Advertisement
శైలజకు యాక్సిడెంట్ అయ్యిందని వెంకట్ కాల్ రావడంతో వెంకట్ వెంటనే పరుగు పరుగున హాస్పిటల్ కు వెళతాడు. వెంకట్ హాస్పిటల్ కు వెళ్లేసరికి శైలజను ఎమర్జెన్సీ వార్డు నుండి వేరే రూంకు తీసుకెళ్లిపోతారు. వెంకట్ ను లోపలికి రాకుండా ఆపేస్తారు. వెంకట్ కంగారుగా డాక్టర్ ను శైలజ గురించి అడగడంతో… నో… నో… నో ప్రాబ్లమ్ డోంట్ వర్రీ… ఆమెకు జరిగిన యాక్సిడెంట్ పెద్దదే అయినా తను హెల్మెట్ పెట్టుకోవడంతో తలకు ఎటువంటి ఇంజ్యూరీ అవలేదు, బట్ తను కిందపడినపుడు తన కుడి భుజం మీదుగా కిందపడిందనుకుంటా అందుకే రైట్ హ్యాండ్ పైకి ఎత్తలేకపోతుంది, అదేమైనా ఫ్రాక్చర్ అయ్యిందా అని కన్ ఫామేషన్ కోసం ఎక్స్ రే రూం కి తీసుకెళ్లారు. అండ్ అక్కడక్కడా కొట్టుకుపొయ్యింది జస్ట్ లైక్ స్క్రాచెస్ అంతే అంటూ వెళతాడు డాక్టర్.
ఎక్స్ రే తీసిన తర్వాత శైలజను జనరల్ రూంలోకి షిఫ్ట్ చేస్తారు. వెంకట్ శైలజతో మాట్లాడతూ ఏంటి ఎలా జరిగింది అని అడుగుతాడు. శైలజ జరిగింది చెబుతుంది. రోడ్డు మీద ట్రాఫిక్ లేకపోవడంతో క్వాలిస్ వాడు ఆపకుండా వెళ్లిపోయాడు వాన్ని ఎవరూ ఆపలేదు అని చెప్తుంది. ఎలా ఉంది అని వెంకట్ అడిగుతాడు. చెయ్యి చాలా పెయిన్ గా ఉంది, అసలు పైకి లేపలేకపోతున్నాను, ఇప్పుడే పెయిన్ కిల్లర్ ఇచ్చారు అని చెబుతుంది.
ఓకే..ఓకే.. నువ్వు రెస్ట్ తీసుకో నేను డాక్టర్ దగ్గరికెళ్లి వస్తాను అంటూ వెళతాడు వెంకట్. కాసేపటి తర్వాత ఎక్స్ రే రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళతాడు వెంకట్. డాక్టర్ ఎక్స్ రే చూసి షీ ఈజ్ లక్కీ, ఫ్రాక్చర్ అవ్వలేదు బట్ షోల్డర్ బోన్ లైట్ గా డిస్ల్పేస్ అయ్యింది, ఒకసారి పేషెంట్ దగ్గరికి వెళ్దాం అని వెంకట్ తో కలిసి శైలజ దగ్గరకు వస్తాడు డాక్టర్. శైలజ చెయ్యిని పరిశీలించిన డాక్టర్, ఓకే శైలజ నువ్వు టెన్షన్ అవ్వాల్సిందేమి లేదు ఫ్రాక్చర్ ఏం అవలేదు, జస్ట్ బోన్. డిస్ల్పేస్ మెంట్, మజిల్ పట్టేసింది. అది ఫిజియోథెరపీ చేస్తే తగ్గిపోతుంది అంటాడు.
Advertisement
చాలా పెయిన్ గా ఉంది డాక్టర్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు టేక్ దిస్ పెయిన్ అంటుంది శైలజ. ఓకే.. నేను ఇంజక్షన్స్ పంపిస్తాను డ్యూటీ నర్స్ వచ్చి చేస్తారు అని చెప్పి నేను రేపు మార్నింగ్ వచ్చి చూస్తాను అని చెప్పివెళ్లిపోతాడు డాక్టర్. నర్స్ వచ్చి ఇంజక్షన్స్ చేస్తుంది. శైలజ పడుకుంటుంది. వెంకట్ రాత్రంత అక్కడే ఉంటాడు. మరుసటి రోజు మార్నింగ్ మళ్లీ నర్స్ వచ్చి ఇంజక్షన్స్ చేస్తుంది, తరువాత డాక్టర్ రౌండ్స్ కు వచ్చినపుడు మీరు పేషెంట్ ను తీసుకెళ్లొచ్చు, బట్ డెయిలీ ఫిజియోథెరపీకి తీసుకురావాలి అని చెప్తాడు. దాంతో వెంకట్, శైలజ ఫ్లాట్ కు వెళతారు. ప్రతిరోజూ ఈవినింగ్ శైలజను ఫిజియోథెరపీకి తీసుకెళ్లి తీసుకొస్తుంటాడు వెంకట్. అలా ఒక వారం తర్వాత ఒక రోజు అర్జెంటుగా ఇంటికి రమ్మని వెంకట్ వాళ్ల నాన్న కాల్ చేస్తాడు. ఆ విషయం శైలజకు చెప్తాడు వెంకట్ నువ్వు వెళ్లిరా వెంకట్ నేను ఆటో లో వెళ్లి వస్తాను ఫిజియోథెరపీకి అనంటుంది శైలజ.
వెంకట్ ఊరికి బయలుదేరతాడు. మరుసటి రోజు ఉదయం వెంకట్ ఇల్లు చేరుకుంటాడు. వెంకట్ జర్నీతో అలసిపోయి ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు. ఆరోజు సాయంత్రం శైలజతో ఫోన్ లో మాట్లాడతాడు, శైలజ ఫిజియోథెరపీకి వెళుతున్నానని చెబుతుంది. ఓకే మా ఊర్లో సిగ్నల్ సరిగా ఉండదు నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నేను మా నాన్నతో మాట్లాడేసి విషయం ఏంటో కనుక్కుని రేపు బయల్దేరి వస్తాను అని కాల్ కట్ చేస్తాడు. వెంకట్ తల్లిదండ్రులు ఆ రోజు రాత్రి భోజన సమయంలో వెంకట్ కు సంబంధం చూశామని, రేపు అమ్మాయిని చూడటానికి వెళదామని చెబుతారు.వెంకట్ వారితో నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్తాడు. కాని వెంకట్ తల్లిదండ్రులు శైలజతో పెళ్లికి ఒప్పుకోరు. దానితో వెంకట్ అతని తల్లిదండ్రులతో నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పి కోపంగా లేచి చెయ్యి కడుక్కుని అదే రాత్రి అక్కన్నుండి బయలుదేరతాడు.
Advertisements
నెక్ట్స్ డే వెంకట్ హైదరాబాద్ చేరుకునేప్పటికి ఉదయం పది గంటలవుతుంది. వెంకట్ శైలజకు కాల్ చేస్తుంటే శైలజ లిఫ్ట్ చెయ్యదు.వెంకట్ ఫ్లాట్ చేరుకుని కాలింగ్ బెల్ కొడతాడు. డోర్ తీసిన శైలజ ఒక్కసారిగా వెంకట్ లగేజ్ బయటకు విసిరి, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని పిచ్చి పట్టినట్టుగా అరుస్తుంది. శైలజ జుట్టు అంతా చెరిగిపోయి, కళ్లు ఎర్రగా మండుతున్నట్టుగా ఉంటాయి. శైలజ ఏడుస్తుంటుంది. ఆ సంఘటనకు షాక్ అయిన వెంకట్ ఏయ్ శైలు ఏంటిది ఏంజరిగింది
అంటాడు.
శైలజ ఆవేశంగా జస్ట్ షటప్… అని ఏడుస్తూ నన్నెందుకురా ఇంత మోసం చేశావ్, నీకేం అన్యాయం చేశాను నేను అంటుంది. ఆ అలికిడికి చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్లు అక్కడికి వస్తారు. శైలజ ఏంటి అసలేం జరిగింది అని అంటాడు వెంకట్. శైలజ ఇంకా ఆవేశంగా నా పేరు పలికే అర్హత కూడా నీకు లేదు, నా కళ్ల ముందు నుండి వెళ్లిపో అని అరుస్తుంది. అది చూసిన చుట్టుపక్కల వాళ్లు ఏయ్ ఏంటయ్యా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావ్అని బెదిరించి అక్కన్నుంచి బయటకు నెట్టేస్తారు. చేసేదేమి లేక వెంకట్ అక్కన్నుండి వెళ్లిపోతాడు. ( ఇంకా ఉంది)
Advertisements
CLICK HERE : PART 8