Advertisement
శ్రీరాముడి బాణాలు అత్యంత శక్తివంతమైనవని అందరికీ తెలిసిందే. విలువిద్య నేర్చుకున్నప్పటి నుంచే రాముడు ఎంతో మంది రాక్షసులను తన అస్త్రాలతో సంహరించాడు. రామబాణం అనే మాట రాముడికి ఉన్న విలువిద్య నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. అయితే శ్రీరాముడిది కుడి చేతి వాటమా ? లేక ఆయన ఎడమ చేయిని ఎక్కువగా ఉపయోగించేవాడా ? అన్న సందేహం జనాలకు కలుగుతోంది. మరి ఆ సందేహానికి సమాధానం ఏమిటంటే..?
Advertisement
రావణాసురుడు సీతను అపహరించుకు పోయినప్పుడు సీత రావణుడితో పలు సందర్భాల్లో రాముడి గొప్పతనాన్ని అభివర్ణిస్తుంది. విశాలమైన నేత్రాలు కలవాడు, ప్రపంచంలోనే అత్యంత ఘనమైన కీర్తి కలవాడు, నాశనం కాబడని వాడు, కపటం తెలియని, అత్యంత పరిపూర్ణమైన, మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు, సవ్యసాచి.. శ్రీరాముడు.. ఆయనే నా భర్త.. అని చెబుతుంది. అంటే సవ్యసాచి అన్న పదాన్ని తీసుకుంటే.. శ్రీరాముడు రెండు చేతులను సమానంగా వాడగలిగేవాడు అన్నమాట. ఆయనకు రెండు చేతులకు సమానమైన బలం ఉంటుందన్నమాట.
ఇక వాల్మీకి రామాయణంలోనూ శ్రీరాముడు సవ్యసాచి అని పలుమార్లు పేర్కొన్నారు. అందువల్ల రాముడిది కుడిచేయి వాటం కాదు.. ఎడమ చేయి వాటం కాదు.. ఆయన రెండు చేతులనూ సమానంగా వాడుతాడు.. అని మనకు తెలుస్తుంది. అయినప్పటికీ బాణాలు వేసేటప్పుడు ఆయన కుడిచేతినే ఎక్కువగా వాడుతాడు. అదీ అసలు విషయం..!
Advertisements