Advertisement
లాక్ డౌన్ 4 ముగుస్తున్న కారణంగా లాక్ డౌన్ 5 కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. ఫేజ్ ల వారీగా లాక్ డౌన్ ను సడలించనున్నారు. కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక రాష్ట్రాలలో ఆంక్షలు, నిషేధాజ్ఞలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విధించుకోవచ్చు.
లాక్ డౌన్ 5 మార్గదర్శకాలు:
- జూన్ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్ మాల్స్‌కు అనుమతి
- పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం. విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం.
- రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుంది
- బహిరంగ ప్రదేశాల్లో, పనిచేసే చోట, ప్రయాణాలు చేసేటప్పుడు ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి.
Advertisement
వీటికి అనుమతి లేదు
- మెట్రో రైలు
- అంతర్జాతీయ విమాన సేవలు
- సినిమాహాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, పార్కులు, బార్లు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలు
Advertisements
కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్:
Advertisements
- కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది.
- కంటైన్‌మెంట్ జోన్ల పరిధిని….కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గర్శకాల ప్రకారం ఆయా జిల్లాల అధికారులు నిర్ణయిస్తారు.
- కంటైన్‌మెంట్ జోన్లలో అత్యవసర, నిత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
- బహిరంగ ప్రదేశాల్లో అందరూ 6 అడుగల భౌతిక దూరం పాటించాలి.
- వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరు కాకూడదు.