిన తన ఫోన్ ను పగులగొడుతున్నానని చెప్పాడు కౌశల్ . ఈ ఫోన్ బిగ్ బాస్ -2 గెలిచినందుకు కౌశల్ కు గిఫ్ట్ గా వచ్చింది.!
Advertisement
చైనా మీద నా అసహనాన్ని ఇలా ప్రదర్శించాను..మీరు ఇలాగే చేయాలని నా ఉద్దేశం కాదు…కానీ నేను నా దేశం కోసం ఏదైనా చేస్తాను- జైహింద్ అంటూ పై వీడియోను తన ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు కౌశల్.
అయితే కౌశల్ వీడియో పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది.! మంచి పనిచేశావ్ అని కొందరంటే….నిజంగా చైనా వస్తువులను బ్యాన్ చేయాలంటే నీ ఇంట్లోని సగం వస్తువులు ఇలాగే చేయాల్సి ఉంటుందని ఇంకొందరన్నారు.
Watch Video:
Advertisements
Advertisements