Advertisement
మహ్మద్ సిరాజ్…ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించిన ఆటగాడు. హైద్రాబాద్ కు చెందిన సిరాజ్ ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కాళ్లకు చెప్పులు లేకుండా తన జర్నీ స్టార్ట్ చేసిన సిరాజ్…ఈ రోజు ఎంతో మంది యువకులకు రోల్ మాడల్ గా మారాడు!
- సిరాజ్ 1994 లో హైదరాబాద్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో జన్మించాడు. తండ్రి మొహమ్మద్ గౌస్ ఆటో నడిపేవాడు. సిరాజ్ కు ఓ సోదరుడు ఇస్మాయిల్.
- ఇంటికి దగ్గర్లోని ఈద్గా మైదానంలో ఫ్రెండ్స్ తో కలిసి క్రికెట్ ఆడేవాడు. ఎప్పుడు తనకు బాధ కల్గిన ఒంటరిగా ఆ మైదానంలో కూర్చోవడం అలవాటట….సిరాజ్ కు!
- కాళ్లకు షూస్ లేనప్పటికీ …ఆ ఈద్గా మైదానంలో గంటల తరబడి బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. పాదాలకు బొగ్గలొచ్చేవి.
- టెన్నిస్ బాల్స్ తో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన సిరాజ్ స్నేహితుల సహాయంతో హైద్రాబాద్ లో జరిగే అనేక టోర్నమెంట్ లకు వెళ్లేవాడు…అనేక క్రికెట్ క్లబ్ లలో కూడా ఆడాడు.
- అతడి ప్రతిభ కారణంగా 2015-16 రంజీ సీజన్‌లో హైదరాబాద్ తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది.
Advertisements
Advertisement
- విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న సిరాజ్ బౌలింగ్ స్కిల్స్ చూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అతడిని జట్టులోకి తీసుకుంది. తర్వాత బెంగుళూరు టీమ్ కు వెళ్లాడు సిరాజ్
- 2017 లో, సిరాజ్ భారత టి 20 జట్టుకు ఎంపికయ్యాడు, కానీ అతను టెస్ట్ జట్టుకి ఆడటం సిరాజ్ తండ్రి కల.
- ఆ రోజు రానే వచ్చింది, సిరాజ్ తండ్రి కల సాకారమైంది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకుంది ఆ జట్టులో సిరాజ్ కు స్థానం దక్కింది. కానీ కొడుకు గ్రౌండ్ లోకి దిగకముందే తండ్రి మరణించాడు.
- బిసిసిఐ అతనికి స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఇచ్చినప్పటికీ, సిరాజ్ ఆస్ట్రేలియాలో ఉండి తన తండ్రి కలను సాకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్ట్ లో అరంగేట్రం ఇండియా తరఫున తన డెబ్యూ మ్యాచ్ ఆడాడు.
- ఇక గబ్బాలో గర్జించాడు. 5 వికెట్లు తీసి టీమ్ ఇండియా విజయానికి బాటలు పరిచాడు.రెండు టెస్టుల్లో మొత్తం 13 వికెట్స్ పడగొట్టి టీమ్ ఇండియా విక్టరీలో కీలకపాత్ర పోషించాడు.
- ఆస్ట్రేలియా టూర్ ముగియగానే…ఎయిర్ పోర్ట్ నుండి స్మశానికి వెళ్లి తండ్రి సమాధిని సందర్శించి తన నివాళులు అర్పించాడు.
Advertisements