• Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

  • News
  • Story Pic
  • Life Story
  • LT-Exclusive

లవ్ వైరస్… PART-3

April 15, 2020 by Admin

Advertisement

సార్ నన్నెందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతాడు వెంకట్. చెప్తా గాని మొత్తం మీ టీం ఎంతమంది చెప్పరా అని అంటాడు ఎస్సై. ఫిఫ్టీన్ మెంబర్స్ అంటాడు వెంకట్. అబ్బో ఇంగ్లీషు… నువ్వేనా మీ టీం లీడర్ అని అంటాడు ఎస్సై.కాదు అంటాడు వెంకట్.మరి ఎవడు మీ టీం లీడర్ అని ఎస్సై అడిగితే వెంకట్ అబ్బే మా టీం లీడర్ మగాడు కాదు సార్ అంటాడు. మరి అమ్మాయా అని అంటాడు ఎస్సై. ఆ రెండింటి మధ్యలో అంటాడు వెంకట్. ఇదంతా నడిపించేది ఒక పాయింట్ ఫైవ్ గాడా అని అంటాడా ఎస్సై. ఏం చేస్తాం సార్ మా కంపెనీ వాళ్లు అలా రిక్రూట్ చేసుకున్నారు.

ఏంట్రో…. కంపెనీ, రిక్రూట్ అంటున్నావ్..ఢీ కంపెనీనా అంటాడు ఎస్సై. కాదు సార్ టెక్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అంటాడు వెంకట్. హైటెక్ సిటీలో దొంగతనం చేయడానికి కంపెనీ పేరు కూడా హైటెక్ గా పెట్టుకున్నార్రా …. అంటాడు ఎస్సై.దొంగతనమేంటి సార్ అని అంటాడు వెంకట్. ఏంట్రా మళ్లీ ఏం తెలియనట్టు అడుగుతున్నావ్…. ఇంతకీ ఆ గుడ్డోడిగా యాక్ట్ చేసిందెవడ్రా….ఎంతమంది దగ్గర వర్కవుట్ చేశారా ఇలాగా….అని అంటాడు ఎస్సై.సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అనంటాడు వెంకట్. ఎందుకవుతుందిరా కాదు ఇంతసేపే మర్యాదగా మాట్లాడాను కదా, అందుకే అర్థం కాదు ఒక రౌండ్ తగిలితే అప్పుడు అర్థమైతది అంటాడు ఎస్సై.

అంతలోనే పోలీస్ స్టేషన్ కు వస్తుంది ఆ అమ్మాయి…ఆ అమ్మాయిని చూసిన ఎస్సై రామ్మా వీడికి ఏం తెలియదంటున్నాడు అని అంటాడు.లేదు సార్ వీడే ఆ రోజు ఆ గుడ్డోన్ని తీసుకువచ్చి నాకప్పగించాడు. వాడు నన్ను ఆ అడ్రస్, ఈ అడ్రస్ అంటూ తిప్పి ఎవరూ లేని చోటికి తీసుకెళ్లాక కత్తితో బెదిరించి చైన్, డబ్బులు తీసుకున్నాడు. అప్పుడు గాని తెలియలేదు వాడికి కళ్లు కనిపిస్తాయనీ… ఇదంతా వీళ్ల నాటకం అని అంటుంది శైలజ.ఏంటండి మీరు చెప్పేది నాకు, వాడికి ఏం సంబందం లేదండి, నాకు కూడా వాడు అప్పుడే రోడ్డు దాటించమంటూ తగిలాడు. ఆ రోజు ఇంటర్వ్యూ హడావుడిలో నేను, మీకు అప్పజెప్పాను అంతే అంటాడు వెంకట్.


ఛా… నీకీ సాఫ్ట్ వేర్ పిచ్చేంట్రా ఏ కథ చెప్పినా నువ్వు సాఫ్ట్ వేర్ కే లింక్ పెడుతున్నావ్ అంటాడు ఎస్సై.
సార్ నేను చెప్పేది నిజం      ఇదిగో నా ఐ.డి. కార్డ్ చూడండి అంటూ జేబులోంచి ఐడి తీసి చూపిస్తాడు.
అది చూసిన ఎస్సై, అబ్బా… ఐడి కార్డ్ బాగుంద్రా… నేను మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేస్తున్నట్టు ఐడి కార్డు చూపిస్తే సాఫ్ట్ వేర్ ఎంప్లాయినవుతానా అంటుంటాడు ఎస్సై.అంతలోనే అక్కడికొచ్చిన వెంకట్ కొలిగ్స్ ఎస్సై కి తమ కంపెనీ ఐడి కార్డ్స్ చూపించి కంపెనీకి కాల్ చేసి మాట్లాడిస్తారు. దాంతో ఎస్సైకి వెంకట్ నిజమే చెప్తున్నాడని అర్థమయ్యి సారీ అండి దొగలు ఏదీ ఒక పట్టాన ఒప్పుకోరు, పైగా ఇలాంటి కథలు చెప్తుంటారు అందుకే నేను త్వరగా నమ్మలేదు, పైగా వాళ్లు కూడా ఈ మధ్య చాలా నీట్ గా రెడీ అయ్యి ఎంప్లాయిస్ లా తిరుగుతున్నారు అనంటాడు.

మేడమ్ మీరు ఇతన్ని మిస్ అండర్ స్టాండ్ చేసుకున్నారు. ఆ దొంగ ఎవడో మేము పట్టుకుని మీకు చెప్తాం అంటాడు ఎస్సై, ఓకే సార్ మీరెళ్లొచ్చు అనంటాడు ఎస్సై.వెంకట్ వాళ్ల కొలిగ్స్ తో కలిసి వెళుతుంటాడు. ఆ అమ్మాయి వెంకట్ ను హలో … ఎక్స్ క్యూజ్ మీ అని పిలుస్తుంది. వెంకట్ వెనక్కి చూస్తాడు. అతని కొలిగ్స్ మాత్రం ముందుకు నడుస్తుంటారు. ఆ అమ్మాయి వెంకట్ దగ్గరికొచ్చి ఐ యామ్ సారీ అండి నేను ఇలా చేసుండకూడదు, బట్ ఆ దొంగకు సంబంధించినంత వరకు నాకు తెలిసింది మీరొక్కరే అందుకే మీరు కనబడగానే పోలీసులకు కాల్ చేశాను అంటుంది.

Advertisements

Advertisement

హెల్ప్ చేయాలనుకుంటే ఇలా అవుతుందనుకోలేదు ఇంకెప్పుడూ ఎవరికీ హెల్స్ చేయాలనే ఆలోచన రాకుండా చేశారు థ్యాంక్స్ అంటాడు వెంకట్.అయ్యో అలా కాదండి బై మిస్టేక్ జరిగింది సారీ అండి రియల్లీ సారీ అంటుంది ఆ అమ్మాయి. ఇట్స్ ఓకే అంటాడు వెంకట్ ముభావంగా. మీకు ఇంకా కోపం తగ్గలేదనుకుంటా, ఇదే మీ ఫ్రెండ్ సారీ చెప్తే యాక్సెప్ట్ చెయ్యరా అంటుంది ఆ అమ్మాయి. అబ్బా ఓకే అన్నాను కదండి అంటాడు వెంకట్. అలా కాదు మీరు కోపంగా ఉన్నారు అంటుంది అమ్మాయి. ఏం లేదండి అంటాడు వెంకట్.మీకు కోపం లేకుంటే ఈ వీకెండ్ మీరు నాతో కాఫీకి రావాలి అనంటుంది అమ్మాయి. అయ్యో అదేం వద్దండి అంటాడు వెంకట్. అలా అంటున్నారంటే మీరింకా సీరియస్ గా ఉన్నారనమాట అని అంటుంది అమ్మాయి. అదేం లేదు వస్తాను ఎక్కడికి రావాలి అంటాడు వెంకట్. వెంకట్ కు ఎక్కడికి రావాలో చెప్పి, బై చెప్పి వెళ్లిపోతుంది శైలజ.

వెంకట్ తన కొలిగ్స్ దగ్గరికి వెళ్లే సరికి వాళ్లంతా ఏంట్రా అమ్మాయి ఏం అంటుంది అనంటారు. సారీ చెప్పింది, వీకెండ్ కాఫీకి రమ్మంది అనంటాడు వెంకట్.ఓహో…. ఇంకేంటి అందమైన అమ్మాయి కాఫీకి రమ్మంటే ఆలోచించేదేంటి వెళ్లు కుమ్మెయ్ అంటారు కొలిగ్స్. అంతలోనే అరుణ్ బాబు వెంకట్ ఈ అమ్మాయిని చూసి, ఇంటర్వ్యూ రోజు చూసిన అమ్మాయిని మర్చిపోతావా…. లేకపోతే అమ్మాయంటే అలా ఉండాలి అంటూ అదే మాట చెబుతావా… అని అడుగుతాడుచెప్పను.. ఎందుకంటే ఆ అమ్మాయే… ఈ అమ్మాయి కాబట్టి అంటాడు వెంకట్. వావ్ ఇంకేంట్రా… వెళ్లి అమ్మాయిని లైన్లో పెట్టెయ్ అంటారు కొలిగ్స్.సాటర్ డే వెంకట్ కాఫీ షాప్ కు వెళతాడు, వెంకట్ కాసేపు వెయిట్ చేశాక ఆ అమ్మాయి వస్తుంది. సారీ అండి లేట్ అయ్యింది అనంటుంది.పర్లేదు మీరు లేట్ గా వస్తారని నేను అనుకున్నాను అంటాడు వెంకట్. అదేంటి అనడుగుతుంది ఆ అమ్మాయి. ఎప్పుడూ అబ్బాయే కదండి అమ్మాయి కోసం వెయిట్ చేస్తాడు అందుకని జనరల్ గా చెప్పా అంటాడు వెంకట్. మొన్న నా మీదే సీరియస్ గా ఉన్నారనుకున్నా మొత్తం అమ్మాయిల మీదే సీరియస్ గా ఉన్నారు అంటుంది అమ్మాయి. లేదండి జనరల్ గా చెప్పా చాలా సినిమాల్లో చూశాను కదా అయినా మొన్న మీ సిచ్యువేషన్ లో నేనుండి ఆలోచించా మీరేతే నన్ను చూసి కూడా మెల్లిగా పోలీస్ లకు కాల్ చేశారు. నేనైతే స్పాట్ లో నాలుగు పీకి డబ్బులు లాక్కునే వాన్ని అనంటాడు వెంకట్. హమ్మయ్య… మొత్తానికి మీరు నన్ను అర్థం చేసుకున్నారు అంటుంది అమ్మాయి. పోన్లెండి నేను కాస్త లేట్ గా అర్థం చేసుకున్నా కాబట్టి మీరు నన్ను కాఫీకి పిలిచారు లేకపోతే పిలిచేవారు కాదు అంటాడు వెంకట్. వ్వాట్ … మీరు ఇలా కూడా మాట్లాడతారా… మిమ్మల్ని చూసినప్పటినుంచి ఇదే ఫస్ట్ టైం ఇలాంటి మాటలు వినడం అనంటుంది అమ్మాయి. నేను మామూలుగానే ఉంటాను ఆ రోజు షాక్ లో అలా మాట్లాడానంతే ఇంతకీ మీరేం చేస్తారు అనంటాడు వెంకట్.

నేను గూగుల్ లో జాబ్ చేస్తున్న అని, కామెడీ ఏంటంటే మీ పేరేంటో నాకు తెలియదు, నా పేరేంటో మీకు తెలియదు అంటుంది అమ్మాయి. అవును కదా నా పేరు వెంకట్, రీసెంట్ గా హైదరాబాద్ వచ్చాను, మా పేరెంట్స్ ఊర్లో ఉంటారు అంటాడు వెంకట్.
నా పేరు శైలజ పిల్లై , మాది కేరళ కాని నేను త్రీ ఇయర్స్ గా ఇక్కడే ఉంటున్నాను అంటుంది శైలజ.
వీరు మాట్లాడుకోవటం వేరే టేబుల్ లో కూర్చున్న వ్యక్తి సీరియస్ గా అబ్జర్వ్ చేస్తుంటాడు. కాని వెంకట్ , శైలజ అది గమనించరు. అవునా మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారండి, మరి మీ ఫ్యామిలీ అంటాడు వెంకట్. అబ్బే వాళ్లు తెలుగు ఇంత బాగా మాట్లాడరు అంటుంది శైలజ. అరె అది కాదండి వాళ్లెక్కడుంటారు అంటున్నా అంటాడు వెంకట్. వాళ్లు కేరళలో ఉంటారు, నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటాను, ఆఫీస్ కు వెళ్లడం, రావడం, రొటీన్ డేస్ అండ్ రొటీన్ వీకెండ్స్ అలా గడిచిపోతుంది అంటుంది శైలజ.

అవునా నాకు మాత్రం ఈ వీకెండ్ కొత్తగా ఉంది ఎందుకంటే నేను మీతో కలిసి కాఫీకి వచ్చాను గా అంటాడు వెంకట్. అరె నిజమా మరి నాకెందుకిలా రొటీన్ గా అనిపిస్తుంది, మీకు తెలియకుండా నేనెప్పుడైనా మీతో కాఫీకి వచ్చానా అంటూ నవ్వుతుంది శైలజ. వెంకట్ కూడా నవ్వుతుంటాడు.

అలా ఇద్దరు నవ్వుతుండగా మరో టేబుల్ దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని లేచి వచ్చి అక్కడున్న పెద్ద గాజు కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని వెంకట్ తల మీద గట్టిగా కొట్టి అక్కన్నుండి పారిపోతాడు. వెంకట్ తల నుండి రక్తం వస్తుంటుంది. వెంకట్ టేబుల్ పైన పడిపోతాడు. శైలజ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తుండిపోతుంది.

Advertisements

CLICK HERE : PART 4

Filed Under: Stories

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని … [Read More...]

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల … [Read More...]

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి … [Read More...]

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత … [Read More...]

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత … [Read More...]

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల … [Read More...]

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు … [Read More...]

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ … [Read More...]

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 … [Read More...]

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన … [Read More...]

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా … [Read More...]

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, … [Read More...]

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా … [Read More...]

అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?

ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట … [Read More...]

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు … [Read More...]

అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?

మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని … [Read More...]

బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?

భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు … [Read More...]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?

హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు … [Read More...]

Search

Advertisements

Latest Posts

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

TV9 ను దాటిన NTV!

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

Copyright © 2023 · Logical Telugu - Designed and Managed by Rishi Bharadwaj