Advertisement
ఒక టీచర్ ….బోర్డు మీద పై విధంగా 9 th Table రాసాడు. క్లాస్ లోని స్టూడెంట్స్ అందరూ పగలబడి నవ్వుతున్నారు. ఓ కుర్రాడైతే….ఈయన పెద్ద లెక్కల టీచర్ లాగా బిల్డప్ ఇస్తాడు.. 9 th Table కూడా సరిగ్గా రాదు , అది కూడా 9*1=9 !
Advertisement
ఇప్పుడు టీచర్ వంతు వచ్చింది ….కొంచం మీ నవ్వు ఆపితే నేను మీకు చెప్పాలనుకున్నది చెప్తాను అన్నాడు. స్టూడెంట్స్ అంతా సైలెంట్ అయ్యారు. బోర్డు మీద కనిపించేదే జీవితం. నేను 9 th Table బోర్డు మీద రాసాను ….ఒకటి మినహా 9 సార్లు కరెక్టుగా రాసాను. కానీ 9 సార్లు కరెక్టు రాసినందుకు మీరు నన్ను అభినందించలేదు…ఒక్కసారి తప్పుగా రాసినందుకు ఎగతాళి చేస్తున్నారు.
జీవితం కూడా ఇంతే ….మీరు ఎన్ని విజయాలు సాధించిన పెద్దగా పట్టించుకోరు ..ఒక్క తప్పు చేసి చూడండి అందరూ చెప్పే వాళ్లే కనిపిస్తారు మీ చుట్టుపక్కల.! సో డోంట్ లూస్ యువర్ కాంఫిడెన్స్ స్టే స్ట్రాంగ్.
Advertisements