Advertisement
ప్రేమ- ప్రేమికులు అనే పదాలు తలచుకోగానే మన తలపుల్లోకి వచ్చే పేర్లు లైలా-మజ్ను..వీరి కథ అజరామరం..ఇప్పటికి ప్రజలు కథలుకథలుగా చెప్పుకుంటూ గుర్తుచేసుకునే ప్రేమకథ. వాళ్లు ఎలా ఉంటారో తెలియకపోయినా వారి కథ ప్రతి ఒక్కరికి పరిచయమే..ఇవే లైలా మజ్నుల అసలైన ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో రెండు ఫోటోలు..లైలా పెద్ద అందెగత్తేం కాదు అనే చర్చ జరుగుతోంది..
7వ శతాబ్దికి చెందిన అరేబియన్ కథ..ఆ కథలో ప్రేమికులే లైలా – మజ్నులు..వీరి పరిచయం,ప్రేమ గురించి అనేక కథలు మనుగడలో ఉన్నాయి. నిజజీవితంలోనే కాదు తెరపైన కూడా వీళ్ల ప్రేమకథ సూపర్ హిట్ అయింది..వీరి కథ ఆధారంగా వచ్చిన ప్రతి సినిమా హిట్టే.. సినిమాల్లో లైలాని చాలా అందంగా చూపించేవారు.. కానీ నిజజీవితంలో లైలా పెద్ద అందగత్తె కాదని, ఫ్రాన్స్లోని ఒక మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నాయంటూ లైలా మజ్నుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Advertisement
Advertisements
ఈ ఫోటోలను చూసిన తరువాత చాలా మంది సోషల్ మీడియా యూజర్లు లైలా అంత అందంగా లేరని ట్రోల్ చేశారు. లిటరల్ గా చెప్పాలంటే చాలామంది కామెంట్లలో ఆమెను ఎగతాళి చేశారు. చరిత్ర ప్రకారం లైలా అంత అందంగా లేదు, అయినప్పటికీ, లైలాను మజ్ను పిచ్చిగా ప్రేమించాడు..ఆమెకు మరొకరితో వివాహం నిశ్చయమైతే పిచ్చివాడిలా రోడ్లపై తిరిగాడు.. ఆమె అంత అందగత్తె ఏం కాదు మీరు ఆమెలో ఏం చూసారు అనిఅడిగితే మజ్ను ఒకటే సమాధానం చెప్పేవాడట..స్వర్గం!
Advertisements