Advertisement
లైన్ అండ్ లెన్త్ ……బౌలర్ పాటించాల్సిన బేసిక్ రూల్! ఈ విషయాన్ని ఎంత పక్కాగా ఫాలో అయితే బౌలర్ గ్రోత్ అంతగా ఉంటుంది! సింపుల్ గా చెప్పాలంటే ….ఫీల్డింగ్ సెటప్ కు తగ్గట్టు బాల్స్ వేయడమే లైన్ అండ్ లెన్త్…. ఆడకపోతే LBW , ఆడితే క్యాచ్…ఏం చేయాలో తెలియక బ్యాట్స్ మన్ పడే ఇబ్బందిని…. లైన్ అండ్ లెన్త్ లో బాల్స్ వేస్తూ బౌలర్ ఎంజాయ్ చేయొచ్చు.!
లైన్ : బౌలర్ బాల్ వేసే దిశ … స్టంప్స్ కు సరిగ్గా వేస్తున్నాడా? స్టంప్స్ కు ఆఫ్ సైడ్, స్టంప్స్ కు లెగ్ సైడ్… ఇలా వికెట్లను దృష్టిలో ఉంచుకొని బాల్ వేసే దిశనే లైన్ అంటారు.
Advertisement
లెన్త్ : బౌలింగ్ ఎండ్ స్టంప్స్ కు బ్యాంటింగ్ ఎండ్ స్టంప్స్ కు మద్య 22 యార్డ్స్ డిస్టెంన్స్ ఉంటుంది. దీనిని రెండు భాగాలుగా చేస్తే….బ్యాట్స్ మన్ వైపు ఉండే పిచ్ ను దూరాన్ని బట్టి కొన్ని పేర్లతో పిలుస్తారు…..
- ఫుల్ లెన్త్ – స్టంప్స్ నుండి 4 మీటర్ల వరకు ( ఫుల్ టాస్ , యార్కర్ లు ఇందులోనే వస్తాయి)
- గుడ్ లెన్త్ – స్టంప్స్ నుండి 6 మీటర్ల వరకు
- షార్ట్ పిచ్ – స్టంప్స్ నుండి 8 మీటర్ల వరకు
Advertisements
ఇప్పుడు…….బ్యాట్స్ మన్ స్టాండింగ్ ,మూడ్ ను బట్టి….ముందుగానే సెట్ చేసుకున్న ఫీల్డింగ్ ప్లేస్ మెట్ ను బట్టి..లెన్త్ ( ఫుల్ లెన్త్, గుడ్ లెన్త్ , షార్ట్ పిచ్ )ను, లైన్ ( వికెట్ టు వికెట్ / ఆఫ్ సైడ్ / లెగ్ సైడ్) ను ఫిక్స్ చేసుకొని బాల్ వేయడమే లైన్ అండ్ లెన్త్.
Advertisements