Advertisement
దేశంలో ఆన్‌లైన్ ఫుడ్ ఇండస్ట్రీ పరిధి రోజు రోజుకీ విస్తరిస్తోంది. ఆ రంగానికి చెందిన కంపెనీలు ఇంకా మార్కెట్‌పై పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీలు గత కొంత కాలంగా ఈ రంగంపై తమ ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. దీంతో రెస్టారెంట్లు భారీ మొత్తంలో కమిషన్లు నష్టపోతున్నాయి. అలాగే కస్టమర్ల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. అయితే ఆహార రంగంలో నెలకొన్న ఈ విపరీత పరిణామాలకు చెక్ పెట్టేందుకు ఓ సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం రంగంలోకి దిగింది. అదే లాల్సా (Laalsa)..!
రెస్టారెంట్లు, కస్టమర్ల మధ్య ఉండే అంతరాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా లాల్సా ఆవిర్భవించింది. అందులో భాగంగానే ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా లాల్సా పనిచేస్తుందని ఆ సంస్థ సీఈవో సురేష్ రెడ్యం తెలిపారు.
లాల్సా డిజిటల్ ప్లాట్‌ఫాం ఇప్పటికే ఆహార రంగానికి చెందిన అనేక మంది పెట్టుబడిదారులతో, 6వేలకు పైగా రిజిస్టర్డ్ రెస్టారెంట్లతో సేవలను ప్రారంభించింది. 1 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఆవిర్భవించిన ఈ స్టార్టప్ పూర్తిగా ఆధునిక సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రెస్టారెంట్లు, కస్టమర్లకు మధ్య వారధిగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం వంటి 4 ప్రధాన నగరాల్లో ఈ స్టార్టప్ తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
లాల్సా స్టార్టప్ 5 ప్రధాన అంశాల ఆధారంగా దేశంలో ఆన్‌లైన్ ఫుడ్ ఇండస్ట్రీలో ఓ ముఖ్యమైన కంపెనీగా ఆవిర్భవిస్తుందని సీఈవో సురేష్ రెడ్యం తెలిపారు.
Advertisements
1. ఫుడ్ ఔట్‌లెట్లకు మరింత బలం
రెస్టారెంట్, హోటల్ యాజమాన్యాలు దేశంలో ఇతర డిజిటల్ ప్లాట్‌ఫాంలను కాదని లాల్సాను ఎంచుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి.. తమ బిజినెస్‌పై లాల్సా వారికి మరింత నియంత్రణ అందివ్వడమే. దీంతో వారికి తమ కస్టమర్ల అభిరుచులపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడుతుంది. లాల్సా ప్లాట్‌ఫాంలో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హోటల్స్, రెస్టారెంట్ల యాజమాన్యాలకు తమ కస్టమర్ల అభిరుచులు, వారి ప్రవర్తన, కొనుగోళ్ల పట్ల మరింత సమాచారాన్ని అందిస్తుంది. దీంతో యాజమాన్యాలు అన్ని అంశాలపై నాలెడ్జిని పెంచుకుని అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ క్రమంలో వారు తమ వ్యాపారాలను మరింత వృద్ధి చేసుకోవచ్చు. ఇక దీనికి గాను యాజమాన్యాలు ఎక్కువ కమిషన్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే యాడ్స్‌కు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పని ఉండదు. తమ రోజువారీ కార్యకలాపాలను మరింత సులభంగా నిర్వహించుకోవచ్చు.
Advertisement
2. వెరైటీ డిష్‌లతో ఆదరణ
లాల్సా స్టార్టప్‌కు చెందిన యంజీ (Yumzy) అనే ఫుడ్ డెలివరీ సబ్సిడియరీ ఆయా నగరాల్లో ఉన్న ప్రీమియం రెస్టారెంట్లు, హోటళ్లతో పనిచేస్తూ భిన్నమైన, వెరైటీ డిష్‌లను కస్టమర్లకు అందించేందుకు కృషి చేస్తోంది. దీనివల్ల ఆయా వెరైటీ డిష్‌లకు సహజంగానే కస్టమర్ల ఆదరణ పెరుగుతుంది. అంతేకాదు.. ఆయా డిష్‌లు యంజీలో తప్ప.. ఇతర ఏ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉండవు. కనుక భోజన ప్రియులకు ఇది ఓ చక్కని అనుభవాన్ని అందిస్తుంది. వారు మళ్లీ మళ్లీ ఇదే ప్లాట్‌ఫాంపై ఫుడ్‌ను ఆర్డర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది హోటల్స్, రెస్టారెంట్ల వ్యాపార అవకాశాలను మరింత విస్తృతం చేస్తుంది.
3. పర్సనలైడ్జ్ ఎక్స్‌పీరియెన్స్
పూర్తిగా టెక్నాలజీ ఆధారంగా నడిచే లాల్సా స్టార్టప్ తమ ప్లాట్‌ఫాంలో ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అల్గారిథమ్స్ ఆధారంగా కస్టమర్ యాక్టివిటీని రికార్డ్ చేస్తుంది. దీంతో కస్టమర్లకు తాము ఈ ప్లాట్‌ఫాంలో వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా అర్థమవుతుంది. వారి పాత యాక్టివిటీలను బట్టి ఈ ప్లాట్‌ఫాం వారికి చక్కని పర్సనలైజ్డ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. దీంతో వారు తమకు కావల్సిన రుచులను ఎప్పటికీ ఆస్వాదించవచ్చు.
4. డిస్కౌంట్లు
ఇతర అన్ని డిజిటల్ ప్లాట్‌ఫాంలలాగే యంజీలోనూ కస్టమర్లకు అద్భుతమైన డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అయితే హోటల్స్, రెస్టారెంట్ల యాజమాన్యాలే ఈ ఆఫర్లను నేరుగా కస్టమర్లకు అందిస్తాయి. అందువల్ల యాజమాన్యాలు తమ అమ్మకాలను బట్టి రాయితీలను ఇస్తూ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అదే సమయంలో కస్టమర్లకూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇది అటు యాజమాన్యాలకు, ఇటు కస్టమర్లకు.. ఇద్దరికీ లాభసాటిగా ఉంటుంది.
5. శుభ్రత
ఆహార పరిశ్రమలో ఎక్కడైనా సరే శుభ్రతకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. అందుకు లాల్సా కూడా ఎంతగానో కృషి చేస్తోంది. ఆ ప్లాట్‌ఫాంకు చెందిన యంజీ ఫుడ్ డెలివరీ సంస్థ శుభ్రత విషయంలో కఠినమైన పాలసీని అమలు చేస్తోంది. హోటల్స్, రెస్టారెంట్ల యాజమాన్యాలు కచ్చితంగా నిబంధనలను పాటిస్తూ పూర్తిగా శుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వండి అందించాలి. అలాగే శుభ్రమైన కవర్లలో ఆహారాన్ని ప్యాక్ చేసి కస్టమర్లకు పూర్తిగా పరిశుభ్రమైన విధంగా ఆ ఆహారాన్ని డెలివరీ ఇవ్వాలి. ఈ అంశాల్లో ఎక్కడైనా సరే.. యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. శుభ్రత పాటించకపోయినా.. కఠిన చర్యలు తీసుకుంటారు. దీనికి గాను లాల్సా కఠినంగా స్పందిస్తుంది. అలాంటి రెస్టారెంట్లు, హోటల్స్‌ను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించి.. వారితో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలను నిలిపివేస్తారు.
దేశంలో ఆహార రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను లాల్సా ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఓ వినూత్న డిజిటల్ ఫుడ్ ప్లాట్‌ఫాంగా ఆవిర్భవించే దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం దేశంలోని అనేక ఫుడ్ ఔట్‌లెట్లతో ఈ స్టార్టప్ సంప్రదింపులు జరుపుతూ వ్యాపార భాగస్వామ్యాలను నెలకొల్పుకుంటోంది. దీంతో దేశ వ్యాప్తంగా త్వరలోనే లాల్సా అతి పెద్ద ఫుడ్ ప్లాట్‌ఫాంగా అవతరించనుంది.
Advertisements
For More Details, Contact Here –> Laalsa