Advertisement
లీనింగ్ టవర్ ఆఫ్ పీసా.. దీని గురించి చాలా మందికి తెలుసు. ఇటలీలోని ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశం. దీన్ని చూసేందుకు అక్కడికి నిత్యం వేల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇది ఒక పక్కకు వంగి ఉంటుంది. అయితే నిజానికి మన దేశంలోనూ సరిగ్గా ఇలాంటి నిర్మాణమే ఒకటి ఉంది. కానీ దాని గురించి మన దేశంలోనే చాలా మందికి తెలియదు. పీసా టవర్ లాగే ఆ నిర్మాణం కూడా ఒక వైపుకు వంగి ఉంటుంది. కాకపోతే పీసా టవర్ కన్నా ఇంకా ఎక్కువ కోణమే అది వంగి ఉంటుంది. మరి ఆ నిర్మాణం ఎక్కడ ఉందంటే..?
వారణాసిలోని రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం పీసా టవర్ కన్నా ఎత్తు ఎక్కువగా ఉంటుంది. పీసా టవర్ ఎత్తు 54 మీటర్లు మాత్రమే. కానీ ఈ ఆలయం ఎత్తు 74 మీటర్లు. పైగా పీసా టవర్ కేవలం 4 డిగ్రీల కోణంలోనే వంగి ఉంటుంది. కానీ ఈ ఆలయం మాత్రం 9 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఇక ఈ ఆలయం ఎప్పుడూ దాదాపుగా నీటిలోనే మునిగి ఉంటుంది. అయినప్పటికీ ఈ ఆలయం పీసా టవర్ కన్నా ఎత్తు ఎక్కువగా, ఎక్కువ కోణంలో వంగి ఉండడం విశేషం. నిజానికి ఈ ఆలయం గురించి మన దేశంలో చాలా మందికి తెలియదు.
Advertisement
రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం కాశీలో గంగానది ఒడ్డున నదిలో ఉంటుంది. ఏడాది మొత్తం దాదాపుగా ఈ ఆలయం మొత్తం నీటిలో మునిగే ఉంటుంది. కింది భాగంలో ఉండే గర్భగుడి కూడా నీటిలోనే ఉంటుంది. ఇక వర్షాకాలంలో అయితే నీటి స్థాయి పెరిగి ఆలయం మరింత మునుగుతుంది. దీన్ని 1860లలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. అయితే ఈ ఆలయం అలా ఓ పక్కకు ఎందుకు ఒరిగిందో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు.
Advertisements
Advertisements
అప్పట్లో రాజ్‌పూత్ రాజు రాజా మాన్ సింగ్ సేవకుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. రత్నాబాయి అనబడే తన తల్లి కోసం అతను ఈ ఆలయాన్ని నిర్మించాడట. తన తల్లికి తాను ఏమీ చేయలేకపోయాననే బాధతో అతను ఈ ఆలయాన్ని నిర్మించాడట. అయితే రత్నాబాయి మాత్రం తన ప్రేమకు వెలకడతావా.. అంటూ శపించిందట. దీంతో ఆలయం ఒక పక్కకు ఒరిగిందని చెబుతారు.