Advertisement
అవును.. శ్రీకృష్ణుడి గుండె పూరీలోని జగన్నాథ ఆలయంలో స్వామి వారి విగ్రహంలో ఇప్పటికీ ఉంది. అయితే అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కొందరు అది ఆభరణం రూపంలో ఉంటుందంటారు. కొందరు అది శిలాజంలా మారి ఉంటుందని చెబుతారు. ఇక కొందరు అయితే ఆ గుండె తాంత్రిక యంత్రం రూపంలో ఉంటుందంటారు. ఇంకా కొందరు అది ఒక కళాకృతి రూపంలో ఉంటుందంటారు. అయితే దాన్ని చూసిన వారు ఇప్పటికీ ఎవరూ లేరు.
ఇక పూరీ జగన్నాథ విగ్రహంలోని శ్రీకృష్ణుడి గుండెకు సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే.. కృష్ణుడు రాజ్యపాలన బాధ్యతలను విరమించుకుని అరణ్యంలో తపస్సు చేసుకుంటుంటాడు. ఒకసారి కృష్ణుడు ఓ చెట్టు కింద కూర్చుని ధ్యానంలో ఉండగా.. అతని పాదం ఒకటి బయటకు కనిపిస్తుంటుంది. దాన్ని చూసి జరాసబరుడనే వేటగాడు లేడి కన్నులనుకుని పొరపాటు పడతాడు. వెంటనే అతను బాణం గురి చేసి విడుస్తాడు. దీంతో ఆ బాణం కృష్ణుడి పాదానికి గుచ్చుకుంటుంది. ఈ క్రమంలో కృష్ణుడు చనిపోతాడు. తన భౌతిక దేహం విడుస్తాడు. ఆ అవతారం చాలిస్తాడు.
Advertisement
తరువాత పాండవులు వచ్చి కృష్ణుడి మృతదేహానికి బంగాళాఖాతం సమీపంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే కృష్ణుడి మృతదేహం మొత్తం దహనం అవుతుంది, కానీ అతని గుండె చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. దాన్ని పాండవులు తీసి సముద్రంలో కలుపుతారు. తరువాత వారిని వెంబడిస్తూ వచ్చిన ఆ వేటగాడు కృష్ణుడి గుండెను తీసుకుంటాడు. అప్పటికే అది నీలి రంగు రాయి రూపంలోకి మారుతుంది. అనంతరం దాన్ని ఆ వేటగాడు ఓ గుహలో ఉంచి పూజలు చేస్తాడు. ఈ క్రమంలో ఈ నీలిరాయి అతని వారసుల వద్ద ఉంటుంది.
అయితే ఆ వేటగాడి వారసుల నుంచి ఆ రాయిని తీసుకున్న ఇంద్రద్యుమ్న అనే రాజు దాన్ని జగన్నాథ స్వామి విగ్రహంలో పెట్టిస్తాడు. అప్పటి నుంచి ఆ రాయి పూరీ జగన్నాథుని విగ్రహంలోనే ఉంటూ వస్తోంది. కాగా ప్రతి 8, 9, 12, 19 సంవత్సరాలకు ఒకసారి పూరీలో జగన్నాథ స్వామి విగ్రహాన్ని మారుస్తారు. అందువల్ల ఆ రాయిని పాత విగ్రహం నుంచి తీసి కొత్త విగ్రహంలో పెడతారు. ఆ కార్యక్రమాన్ని అర్థరాత్రి పూట నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం కొందరు అర్చకులు మాత్రమే ఆలయంలోకి వెళ్లి కళ్లకు గంతలు కట్టుకుని ఆ విగ్రహంలో ఉన్న రాయిని తీసి కొత్త విగ్రహంలో పెడతారు. అయితే అది వస్త్రంలో ఉంటుంది కనుక.. అది ఎలా ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దాన్ని ఎవరూ చూడలేదు. అందువల్ల సాక్షాత్తూ శ్రీకృష్ణుడి హృదయమే ఆ విగ్రహంలో ఉంటుందని చెబుతారు.
Advertisements
Advertisements