• Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

  • News
  • Story Pic
  • Life Story
  • LT-Exclusive

“లవ్ వైరస్” PART-5

April 15, 2020 by Admin

Advertisement

ఎవడండి వాడు నేను మీతో మాట్లాడితే వాడికేంటి ప్రాబ్లమ్ అని అడుగుతాడు వెంకట్. మా ఆఫీస్ లో నా టీం లీడర్. వాడి పేరు రాకేశ్. మా బ్యాచ్ అందరం చాలా క్లోజ్ గా ఉండే వాళ్లం. ఓన్లీ ఆఫీస్ వర్క్ వరకు అనే కాకుండా అందరం మంచిఫ్రెండ్స్ గా మారాం. ఒకరింటికి ఒకరు వెళ్లడం, వీకెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేయడం, ఎక్కడికైనా టూర్ కు వెళ్లడం అంతా సరదాగాఉండేవాళ్లం. అందరితో పాటు రాకేశ్ కూడా ఉండేవాడు. అందుకనే అతనితో కూడా నేను ఫ్రీగానే మూవ్ అయ్యేదాన్ని ,బట్ తను ఇంకోలా అర్థం చేసుకున్నాడు. ఒకసారి నాకు ప్రపోజ్ చేశాడు. నేను చాలా కూల్ గానే కుదరదన్నాను. మొదట్లో మామూలుగానే ఉండేవాడు కాని తరువాత మళ్లీ మళ్లీఅడిగి విసిగించేవాడు.

అప్పటికి నేను ఒప్పుకోకపోయేసరికి వాడు నన్ను హెరాష్ చేయడం మొదలుపెట్టాడు. ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బందిపెట్టేవాడు.నాకు విసుగొచ్చి ఆఫీస్ మేనేజమెంట్ కు కంప్లైంట్ చేశాను. వాళ్లు వాడికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. కాని వాడు నా వెంటపడడం, విసిగించడం ఒక సైకోలా తయారయ్యాడు. ఇక లాభం లేదనుకుని నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్లు వాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి టూ డేస్ స్టేషన్ లో బాగా తన్నారంట తర్వాత ఏదో ఇన్ ఫ్ల్యూయెన్స్ తో బయటపడ్డాడు. అప్పటినుండి నా జోలికి రాలేదు. బట్ సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడు ఇదిగో ఇంకా వాడు నన్ను ఫాలో చేస్తున్నాడని అర్థమయ్యింది అని వెంకట్ తో చెప్తుంది శైలజ.

అలాగా అయితే వెంటనే పోలీస్ లకు ఇన్ ఫాం చేద్దాం వాడి సంగతి వాళ్లే చూసుకుంటారు అంటాడు వెంకట్. అవును వాళ్లకు ఇన్ ఫాం చెయ్యాలి, కాని అంతకంటే ముందు మీరు ఇక్కన్నుండి వెళ్లిపోవాలి ఎందుకంటే వాడు మిమ్మల్ని మళ్లీ ఏదైనా చేసే అవకాశం ఉంది అనంటుంది శైలజ. అయితే నేను డిశ్చార్జ్ అయ్యి మా హాస్టల్ కు వెళతాను అంటాడు వెంకట్. హాస్టల్ లోనా ఈ పరిస్థితిలో అక్కడెలా ఉంటారు, అయినా అది అంత సేఫ్ కూడా కాదు అనుకుంటా అంటుంది శైలజ. మీరు చెప్పేది నిజమే బట్ నాకింకో ఛాన్స్ లేదు ఎందుకంటే నేను ఇంటికి వెళ్లను చెప్పానుగా వాళ్లకు తెలిస్తే చాలాటెన్షన్ పడతారు అనంటాడు వెంకట్ . అయితే ఓ పని చేయండి నా ఫ్లాట్ కు వచ్చెయ్యండి అంటుంది శైలజ. మీ ఫ్లాట్ కా అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు వెంకట్.

ఏంటలా అన్నారు మా ఫ్లాట్ లోనే ఉండొచ్చు అక్కడైతే కొత్త వాళ్లు అంత ఈజీగా లోపలికి రాలేరు, మీరు సేఫ్ గా ఉండొచ్చు అండ్ మీకు కొంచెం పీస్ ఫుల్ గా కూడా ఉంటుంది, మీ హాస్టల్ లో లాగ గోల గోలగా ఉండదు అనంటుంది శైలజ. నో నో మీకే ప్రాబ్లమ్ అవుతుందేమోనని మళ్లీ మీ ఫ్లాట్స్ వాళ్లందరూ ఏదైనా ఆబ్జెక్షన్ చేస్తారేమో అని అంటాడు వెంకట్. అదేం లేదులెండి మీరు రావచ్చు ప్రాబ్లమ్ ఏమీ ఉండదు, పదండి వెళ్దాం అని సిస్టర్ ని పిలిచి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూడమని చెబుతుంది శైలజ. కాసేపటి తర్వాత సిస్టర్ వచ్చి పేమెంట్ చేసి డిశ్చార్జ్ కార్డ్ తీసుకుని వెళ్లిపోవచ్చు అంటుంది. పేమెంట్ చేసి బయటకు వెళ్తూ వెంకట్ ఎవడైనా ఫస్ట్ సాలరీ తో పార్టీ చేసుకుంటాడు లేకపోతే కొత్త బట్టలు కొనుక్కుంటాడు నేనే చాలా వెరైటీగా హాస్పిటల్ బిల్ కట్టాను అంటాడు. వెంటనే శైలజ సారీ ఇదంతా నా వల్లే అంటుంది శైలజ. లేదు మిమ్మల్నిఅనట్లేదండి జనరల్ గా చెప్పా అంటాడు
వెంకట్.

Advertisements

Advertisement

వెంకట్, శైలజ ఫ్లాట్ కు వస్తారు. ఫ్లాట్ చాలా బాగుంది, ఇంత పెద్ద ఫ్లాట్ లో మీరొక్కరే ఉంటున్నారా అంటాడు వెంకట్. ఇంతకు ముందు నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఈ మధ్యే వాళ్ల మ్యారేజెస్ అండంతో వెళ్లిపోయారు అంటుంది శైలజ. మరి మీ మ్యారేజ్ ఎప్పుడు అంటాడు వెంకట్. టైం దగ్గరికొచ్చిందనిపిస్తుంది అంటుంది శైలజ నవ్వుతూ… మళ్లీ శైలజనే నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అని లోపలికి వెళుతుంది.ఇద్దరు ఫుడ్ తిన్న తర్వాత శైలజ వెంకట్ కు ఎక్కడ పడుకోవాలో రూం చూపిస్తుంది. తను వెళ్లి వేరే రూంలో పడుకుంటుంది. తర్వాత రోజు మార్నింగ్ శైలజ ఆఫీస్ కు రెడీ అయ్యి వెంకట్ దగ్గరకు వెళ్లి, వెంకట్ మీరు తినడానికి ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచాను, ఆఫీస్ కు వెళుతున్నాను ఈవినింగ్ వస్తాను అని తన మొబైల్ తీసి అందులో ఒక ఫోటో చూపిస్తూ ఇదిగో వీడే రాకేశ్ అంటే ఒకవేళ ఎవరైనా డోర్ కొడితే చూసుకుని తియ్యి, నీకు వీడి ఫేస్ తెలిస్తే జాగ్రత్త పడతావు కదా అని చూపిస్తున్నా, ఇప్పుడు నేను స్టేషన్ కు వెళ్లి వీడి మీద కంప్లైంట్ చేసి వెళతాను అని చెప్పి వెళ్లిపోతుంది.

పోలీస్ స్టేషన్ కు వెళ్లిన శైలజ ఎస్.ఐ. నరేశ్ కు రాకేశ్ ఫోటో చూపించి అతని గురించి చెప్పి కంప్లైంట్ ఇస్తుంది. అతన్ని వెతికి పట్టుకుంటాం అని ఎస్.ఐ. చెప్తాడు. అక్కన్నుంచి ఆఫీస్ కు వచ్చిన శైలజ పని పూర్తి చేసుకుని మళ్లీ ఎస్. ఐ. కి కాల్ చేసి రాకేశ్ గురించి ఏదైనా తెలిసిందా అని అడుగుతుంది. అతను కొద్ది రోజులుగా ఇంటికి రావట్లేదంట, పరారీలో ఉన్నాడు, వెతికి పట్టుకుంటాం దొరకగానే ఇన్ ఫాం చేస్తాం అంటాడు ఎస్.ఐ. శైలజ ఆఫీస్ నుండి తన ఫ్లాట్ కు వెళ్లి వెంకట్ ను ఎలా ఉంది పెయిన్ తగ్గిందా, చాలా బోర్ గా ఉండుంటుంది ఇక్కడ మీకు అనంటుంది శైలజ.

బోర్ ఏం లేదండి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాను అని చెప్తాడు వెంకట్. అలా శైలజ ఆఫీస్ కు వెళ్లి, రావడం…. వెంకట్, శైలజలు ఈవినింగ్స్ అలా కూర్చుని మాట్లాడుకోవటం మొత్తానికి వారం గడిచిపోతుంది. వెంకట్ కు పూర్తిగా సెట్ అవుతుంది. ఒకరోజు వెంకట్, శైలజ తో ఓకే అండి ఇంక నేను హాస్టల్ కు వెళతాను అంటాడు. వెళతారా…. ఏ ఇక్కడే ఉండి, ఇక్కడి నుండే ఆఫీస్ కు వెళ్లొచ్చు కదా పైగా మీ ఆఫీస్ ఇక్కడి నుండి దగ్గర కదా అంటుంది శైలజ. మీరేదో దెబ్బ తగిలింది రెస్ట్ తీసుకోడానికి రమ్మంటే పర్మినెంట్ గా ఉంటే ఏం బాగుంటుంది అంటాడు వెంకట్. మీరు అప్పుడప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడతారు, అప్పుడప్పుడు చాలా మొహమాటంగా మాట్లాడతారు ఏంటి, అయినా మనిద్దరి మధ్య ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుందో తెలుసా.. అనంటుంది శైలజ. ఎందుకు అంటాడు వెంకట్. మనం ఇంకా మీరు, అదండి, ఇదండి అని చాలా పొలైట్ గా మాట్లాడుకుంటున్నాం అందుకే సో… వెంకట్ నువ్వు ఇక్కడే ఉండొచ్చు నాకు ఏం ప్రాబ్లమ్ లేదు, నీకు కూడా ఆబ్జెక్షన్ లేకపోతే నీ లగేజ్ తెచ్చుకుని ఇక్కడ ఉండు అంటుంది శైలజ. వెంకట్ చిన్నగా నవ్వుతూ.. అలాగే శైలజ అంటాడు. అలా… వెంకట్, శైలజ ఒకే ఫ్లాట్ లో ఉంటూ ఆఫీస్ కు వెళ్లి వస్తుంటారు. ఒకరోజు ఎస్.ఐ. ,శైలజకు కాల్ చేసి వాడు దొరికాడు మీరు ఒకసారి స్టేషన్ కు రండి అంటాడు. వెంటనే శైలజ, వెంకట్ కు కాల్ చేస్తుంది బట్ వెంకట్ ఫోన్ కలవదు. దాంతో శైలజ ఒక్కతే స్టేషన్ కు వెళుతుంది. శైలజ వెళ్లగానే ఇతనే కదా మీరు చెప్పిన వ్యక్తి అంటాడు ఎస్.ఐ. . అవును వీడే ఎస్.ఐ. గారు అంటుంది శైలజ.

శైలజను చూడగానే ఏయ్ నువ్వ చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావ్, అయినా నా లవ్ ను అర్థం చేసుకోకుండా వాడెవడితోనో తిరుగుతావా… నేను వాన్ని బతకనివ్వను అని అరుస్తాడు రాకేశ్. ఏంట్రా మా ముందే బెదిరిస్తున్నావ్ అని రాకేశ్ ను ఎస్.ఐ. గట్టిగా చెంప మీద కొడతాడు. చూడు రాకేశ్ నేను నిన్ను లవ్ చేయడం ఎన్నటికి జరగని పని, అది అర్థం చేసుకో, నేను క్లోజ్ గా ఉన్నా అని వెంకట్ ను చంపాలనుకోవడం శాడిజం, అయినా నేను అతన్నే లవ్ చేస్తాను ఏం చేస్తావ్ నువ్వు, నీ అధికారమేంటి నా మీద అని ఆవేశంగా అంటుంది శైలజ. నువ్విలాగే చెయ్యవే నిన్ను ఎవరికీ దక్కకుండాచేస్తాను అంటాడు రాకేశ్. వెంటనే ఎస్.ఐ. వాన్ని తంతూ సెల్ లోపలికి నెడతాడు. మేడమ్ మీరు వెళ్లండి వీడి సంగతి నేను చూసుకుంటాను అంటాడు.ఎస్.ఐ. . ఓకే.. థ్యాంక్యూ సార్ అని చెప్పి శైలజ బయటకు వస్తుంది. స్టేషన్ బయట నిల్చుని మళ్లీ వెంకట్ కు కాల్ చేస్తుంది. వెంకట్ కాల్ కలవదు. సరే అని స్కూటీ స్టార్ట్ చేసి వెళ్దామనుకుంటున్న శైలజ, వెంకట్ ఎవరో అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని వెళుతూ కనిపిస్తాడు.

Advertisements

CLICK HERE : PART 6

Filed Under: Stories

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని … [Read More...]

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల … [Read More...]

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి … [Read More...]

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత … [Read More...]

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత … [Read More...]

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల … [Read More...]

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు … [Read More...]

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ … [Read More...]

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 … [Read More...]

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన … [Read More...]

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా … [Read More...]

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, … [Read More...]

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా … [Read More...]

అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?

ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట … [Read More...]

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు … [Read More...]

అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?

మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని … [Read More...]

బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?

భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు … [Read More...]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?

హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు … [Read More...]

Search

Advertisements

Latest Posts

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

TV9 ను దాటిన NTV!

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

Copyright © 2023 · Logical Telugu - Designed and Managed by Rishi Bharadwaj