Advertisement
అతనో టాప్ యాక్టర్…! సినిమాలో అతను నటిస్తే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది ! స్టార్ డమ్ నడుస్తోంది.! కెరీర్ పీక్స్ లో ఉంది. అదే టైమ్ లో తన చుట్టాలమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.! ఆమె చాలా ట్రెడీషనల్ ….ఈయన సినిమా నటుడు కావడం కారణంగా చాలా మోడ్రన్ గా ఉండేవాడు!
పార్టీలకు భార్యను తీసుకెళ్తే ఎక్కడ తన పరువుపోతుందోనని తీసుకెళ్లేవాడు కాదు. మోడ్రన్ డ్రెస్సులు వేసుకోమని భార్యను ఇబ్బంది పెట్టేవాడు…ఆమె కొద్దికొద్దిగా తనను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ….ఆమె అంటే ఇతనికి క్రమంగా అసహ్యం కలగడం స్టార్ట్ అయ్యింది. మూడేళ్ల కాపురానికి ఫలితం వారికి ఇద్దరు పిల్లలు.!
ఇష్టంలేని భార్యకు విడాకులిచ్చి., తనతోపాటు నటించే హీరోయిన్ ను పెళ్లిచేసుకున్నాడు. ఇద్దరు కలిసి ఒక సంవత్సరం లైఫ్ ను బాగా ఎంజాయ్ చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా…..హీరోగారి సినిమాలు వరుసగా 5 అట్టర్ ప్లాప్ అయ్యాయి…. ప్రొడ్యూసర్లు ఆ హీరో వైపు చూడడం కూడా మానేశారు.
Advertisement
ఖర్చులు పెరిగిపోయాయి. తన రెండవ భార్య …తన గురించి, తన అప్పుల గురించి పట్టించుకోవడం మానేసి… పార్టీస్, ఫంక్షన్స్ అంటూ తిరుగుతోంది..ఇంకో హీరోతో రిలేషన్ షిప్ ను కూడా మెయింటేన్ చేస్తూ….వన్ ఫైన్ డే..ఈ హీరోకు గుడ్ బై చెప్పి వెళ్లిపోయింది.
Advertisements
అప్పులు తీర్చేందుకు తన ఆస్తులన్నీ అమ్మేసి… సినీ ఫీల్డ్ ను వదిలేసి సొంతూరికొచ్చాడు. ఓ రోజు పేపర్ లో…. ప్రపంచం మెచ్చిన అద్భుతమైన వంటలు చేసే ఛెఫ్ అనే ఇంటర్వ్యూ చదువుతూ ఆ చెఫ్ ఫోటో చూశాడు…ఆమె ఎవరో కాదు తన మొదటి భార్య…వెంటనే పిల్లలు గుర్తొచ్చారు.! అతి కష్టంమీద అడ్రస్ సంపాదించి…వెళ్లి పిల్లల్ని కలుద్దామనుకున్నాడు….కానీ వాచ్ మెన్ గేట్ దగ్గర ఆపాడు….విషయం తెల్సుకున్న మొదటి భార్య….తాను తండ్రిని అని పిల్లలకు చెప్పొద్దనే ఓ కండీషన్ కూడా పెట్టి పిల్లల్ని కలవడానికి ఓ గంట పర్మీషన్ ఇచ్చింది.
కొడుకు అచ్చం తనలా ఉన్నాడని చూసి మురిసిపోతున్నాడు….పిల్లలతో ఏవేవో ముచ్చట్లు చెబుతున్నాడు. అంతలోనే ఆయనకిచ్చిన గంట టైమ్ అయిపోయింది…వాచ్ మెన్ వచ్చి అతడిని వెళ్లిపోమన్నాడు.! అతడి కర్చీఫ్ కన్నీటితో తడిచిపోయింది. (ఇది ఇటలీ పత్రికలో ప్రచురించబడిన కథనం)
Advertisements