• Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer

Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

  • News
  • Story Pic
  • Life Story
  • LT-Exclusive

లవ్ వైరస్ PART 6

April 15, 2020 by Admin

Advertisement

శైలజ ఫ్లాట్ కు వెళ్లేసరికి వెంకట్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ అబ్బా.. ఛా అలానా… రేపు కలుస్తాం కదా అప్పుడు చూస్తా అంటూ శైలజ రావడంతో నేను మళ్లీ మాట్లాడతాను అని కాల్ కట్ చేస్తాడు. ఎవరితో ఫోన్ లో మాట్లాడేది దానితోనేనా అని సీరియస్ గా అడుగుతుందది శైలజ. దానితోనా దేనితో అంటాడు వెంకట్. అదే బైక్ మీద ఎక్కించుకుని నవ్వుతూ మాట్లాడుతూ వెళుతున్నావ్ కదా దానితోనేనా… అంటుంది శైలజ. నువ్వెక్కడ చూశావ్ అనంటాడు వెంకట్. ఏ నువ్వు నాతో చెప్పకుండా మేనేజ్ చేద్దామనుకున్నావా… అయినా బైక్ మీద తిప్పడమేనా ఫ్లాట్ కు కూడా తీసుకొచ్చావా అని అంటుంది శైలజ. ఏయ్ ఏంటి అలా మాట్లాడతావ్ అసలు తనెవరో నాకు తెలీదు, లిఫ్ట్ కావాలి నీరసంగా ఉండి పడిపోయేలా ఉన్నాను అని అడిగితే లిఫ్ట్ ఇచ్చాను, తీరా చూస్తే ఆవిడ కూడా మన అపార్ట్ మెంట్ లోనే ఉంటుంది అని చెప్తాడు వెంకట్. నేననేది అదే, అది మన ఫ్లాట్ లోనే ఉంటుంది, నిన్ను చూసినట్టుంది, నీ వెంటపడటం మొదలు పెట్టింది ఎందుకంటే అది పెద్ద తేడా క్యాండిడేట్ అనంటుంది శైలజ. అవునా… నిజంగా నాకు తెలియదు శైలజ, అయినా తనుు అలాంటిదని మొహం మీద రాసుండదు కదా… ఆ అమ్మాయి ప్లేస్ లో ఎవరున్నా అలానే రియాక్ట్ అయ్యే వాన్ని అనంటాడు వెంకట్.

ఏంటోయ్ రియాక్ట్ అవ్వడం, అయినా అమ్మాయిలను బైక్ మీద ఎక్కించుకోవడమేంటి, నువ్వు ఇప్పటినుండి ఆ పని మానెయ్ అంటుంది శైలజ. అదేంటి.. అప్పుడప్పుడూ నువ్వు కూడా నా బైక్ మీద ఎక్కుతావ్ కదా మరి అంటాడు వెంకట్. నేను అదే చెప్తున్నా… మీ అమ్మో, చెల్లో, నేనో అంటే పర్లేదు అనంటున్నాను అంటుంది శైలజ. లోలోపల నవ్వుకుంటూ ఏంటి అనంటాడు వెంకట్. ఏంటి ఏంట్రా ఊరికేనే తెచ్చి పెట్టుకుంటామా ఇంట్లో… టైం ఇస్తే అర్థం చేసుకుని చెప్తావనుకున్నాను కాని నువ్వేమో ఏమీ అర్థం కానట్టు తిరుగుతున్నావ్.. పైగా అమ్మాయిలను బైక్ మీద ఎక్కించుకోవడం కూడా.. అనంటుంది శైలజ. అలా కాదు నేను చెప్పాలనుకున్నాను బట్ నువ్వెలా రియాక్ట్ అవుతావో అని…. పైగా చెప్తే నువ్వు తప్పుగా అనుకుంటావేమో అని చెప్పలేదు అంటాడు వెంకట్. ఏం చెప్పలేదు… అని అడుగుతుంది శైలజ. అదే… అని అంటాడు వెంకట్. ఏంటది.. అనంటుంది శైలజ. అదే నేను నిన్ను లవ్ చేస్తున్నానని … అంటాడు వెంకట్. ఇప్పటికి కూడా కరెక్ట్ గా చెప్పవా అనంటుంది శైలజ. ఓ.. దీనికి ఎగ్జాక్ట్ ఫార్మాట్ వర్డ్స్ ఉన్నాయి కదా ఓకే..”ఐ లవ్ యూ”… శైలు అని వెంకట్ చెప్పగానే… “మీ టూ..” అని వచ్చి వెంకట్ ను హగ్ చేసుకుంటుంది శైలజ.

శైలజ వెంకట్ తో మాట్లాడుతూ నేను నీ నుండి ఎక్స్ పెక్ట్ చేశాను బట్ నేనే చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు అంటుంది. నేను కూడా చెప్దామనుకున్నాను బట్ నేను కొంచెం ప్లాన్డ్ గా చెబుదామనుకున్నాను బట్ వియ్ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ మూవ్ మెంట్ అని అంటాడు వెంకట్. ఎలా… సెలబ్రేట్ చేసుకుందాం అని అంటుంది శైలజ. ఊ… ఎలా… ఓ పని చేద్దాం పద అని శైలజను తీసుకుని బైక్ మీద బయటకు బయలుదేరతాడు వెంకట్. ఎక్కడికి అని అడుగుతుంది శైలజ… చెప్తా.. అని సరిగ్గా ఫిప్టీన్ మినిట్స్ లో వెంకట్, శైలజను ఫస్ట్ టైం చూసిన షాపింగ్ మాల్ ఎదురుగా ఉన్న రోడ్ దగ్గరకు తీసుకుని వెళతాడు. ఇక్కడకు తీసుకొచ్చావేంటి అనంటుంది శైలజ. మనం ఫస్ట్ టైం కలిసింది ఇక్కడే కదా అనంటాడు వెంకట్. అవును… అంటుంది శైలజ. జస్ట్ వెయిట్… ఇప్పుడే వస్తా అని శైలజను బైక్ దగ్గర ఉంచి, అక్కడికి దగ్గర్లో ఉన్న ఫ్లవర్స్ షాప్ కు వెళతాడు వెంకట్. అక్కడి నుండి ఒక రోజ్ ఫ్లవర్ తీసుకుని శైలజ దగ్గరకు వస్తాడు.

ఆ పక్కన్నుండి వెళుతున్న ఒక కుర్రాన్ని ఎక్స్ క్యూజ్ మీ బాస్ నా మొబైల లో ఒక చిన్న వీడియో తీసి పెడతావా అని అడుగుతాడు. ఓకే అంటాడు ఆ కుర్రాడు. వెంకట్ తన మొబైల్ లో వీడియో రికార్డర్ ఆన్ చేసి ఆ అబ్బాయికిచ్చి ఆ అబ్బాయి వీడియో తీస్తుండగా తన చేతిలో ఉన్న రోజాను శైలజకు ఇస్తూ I LOVE YOU SAILU అంటాడు. శైలజ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి నవ్వుతూ రోజ్ తీసుకుంటూ I LOVE YOU TOO అని చెప్తుండగా ఆమె మొహం మెరిసిపోతుంది. వెంకట్ ఆ కుర్రాడికి థ్యాంక్స్ చెప్పి ఫోన్ తీసుకుంటాడు. మనం ఫస్ట్ కలిసిన ప్లేస్ ఎప్పుడూ గుర్తుండాలి అని ఇలా చేశాను అంటాడు వెంకట్. సూపర్బ్ ఎప్పటికి గుర్తుండిపోతుంది ఇది అని అంటుంది శైలజ.

Advertisement

ఓకే పద అని మళ్లీ శైలజను బైక్ మీద ఎక్కించుకుని వాళ్లు సెకండ్ టైం కలిసిన కాఫీ ఫాప్ కు తీసుకెళతాడు వెంకట్. ఇద్దరూ కలిసి కాఫీ షాప్ లో కూర్చుంటారు. వెంకట్ కాఫీ ఆర్డర్ చేస్తాడు. ఇది మనం సెకండ్ టైం కలిసిన ప్లేస్ అని తీసుకొచ్చావా అనంటుంది శైలజ. హే.. అలా కాదు ఒక వేళ అలా అయితే మనం నెక్ట్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి ఎందుకంటే మనం తరువాత కలిసిన ప్లేస్ అదే అంటాడు వెంకట్. శైలజ నవ్వుతుండగా.. కాఫీ తెచ్చిస్తాడు సర్వర్. కాఫీ తాగుతున్న వెంకట్ అటూ, ఇటూ చూస్తుంటాడు. ఏంటి అలా దిక్కులు చూస్తున్నావ్ అనంటుంది శైలజ. ఏం లేదు ఈ ప్లేస్ లో నాకు కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎవడో ఒకడు వచ్చి నన్ను వెనక నుంచి కొట్టి పోతాడేమో లేకపోతే పోలీస్ లు వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అంటారేమోనని అంటాడు వెంకట్. శైలజ నవ్వుకుని ఛాన్స్ లేదు.. అవును నీకు చెప్పలేదు కదా ఆ రాకేశ్ గాన్ని పోలీస్ లు అరెస్ట్ చేశారు అంటూ స్టేషన్ లో జరిగిందంతా చెబుతుంది శైలజ. ఓ అవునా… ఇంకేంటి ఈ రోజంతా హ్యాపీ న్యూస్ లే అనమాట అంటాడు వెంకట్.
అవును అంతా హ్యాపీనే ఇంక నువ్వె ఫ్రీగా కాఫీ షాప్ కు రావచ్చంటుంది శైలజ. అబ్బా.. అవునా.. ఎవడూ కొట్టడానికి రాడన్నమాట అనంటాడు వెంకట్.ఏ ఎందుకు దెబ్బలు తినాలని అంతా ఇష్టంగా ఉందా అనంటుంది శైలజ. కాదూ.. మళ్లీ ఎవడన్న కొడితే, ఇంకో అమ్మాయి పరిచయం అయ్యి, ఫ్లాట్ కు తీసుకెళ్లి ఐ లవ్ యూ చెబుతుందేమోనని అంటాడు వెంకట్. చంపుతా అనంటుంది శైలజ. దాంతో వెంకట్, శైలజ లు నవ్వుకుంటూ అక్కన్నుండి బయల్దేరి ఫ్లాట్ కు వెళ్లిపోతారు.
ఇద్దరు కలిసి ఆఫీస్ కు వెళ్లడం, ఈవినింగ్ కలిసి రావడం.. బయటకు వెళ్లడం.. వాళ్ల ఫ్రెండ్స్ కు విషయం తెలియడం.. సినిమాలు.. పార్టీలు.. సరదాసరదాగా రెండు నెలలు గడిచిపోతాయి. వాళ్లిద్దరి రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్థాయికి వెళుతుంది.

Advertisements

ఒకరోజు నైట్ పన్నెండు గంటలకు వెంకట్ మెల్లగా శైలజ దగ్గరికొచ్చి తన చెవిలో హ్యపీ బర్త్ డే అని అరుస్తాడు. ఉలిక్కిపడి లేచిన శైలు సర్ ప్రైజ్అయ్యి, ఏంట్రా రూం అంతా ఎప్పుడు డెకరేట్ చేశావ్ అంటుంది. నువ్వు పడుకున్నాక అని కేక్ తన ముందు పెట్టి కేక్ కట్ చెయ్యమంటాడు వెంకట్.

వావ్… అనుకుంటూ శైలజ క్యాండిల్ ఆర్పి కేక్ కట్ చేసి వెంకట్ కు తినిపిస్తుంది. వెంకట్ కూడా శైలూకు కేక్ తినిపించి, హ్యాపీ బర్త డే అంటూ గిఫ్ట్ ఇస్తాడు. ఏంటి గిఫ్ట్ అని తెరిచి చూస్తుంది శైలజ. వెంకట్, శైలజకు ఫ్లవర్ ఇస్తున్న ఫోటో ప్రింట్ ఉన్న కవరింగ్ తో డైరీ ఉంటుంది. వావ్.. సూపర్బ్ వెంకీ.. బట్ దీని మీద ఇయర్ లేదేంటి అని అడుగుతుంది శైలజ. ఉండదు, ఎందుకంటే ఆ డైరీ ఈ ఒక్క ఇయర్ కే కాదు మన లైఫ్ మొత్తానికి స్పెషల్ గా డిజైన్ చెయించా.. ఈ డైరీలో మనం రోజు చేసే పనులు రాయడం కాదు, మనం మర్చిపోలేని హ్యాపీ మూమెంట్స్ మాత్రమే రాయాలి. ఫ్యూచర్ లో మనం చిన్న గొడవపడ్డా మనం ఈ డైరీ చూసుకుని మనం కలిసుంటేనే ఎక్కువ ఆనందంగా, సంతోషంగా ఉంటాం అని రియలైజ్ అయ్యి కలిసుండాలి.

అందుకే మనమధ్య జరిగిన ఫస్ట్ హ్యాపీ మూమెంట్ ఫోటో తో డైరీ ని డిజైన్ చేయించా అనంటాడు వెంకట్. లవ్లీ తెలుసా… అసలు ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశావ్ చాలాబాగుంది ఎ వెరీ వెరీ స్పెషల్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్… ఓన్లీ డైరీనే కాదు, నువ్వు కూడా అనంటుంది శైలజ. నువ్వు కూడా నాకు అంతే అండ్ ఆ రోజు అన్నాకదా కొంచెం ప్లాన్డ్ గా లవ్ ప్రపోజ్ చేద్దామనుకున్నానని, ఈ రోజే చెబుదామనుకున్నా అంటాడు వెంకట్. ఇంత లేట్ గానా ఈ లోపు నేనే చెప్పేదాన్ని బట్ ఈ మూమెంట్ చాలా బాగుంది. ఇలాగే ఉండిపోతే బాగుండనిపిస్తుంది అంటుంది శైలజ. ఇలాగేనా నేను ఇంత నైట్ నీ రూంలోకి వచ్చాను అబ్జర్వ్ చెయ్యలేదు నువ్వు అనంటాడు వెంకట్. నువ్వొచ్చింది విషెస్ చెప్పడానికే కదా అంటుంది శైలజ. అవును నీ బర్త్ డే కు నీ రూంకు వచ్చాను సెలబ్రేట్ చేశాను, గిఫ్ట్ ఇచ్చాను మరి రిటర్న్ గిఫ్ట్ ఏమివ్వకుండా పంపిస్తావా అనంటాడు వెంకట్. రిటర్న్ గిఫ్టా ఏం కావాలి అనంటుంది శైలజ. ఆ….ఈ కేరళ పిల్ల శైలజ పిల్లైని ముద్దు కావాలి అని మలయాళంలో ఎలా అడగాలో నాకు తెలియదు అంటాడు వెంకట్.

ఇంక చాలు నీ రూంకి వెళ్లు అని వెంకట్ ను తనబెడ్ మీద నుండి నెడుతుంటుంది శైలజ. వెంకట్, శైలూ రెండు చేతుల్ని పట్టుకుని దగ్గరకు లాక్కుని ఈ గిఫ్ట్ కూడా నేనే ఇస్తాను అంటూ ముద్దు పెడతాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో సెక్స్ ఈజ్ ద అల్టిమేట్ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ లవ్ అన్నట్లు వాళ్లిద్దరు ఒక్కటవుతారు. ఆ రోజు నుండి వాళ్లు ఇకే ఫ్లాట్ లోనే కాదు ఒకే రూంలో ఉంటారు. ఒకరోజు వెంకట్ ఈ రోజు నేను ఆఫీస్ నుండి రావడం లేట్ అవుతుందని చెప్పడంతో శైలు తన స్కూటీ మీద ఆఫీస్ కు వెళుతుంది. ఈవినింగ్ శైలు స్కూటీ మీద ఇంటికి వస్తుండగా ఒక క్వాలిస్ ఫాస్ట్ గా వెనక నుండి వచ్చి ఢీ కొడుతుంది. శైలు స్కూటీ మీద నుంచి ఎగిరిపడిపోతుంది.

Advertisements

CLICK HERE : PART 7

Filed Under: Stories

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

హైదరాబాద్ అనగానే చాలా మందికి బిర్యాని … [Read More...]

TV9 ను దాటిన NTV!

దాదాపు 17 నెల‌ల త‌ర్వాత బార్క్ విడుద‌ల … [Read More...]

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

జాతీయ భాష ఏంటీ...? హిందీ... జాతీయ పక్షి … [Read More...]

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

పరీక్షల్లో పాస్ అవ్వడం అంటే అనుకున్నంత … [Read More...]

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

క్రికెట్ లో మూడ నమ్మకాల గురించి ఎంత … [Read More...]

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల … [Read More...]

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

మన ఇండియాలో చాలా స్టార్ట్ అప్ లు ఎందుకు … [Read More...]

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

టీం ఇండియా యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ … [Read More...]

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

మీకు ఎంత బంగారం ఉంది అంటే పది తులాలు, 20 … [Read More...]

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

హైదరాబాద్ చూడాలని చాలా మందికి కోరిక. మన … [Read More...]

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లిని ఘనంగా … [Read More...]

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

జాబ్స్ రావడం అనేది ఒక సవాల్ అనే విషయం … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎందుకు ఇష్టపడతారు…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే చాలా మందికి ఒక … [Read More...]

సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భార్యల కష్టాలు ఏంటీ…?

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వినడానికి, … [Read More...]

అసలు నూట పదహార్లు అనేది ఎలా వచ్చింది…?

కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా ఉన్నా … [Read More...]

అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటీ…?

ఈ మధ్య కాలంలో వైఫై కాలింగ్ అనే మాట … [Read More...]

కాప్చా అంటే ఏంటీ…? అసలు ఎందుకు తీసుకొచ్చారు…?

సైబర్ దాడుల విషయంలో ఇప్పుడు నిపుణులు … [Read More...]

అమ్మాయిలు ఎక్కువగా మద్యం తాగుతున్నారా…? యువత మద్యాన్ని వదిలేస్తుందా…?

మద్యానికి బానిస కావడం అంటే మన జీవితాన్ని … [Read More...]

బయటకు వెళ్తే వితంతువు ఎదురు వస్తే ఎందుకు మంచిది కాదు…?

భారతదేశంలో ఉండే కొన్ని సాంప్రదాయాలు … [Read More...]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు మంచిది…? బొట్టుకి రక్త ప్రసరణకు ఉన్న సంబంధం ఏంటీ…?

హిందూ సాంప్రదాయానికి సంబంధించి ఎవరు … [Read More...]

Search

Advertisements

Latest Posts

హైదరాబాద్ వెళ్తే బిర్యాని కాదు, ఇవి కూడా టేస్ట్ చేయండి…!

TV9 ను దాటిన NTV!

షాకింగ్: అసలు ఇండియాకు హాకీ జాతీయ క్రీడ కాదా…?కారణం ఏంటీ…?

ప్రపంచంలోనే కష్టమైన పరిక్షలు ఏంటీ…?

రోహిత్ శర్మ భార్య చేతి వేళ్ళను ఎందుకు ముడుచుకుని కూర్చుంటుంది…? సచిన్ కు ఉన్న మూడ నమ్మకం ఏంటీ…?

ఉమ్మడి ఏపీలో నటులు ఎక్కువగా ఆ ఊరి నుంచే ఎందుకు వచ్చారు…?

ఫేస్బుక్ ఎందుకు ఆ రేంజ్ లో క్లిక్ అయింది…?

అసలు చైనామన్ బౌలింగ్ అంటే ఏంటీ…?

బంగారాన్ని తులాల్లో ఎందుకు కొలుస్తారు…? అసలు తులం అంటే ఎంత…?

హైదరాబాద్ లో ఈ ప్లేస్ ఎంతమందికి తెలుసు…? హైదరాబాద్ ఇక్కడి నుంచి చూడండి ఒకసారి…!

రిజిస్టర్ మ్యారేజ్ జరగాలంటే ఏం చేయాలి…? ఇదే ప్రాసెస్…!

సాలరీలో బేరం ఆడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…!

Copyright © 2023 · Logical Telugu - Designed and Managed by Rishi Bharadwaj