Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

రేప్ చేసినంత ప‌నిచేసిన క్లాస్ మేట్స్, స‌ల‌స‌ల కాగే నీటిని కాళ్ళ‌పై పోసిన పేరెంట్స్…ఓ హిజ్రా రియ‌ల్ స్టోరి!

Advertisement

అప్పుడు నాకు 8 సంవత్సరాలు… ఇంట్లో అందరూ వెళ్లిపోయాక టవల్‌ తీసుకుని నా తలకు చుట్టుకునేవాడిని, అమ్మకు చెందిన కాటుక, లిప్‌స్టిక్‌ రాసుకొని… ఆమె బ్రా ధరించే వాడిని…. అలా పూర్తిగా అమ్మాయిగా మారి అద్దంలో చూసుకుంటూ మురిసిపోయేవాడిని.! ఈ విషయం ఇంట్లో ఎవ‌రికీ తెలియ‌దు.

నా పేరు జగదీష్‌. నా చేష్టలన్నీ ఆడపిల్లలను పోలి ఉండేవి. దీంతో తోటి విద్యార్థులు నన్ను ఎగతాళి చేసేవారు. ఒక సారి నా జననావయవాలను చూపించాలని స్కూల్‌లో తోటి విద్యార్థులు గోల చేశారు. నన్ను టాయిలెట్‌లోకి తీసుకువెళ్లి రే…. ప్‌ చేసినంత పని చేశారు. విషయం అమ్మానాన్నలకు తెలిసింది. వారు సిగ్గుగా ఫీలయ్యారు. నాన్న నన్ను ఇంటికి తీసుకెళ్లి…. నా కాళ్లపై సలసల మరిగే నీటిని పోశారు. అలా చేస్తే నాలో ఉన్న అమ్మాయి లక్షణాలు పోతాయని ఆయనకెవ‌రో చెప్పార‌ట‌! కాళ్ళ‌కు బొబ్బ‌లొచ్చి 3 నెలల న‌డ‌వ‌లేక‌పోయా!

Advertisement

ఆ క్ష‌ణ‌మే ఇంట్లోని బ‌య‌టకొచ్చేశా…. కొంత‌మంది హిజ్రాలు పార్క్ లో కూర్చొని ఉండ‌గా దారి ద‌గ్గ‌రికి వెళ్లి నా సమస్యలను చెప్పాను . వారు నన్ను తమతో ఉండమన్నారు… ఉద‌యం అడుక్కోవ‌డం , రాత్రి ఓర‌ల్ సె క్స్ చేసి డ‌బ్బు సంపాధించ‌డం అందులో వారికి కొంత ఇవ్వ‌డం….ఇలా 4 ఏళ్లు చేశా.! అలా దాచుకున్న డ‌బ్బుతో అవ‌య‌వ‌ మార్పిడిచేయించుకున్నా.

అక్కడితో నా క‌థ అయిపోలేదు. 2004లో ఓ ఆర్గనైజేషన్‌లో జాయిన్‌ అయ్యా. హిజ్రాల స్థితిగతులపై రీసెర్చ్‌ చేయాలనిపించింది. దీంతో నేనే సొంతంగా ఓ ఆర్గనైజేషన్‌ పెట్టా. దాని పేరు Ondede. దాని ద్వారా మహిళలు, పిల్లలు, మైనార్టీల హక్కుల కోసం ఉద్యమించడం ప్రారంభించా.

Advertisements

Advertisements

25 సంవత్సరాలుగా హిజ్రాల కనీస హక్కుల కోసం ఉద్యమిస్తున్నా. నేను చేసిన ప్రయత్నానికి ఫలితం లభించినట్లే అనిపించింది. చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని నాకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందింది. ఇదే నేను నా జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం.! రాష్ట్రంలోనే మొదటి హిజ్రా వివాహం నాదే కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆ ఖ్యాతి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆయనకే దక్కుతుంది. సెక్షన్‌ 377 పై సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పిన‌ప్పుడు చాలా సంతోషించా.!