Advertisement
వెంకట్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లిన కాసేపటి తర్వాత ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకొచ్చిన డాక్టర్ తో శైలజ కంగారుగా ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది.కంగారుపడకండి, అతనికి లైఫ్ రిస్క్ ఏం కాదు బట్ హెడ్ ఇంజ్యూరీ కాబట్టి అన్ కాన్సియస్ అయ్యాడు అండ్ టూ టు త్రీ డేస్ అబ్బర్వేషన్ లో ఉంచాలి. ఇంటర్నల్ గా ఏ ప్రాబ్లం లేదనుకుంటే అప్పుడు తీసుకెళ్లవచ్చు బట్ హీ నీడ్స్ రెస్ట్ ఫర్ ఏ వీక్ డేస్ అని చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు.దాంతో రిలాక్స్ అయిన శైలజ ఆ రోజంతా అక్కడే ఉంటుంది. వెంకట్ ను కొట్టింది ఎవరు , తనకు ఎవరైనా ఎనిమీస్ ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది.
నెక్ట్స్ డే మార్నింగ్ వెంకట్ కాన్షియస్ లోకి వస్తాడు. వెంకట్ ను జనరల్ రూంకు షిఫ్ట్ చేస్తారు. శైలజ వెంకట్ దగ్గరకొచ్చి ఇప్పుడెలా ఉంది వెంకట్ అని అడుగుతుంది.తల నొప్పిగా ఉంది బట్ ఇట్స్ ఓకే … నా తలకు కదా దెబ్బ తగిలింది… మీరు తలనొప్పితో బాధపడుతున్నట్టు డల్ గా ఉన్నారేంటి అనంటాడు వెంకట్.అదా… నైట్ నిద్రలేదు, నాకు చైర్ లో కూర్చుని నిద్రపోయే అలవాటు లేదు, ఈ హాస్పిటల్ లో పేషెంట్స్ కే బెడ్స్ ఇస్తారు మరి… అందుకే మొహం వాడిపోయింది అంటుంది శైలజ.
ఓ.. నా కోసం మీరు చాలా రిస్క్ తీసుకున్నారు, అయినా నేనిప్పుడు ఓకే కదా.. మీరు వెళ్లి రెస్ట్ తీస్కోండి అంటాడు వెంకట్.
పర్లేదు నేను ఉంటాను మీరొక్కరే ఇబ్బందిపడతారు. మీ వాళ్లకు ఇన్ ఫాం చేద్దాం, వాళ్లు వచ్చాక నేను వెళ్తాను అంటుంది శైలజ. మా వాళ్లకు ఇన్ ఫాం చేస్తే వాళ్లు టెన్షన్ పడతారు, నన్ను జాబ్ వద్దు ఏం వద్దు ఊరికెళ్దాం అంటారు. అండ్ నేను బానే ఉన్నాను పర్లేదు మీరెళ్లండి నేను మేనేజ్ చేసుకోగలను అంటాడు వెంకట్. ఇంతకీ మిమ్మల్ని కొట్టింది ఎవరు అనంటుంది శైలజ. అదే తెలియట్లేదండి… నాకు పెద్ద ఫ్లాష్ బ్యాక్ లు కూడా ఏం లేవు, మా ఊర్లో నాతో మాట్లాడే అమ్మాయిలకు కూడా అన్నలు , తమ్ములు ఎవరు లేరు, పోనీ ప్రొఫెషనల్ ఎనిమీస్ అందామంటే ఫస్ట్ మంత్ సాలరీయే నిన్న వచ్చింది, అప్పుడే నా పర్ఫామెన్స్ మీద ఎవడు కుళ్లుకునే ఛాన్స్ కూడా లేదు అంటాడు వెంకట్.
కొంచెం పేషెంట్ లా మాట్లాడండి అని నవ్వుతూ, నిన్న హాస్పిటల్ కు పోలీస్ లు వచ్చి రిపోర్ట్ తీసుకుని వెళ్లారు చూద్దాం ఏమవుతుందో, సరే నేను వెళుతున్నాను, ఈవినింగ్ వస్తాను అని వెళుతుంది శైలజ.హాస్పిటల్ నుండి తన ఫ్లాట్ కు వెళ్లిన శైలజ ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్ కు వెళుతుంది. అక్కడ వర్క్ పూర్తి చేసుకున్న శైలజ ఈవినింగ్ బయలుదేరే ముందు పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి వెంకట్ కేసు గురించి అడుగుతుంది ఎస్సైని అడుగుతుంది . కాఫీ షాప్ లోని సిసి కెమెరా పనిచేయకపోవడంతో అతని ఆధారాలు ఏమీ దొరకలేదు ఎంక్వైరీ చేస్తున్నాం అంటాడు ఎస్సై. అక్కన్నుంచి హాస్సిటల్ కు వస్తుంది శైలజ. అప్పుడే డాక్టర్ వెంకట్ ను చెకప్ చేస్తుంటాడు. వెంకట్ పరిస్థితి గురించి అడుగుతుంది శైలజ. ఇట్స్ ఓకే అండి రిపోర్ట్స్ చూశాను ఇంటర్నల్ గా ప్రాబ్లం ఏమి లేదు కాకపోతే దెబ్బ తగ్గడానికి వన్ వీక్ పడుతుంది రెస్ట్ తీసుకోవడం అవసరం, రేపు ఇంటికి తీసుకెళ్లొచ్చు బట్ రెస్ట్ కంపల్సరీ అని చెప్పి వెళతాడు డాక్టర్.
Advertisement
ఊ… ఏంటి వెంకట్ కొంచెం ఈజీగా ఉందా ఇప్పుడు అనడుగుతుంది శైలజ. యా ఫీలింగ్ సమ్ రిలాక్స్, బెటర్ దెన్ ఎస్టర్ డే అండ్ నన్నీ హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు థ్యాంక్స్ అండి అంటాడు వెంకట్. అదేంటి ఈ హాస్పిటల్ గురించి స్పెషల్ అనంటుంది శైలజ. మార్నింగ్ డ్యూటీ లో ఇద్దరు నర్సులున్నారు, వాళ్లతో మంచి టైం పాస్ అంటాడు వెంకట్. ఏం అంత బాగున్నారా అంటుంది శైలజ. కాదండి అందుల ఒకరు శ్యామల, ఇంకొకరు అనసూయ. ఇద్దరికీ పెళ్లవలేదు. నేను శ్యామల బావలా ఉంటానంటా, శ్యామల తన బావను పెళ్లి చేసుకోవాల్సింది కాని అతను వేరే అమ్మాయిని చేసుకున్నాడంట, అందుకని నన్నైనా ఇంప్రెస్ చేద్దామని శ్యామల స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది నా మీద కాని అది అనసూయకు నచ్చడం లేదు.
ఏ ఎందుకు అనసూయ వాళ్ల బావ కూడా నీ లాగే ఉంటాడా అనంటుంది శైలజ. నో నో… శ్యామల, అనసూయ క్లాస్ మేట్స్ అంట కాలేజ్ టైంలో శ్యామల వాళ్ల బావ అనసూయను లవ్ చేసి చివరకు హ్యాండిచ్చి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట…దాంతో అనసూయకు శ్యామల బావ అంటె కోపం..వాడిలా ఉన్న నేనంటే కూడా కోపమే అంటాడు వెంకట్. అవునా? వీళ్లిద్దరి వల్ల మీరు బాగా ఎంటర్టైన్ అయినట్టున్నారు అంటుంది శైలజ. ఎంటర్ట్టైన్మెంట్ మాత్రమే కాదు..అప్పుడప్పుడు ఏడ్పువచ్చింది కూడా..అంటాడు వెంకట్, ఎందుకు అంటుంది శైలజ?
నా మీద ఇంట్రెస్ట్ తో శ్యామల ఆకలి లేదన్నా జ్యూస్ లు పిండి ఇస్తుంటే…అనసూయ మాత్రం వారం రోజులైనా నొప్పి తగ్గకుండా గుచ్చుతుంది ఇంజక్షన్లు అని చెబుతుంటాడు వెంకట్. అదివిన్న శైలజ నవ్వుతూ ఉండగా..రిసెప్షనిస్ట్ వచ్చి ఈ లెటర్ మీకివ్వమన్నారండీ అంటూ ఓ కవర్ తెచ్చి వెంకట్ కు ఇస్తుంది.
Advertisements
వెంకట్ అది తీసుకొని లోపలున్న లెటర్ విప్పి చూస్తే….నువ్వు శైలజతో ఇలాగే క్లోజ్ గా ఉంటే, నీకు చావు తప్పదు అని రాసుంటుంది. అది చదివి వెంకట్ షాక్ అయినట్టు గమనించిన శైలజ… ఏంటి వెంకట్ ఎనీథింగ్ రాంగ్ ? ఏంటీ ఆ లెటర్? అని అడుగుతుంది. వెంకట్ మాట్లాడకుండా లెటర్ శైలజకు ఇస్తాడు. అది చదివిన శైలజ వెంటనే..రిసెప్షనిష్ట్ ను పిలుస్తుంది. ఆ అమ్మాయి రాగానే….ఈ లెటర్ మీకెవరిచ్చారని అడుగుతుంది.తెలియదు మేడమ్..ఎవరో ఒకతను ఈ లెటర్ ఇవ్వమని చెప్పి వెళ్లిపోయాడు అంటుంది రిసెప్షనిస్ట్. అతనిని చూస్తే గుర్తు పడతావా? అని అడుగుతుంది శైలజ…హ..గుర్తుపడతా అంటుంది రిసెప్షనిస్ట్ వెంటనే…. శైలజ తన ఫోన్ లో ఉన్న ఒక గ్రూప్ ఫోటో చూపించి ఇందులో ఉన్నాడా వాడు అని అడుగుతుంది. అది చూసిన రిసెప్షనిస్ట్ …ఇదిగో ఇతనే మేడమ్ అంటూ ఆ గ్రూప్ లోని ఓ వ్యక్తిని చూపుతుంది. షిట్… ఇది చేసింది వీడా? అని కోపంగా అంటుంది శైలజ…… (ఇంకా ఉంది)
Advertisements
CLICK HERE : PART 5