Advertisement
మా పెళ్లి జరిగి రెండేళ్లు పూర్తైంది..ఫ్రెండ్స్ గా పరిచయం అయి ప్రేమికులుగా మారి చివరికి పెళ్లితో ఒక్కటయ్యాం.. ఇద్దరం ఐటి ప్రొఫెషనల్స్.. ఉరుకుల పరుగుల జీవితం.. కానీ లాక్ డౌన్ మా జీవితాల్ని చాలా ప్రభావితం చేసింది..ఒకప్పుడు ఇల్లు,ఆఫీస్,వీకెండ్ అవుటింగ్స్,పార్టీస్ ఇలా సాగిన మా లైఫ్ స్టైల్.. లాక్ డౌన్ తో 24గంటలు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది..ఈ మూడు నెలల కాలంలో మా లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటో మీతో శేర్ చేస్కోవాలనుంది..
ఇద్దరం వర్క్ ఫ్రం హోంలో ఉన్నాం….ఇద్దరిపై వర్క్ ఫ్రెషర్ ఉంటుంది..దానికి తోడు నాకు ఇంటి పనుల టెన్షన్ కూడా..గతంలో మాకు పనమ్మాయి వచ్చేది..ఇప్పుడు ఆ సౌకర్యం లేదు..దాంతో లాక్ డౌన్ తొలిరోజుల్లోనే ఇద్దరం ఒక ఒప్పందానికి వచ్చాం..ఇంటి పనులు ఇద్దరం చేయాల్సిందే అని..దానికి తను కూడా ఒప్పుకున్నాడు..గిన్నెలు తోమడం,ఇల్లు, బాత్రూం క్లీనింగ్ ఇలా ప్రతి పని ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం..
ఇద్దరికి 9 గంటల డ్యూటీ..పని మధ్యలో లంచ్ కి మాత్రమే బ్రేక్ దొరికేది.. దొరికిన కొద్దిపాటి సమయాన్ని కూడా ఇద్దరం మాట్లాడుకోవడానికే కేటాయించాలనుకున్నాం..అందుకే మొబైల్స్ వాడకం తగ్గించాం. ఈ లాక్ డౌన్ కాలంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇద్దరం కలిసి భోజనం చేయడం.. గతంలో ఫూడ్ తినేప్పుడు ఎప్పుడూ ఇంత హ్యాపీగా ఉన్న జ్ణాపకాలు లేవు..తింటూనే ఇద్దరం మొబైల్స్ లో తల దూర్చేవాళ్లం..కాని ఇప్పుడు మొబైల్స్ వాడకం తగ్గించడంతో ఫూడ్ ని ఎంజాయ్ చేయగలుగుతున్నా.. ఫూడ్ తినే టైంలో తన కంపెనిని కూడా..
Advertisement
గతంలో మా మధ్య చిన్నచిన్న విషయాలకు గొడవలు జరిగేవి..వాటివల్ల డిస్టర్బ్ అయ్యేవాళ్లం రెండు మూడు రోజులు మాట్లాడుకోకుండా ఆ డిస్టర్బెన్స్ ను క్యారీ చేస్తూ ఉండేవాళ్లం..కాని ఇప్పుడు డిస్టర్బెన్స్ ప్లేస్లో డిస్కషన్స్ వచ్చి చేరాయి..ఎన్నో టాపిక్స్ పై డిస్కషన్స్..ఇద్దరి నాలెడ్జ్ ని,స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్కోవడానికి మా డిస్కషన్స్ బాగా హెల్ప్ చేస్తున్నాయి.. మా డిస్కషన్స్ లో చాలా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.వాటిని లాక్ డౌన్ పూర్తయ్యాక ఫుల్ ఫిల్ చేస్కోవాలి..
Advertisements
మాకంటూ ప్రైవేట్ స్పేస్ ఉండడం..ఆ స్పేస్ లో మాదైన లోకంలో బతకడం ఎంత ముఖ్యమో అర్దం అయింది..ఇద్దరం కలిసి సినిమాలు, వెబ్ సిరిస్లు చూస్తున్నాం….అఫ్కోర్స్ అవి చూస్తూనే తను నిద్రపోతాడు..నెక్స్ట్ డే మార్నింగ్ తనకి స్టోరీ మొత్తం చెప్పడం నా డ్యూటీ.. తన లూజ్ టీ షర్ట్స్ నాకు చాలా ఇష్టం..వాటిని తన పర్మిషన్ లేకుండా దొంగతనంగా తీసుకుని వేసుకోవడం మరింత ఇష్టం..తన టీ షర్ట్ కోసం నా వెంట పరుగులు పెడుతూ ఇద్దరం చిన్నపిల్లల్లా అల్లరి చేస్తూ.. లైఫ్ అంతా ఇలా ఉండిపోతే బాగున్నూ అనిపిస్తుంది.. Thanx to lock-down..for locked us together.
BY : శ్రేయగుప్త
Advertisements