Advertisement
కాలేజిలో చదువుకునే రోజుల నుండి వారిద్దరికి పరిచయం..స్టూడెంట్ యూనియన్ లీడర్ అయిన సీనియర్ ని, తను చేసే పనులను చూసిన అమ్మాయి మనసు పడింది.. అబ్బాయికి జూనియర్ అమ్మాయి నచ్చింది.. మనసులు కలిశాయి..ప్రేమలో మునిగితేలుతుండగానే చదువులు అయిపోయాయి.. ఉద్యోగం కోసం అబ్బాయి విదేశాలకు వెళ్లాడు..పెద్దల అంగీకారంతో మరో నెలరోజుల్లో పెళ్లిపీటలెక్కబోతున్నారు..కానీ…!
అబ్బాయి పేరు మహమ్మద్ రియాజ్ , కేరళలోని చెరుపలస్సెరి లో ఐడియల్ కాలేజ్ లో డిగ్రి చదివే రోజుల్లో అమ్మాయి పరిచయం.. పేరు హన్య .. స్టూడెంట్ యూనియన్ చైర్మన్ గా కాలేజ్ లో రియాజ్ కి మంచి ఫాలోయింగ్ ఉండేది.. దాంతో పాటు చదువు కూడా ఉంది..ఒకరోజు కాలేజిలో ఏదో సమస్యవచ్చి రియాజ్ ని కలిసింది హన్య..తర్వాత సమస్య క్లియర్ అయ్యేసరికి ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది.. ప్రేమలో పడ్డారు..
Advertisement
డిగ్రి అయ్యాక ఫార్మా కంపెనిలో వర్క్ చేయడానికి విదేశాలకు వెళ్లాడు రియాజ్..హన్యకి పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో రియాజ్ విషయం ఇంట్లో చెప్పింది…పెద్దలకు నచ్చడంతో, సరే తను తిరిగొచ్చాక పెళ్లి ముహుర్తం పెట్టుకుందాం అనుకున్నారు.. వాస్తవానికి జూలైలోనే తను రావాలి, ఈ టైంకి పెళ్లి జరిగిపోవాల్సి ఉండే.. కానీ కరోనా కారణంగా ఆలస్యం అయింది..ఎట్టకేలకు ప్రయాణానికి ఏర్పాట్లు జరిగాయి.. భారత్ చేరుకున్నాడు..మరో గంట అయితే కుటుంబ సభ్యులని కలిసేవాడే..క్వారంటైన్ సమయం ముగిసాక తన ప్రియురాలిని జీవిత భాగస్వామిగా చేసుకుని ఇద్దరూ సంతోషంగా జీవితం గడిపేవారు..
కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది.. హన్యని ఒంటరిని చేసి రియాజ్ వెళ్లిపోయాడు..మరెప్పుడూ రాలేనంత దూరం వెళ్లిపోయాడు.. మొన్న కేరళ కోజికోడ్ లో జరిగిన విమాన ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.. అదే తన చివరి ప్రయాణం అవుతుందని తను ఊహించి ఉండడు. తనతోనే జీవితాన్ని ఊహించుకుంటున్న హన్య ఒంటరి అయిపోతుందని అనుకుని ఉండడు..
Advertisements
కలలన్ని కళ్లముందే కల్లలైపోతుంటే గుండెలో అగ్నిపర్వతాలు పేలుతున్నట్టుగా బాధ ఉన్నా అసలేం జరిగింది,ఎందుకు జరిగింది ఏం అర్దం కాక మౌనంగా రోదిస్తున్న హన్యని చూస్తే అందరికి గుండె తరుక్కుపోతుంది…కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మననం..రెప్పపాటు కాలమే జీవితం..!
Advertisements