Advertisement
అసలే కరోనా సమయం. ఉన్న ఉద్యోగాలే పోతున్నాయి. కొత్త ఉద్యోగాలు రావడం మాట దేవుడెరుగు. కనీసం ఏదో ఒక ఉపాధి దొరికితే చాలని చాలా మంది అనుకుంటున్నారు. ఇక కొందరైతే చాలా కష్టపడి పనిచేస్తున్నారు. తమకు ఎదురవుతున్న సమస్యల నుంచి గట్టెక్కేందుకు కష్టపడి పనిచేయడం ఒక్కటే మార్గమని తెలుసుకుంటున్నారు. అందుకనే నిత్యం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కింద చెప్పబోయేది కూడా సరిగ్గా అలాంటి ఓ మహిళ గురించే.
చిత్రంలో ఉన్న మహిళను చూశారు కదా. ఆమె పేరు ఉమ. చెన్నై వాసి. జొమాటో సంస్థలో ఫుడ్ డెలివరీ వర్కర్‌గా పనిచేస్తోంది. గత 10 ఏళ్ల కిందటే తన భర్త చనిపోయాడు. ఒక కుమారుడు ఉన్నాడు. నిత్యం ఉదయాన్నే ఆమె 5 గంటలకు నిద్ర లేస్తుంది. తన బైక్‌పై 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ క్రికెట్ కోచింగ్ సెంటర్‌లో తన కుమారున్ని విడిచిపెట్టి తిరిగి ఇంటికి వస్తుంది. అనంతరం ఇంటి పని చూసుకుంటుంది. తరువాత మధ్యాహ్నం 12 గంటలకు ఆమె డ్యూటీలో రిపోర్ట్ చేస్తుంది.
Advertisement
అలా ఉమ రాత్రి 11 గంటల వరకు ఫుడ్ డెలివరీలు చేస్తుంది. సుమారుగా 18 నుంచి 25 డెలివరీలను ఆమె నిత్యం అందజేస్తుంటుంది. ఇందుకు గాను ఆమె నిత్యం దాదాపుగా 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం బైక్‌పై తిరుగుతుంది. తరువాత ఆమె ఇంటికి చేరుకుని నిద్రిస్తుంది. ఇదీ.. ఆమె రోజు వారీ దినచర్య. ఇలా ఆమె నిత్యం తీవ్రంగా కష్టపడుతుంది. ఇంతా చేస్తే ఆమె నిద్రించేది కేవలం 5 గంటల పాటు మాత్రమే.
ఆమె ఇంత తీవ్రంగా శ్రమిస్తుంది కాబట్టే జొమాటోలో ఆమె డైమండ్ స్టార్ అవార్డును గెలుచుకుంది. ఆమె తెచ్చే డెలివరీలను ఎవరూ ఇప్పటి వరకు క్యాన్సిల్ చేయకపోవడం విశేషం. అలాగే డెలివరీలను ఆమె అస్సలు ఆలస్యం చేయదు. అందుకనే ఆమె బెస్ట్ ఫుడ్ డెలివరీ వర్కర్‌గా గుర్తింపు పొందింది. ఆమె పడుతున్న శ్రమకు, అంకితభావానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!
Advertisements
Advertisements