Advertisement
సినీ ఇండస్ట్రీలో ఎన్నో గమ్మత్తులు జరుగుతుంటాయి! అలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఒకటి కృష్ణ చిరంజీవిల మధ్య జరిగింది….కృష్ణ కు వచ్చిన సినిమా చిరంజీవికి వెళ్లి సూపర్ హిట్ అయ్యింది, సేమ్ తో సేమ్ చిరంజీవి చెయ్యాల్సిన సినిమా కృష్ణ చేతికి వచ్చి ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది …ఇంతకీ ఆ సినిమాలేంటి? ఆ సందర్భాలు ఏంటో ఇప్పుడు చూద్దాం .
కృష్ణ సినిమా చిరంజీవికి:
1983 లో కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో కృష్ణ ఒక సినిమా చేయాల్సివుంది . క్రిష్ణ బిజీగా ఉండటం వలన రామిరెడ్డి కొన్ని నెలలు కృష్ణ కోసం వెయిట్ చేసాడు… డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో చివరికి కృష్ణ ఆ సినిమాని వదిలేసుకున్నారు . తర్వాత అదే కథని అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవితో తీశారు . అది సంచలన విజయం సాధించి చిరంజీవిని స్టార్ హీరోగా మార్చేసింది … ఆ సినిమానే ఖైదీ!
Advertisement
చిరు సినిమా కృష్ణ:
Advertisements
1993 లో SV కృష్ణారెడ్డి చిరంజీవితో…. అన్నయ్య అనే మూవీని చేయాలని చిరంజీవికి కథ వినిపించాడు. చిరుకు స్టొరీ నచ్చింది కానీ అప్పటికే ప్లాప్స్ తో ఉన్న మెగాస్టార్ SV కృష్ణారెడ్డి తన ఇమేజ్ ని హ్యాండిల్ చేయలేడేమోననే అనుమానంతో ఆ సినిమాని రిజెక్ట్ చేసాడు . దాంతో అదే కథని సూపర్ స్టార్ కృష్ణకి వినిపించాడు కృషారెడ్డి . అప్పటికే నాలుగు సంవత్సరాలుగా సరైన హిట్ లేదు కృష్ణ కి … సినిమాకు ఒప్పేసుకున్నాడు కృష్ణ ….. అప్పటికే అన్నయ్య అనే టైటిల్ తో కృష్ణ సినిమా పేరు ఉండటంతో…. ఆ సినిమా టైటిల్ ను నెంబర్ వన్ గా మార్చారు. సినిమాకూడా నెంబర్ వన్ రిజల్ట్స్ ను తీసుకొచ్చింది.
Advertisements
ఆవిధంగా క్రిష్ణ వదిలేసిన సినిమాతో చిరు స్టార్ హీరో అవ్వగా , చిరు వదులుకున్న సినిమాతో క్రిష్ణ కు మళ్ళీ బ్రేక్ వచ్చింది .