Advertisement
షాక్ నుండి తేరుకున్న వెంకట్ ఏంటి ఆంటీ ఎలా జరిగింది అని శైలజ తల్లిని అడుగుతాడు. సూసైడ్ చేసుకుంది. వ్వాట్…. సూసైడా అంటాడు వెంకట్. అవును శైలజ ఒకరోజు హైదరాబాద్ నుండి హఠాత్తుగా వచ్చింది. వచ్చిన తర్వాత మాతో సరిగా మాట్లాడకపోతే జర్నీ కదా టైడ్ గా ఉందనుకున్నాం, కాని తరువాత రోజు ఉదయం చూసేసరికి ఉరి వేసుకుంది. అని చెప్తుంది శైలజ తల్లి. ఎందుకు ఆంటీ, ఎందుకు చేసింది అని అడుగుతాడు వెంకట్. నేను చెప్పలేను అని వెళ్లి సూసైడ్ చేసుకునేముందు శైలజ రాసిన సూసైడ్ నోట్ ను తీసుకువచ్చి ఇస్తుంది శైలజ తల్లి. వెంకట్ ఆ లెటర్ తీసుకుని చదవడం
మొదలుపెడతాడు.
ఆ లెటర్ లో…….. అమ్మ, నేను హైదరాబాద్ లో వెంకట్ అనే అతన్ని ప్రేమించాను. అతనే నా లైఫ్ అనుకుని అతనితో రిలేషన్ చాలా ముందుకు వెళ్లినా పర్వాలేదనుకున్నాను. కాని తర్వాత తెలిసింది నేను చేసింది తప్పని, ఎందుకంటే వాడు నాకు చేసింది మోసం. ఎప్పటికీ తీరని అన్యాయం. నాకు జరిగిన చిన్న యాక్సిడెంట్ వల్ల నా కుడి భుజంకు ఫిజియెథెరపీ అవసరమని డాక్టర్ చెప్పారు. అలా నేను ఫిజియోథెరీకి వెళ్లినపుడు అక్కడ ఒక యాక్సిడెంట్ అయిన వ్యక్తికి బ్లడ్ అవసరమని తెలిసి బ్లడ్ ఇవ్వడానికి వెళ్లాను. వాళ్లు నా బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేసి నన్ను బ్లడ్ ఇవ్వద్దన్నారు. ఎందుకంటే నాకు HIV POSITIVE అని చెప్పారు. ముందు నేను నమ్మలేదు, కాని బయట టెస్ట్ చేయించడంతో అది కన్ ఫామ్ అని తేలింది.
Advertisement
నాకు తెలుసు ఈ వైరస్ నాకు ఎలా వచ్చిందో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క మగాడు వెంకట్. వాడు నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకోనంటే తట్టుకునే దాన్నేమో కాని వాడి వల్ల నాకొచ్చిన ఈ వ్యాధిని మాత్రం తట్టుకోలేకపోతున్నాను. నలుగురిలో తిరగలేను అందుకే నేను నలుగురిలో లేకుండా పోతున్నా. I AM SORRY అమ్మ. అని రాసుంటుంది. నో… నేను నమ్మలేను అనంటాడు వెంకట్. అవును నేను కూడా నమ్మలేదు బట్ తన పోస్ట్ మార్టమ్ లో అది నిజమే అని తెలిసింది అంటుంది శైలజ తల్లి. మరి నాకు తను పంపిన మెసేజ్ అంటాడు వెంకట్. నీ వల్లే తనకు ఎయిడ్స్ వచ్చిందని తనలాగే నీకు మెసేజ్ పంపి ఇక్కడకు రప్పించి నిన్ను చంపేద్దామనుకున్నాం. అనుకున్నట్టే నిన్ను రప్పించాను. నిన్ను పొడిచాను. బట్ నిన్ను హాస్పిటల్ లో ట్రీట్ చేసిన నా తమ్ముడు వచ్చి చెప్పాక తెలిసింది నీకు HIV లేదని, అప్పుడే అర్థమైంది నా కూతురు నిన్ను తప్పుగా అర్థం చేసుకుందని, కాని నా కూతురుకు ఎలా ఈ వైరస్ వచ్చిందని అర్థం కావట్లేదు. నా కూతురు తప్పు చేసిందా లేకపోతే నా కూతురు విషయంలో ఎవరైనా తప్పు చేశారా అని అర్థం కావట్లేదు అంటుంది శైలజ తల్లి.
నో… శైలజ ఏంటో నాకు తెలుసు తను తప్పు చేయదు కాని ఇదెలా జరిగిందో నాకు తెలియట్లేదు, తెలుసుకుంటా ఖచ్చితంగా తెలుసుకుంటా అని అక్కన్నుండి హైదరాబాద్ బయలుదేరతాడు వెంకట్. వెంకట్ బస్ లో ప్రయాణం చేస్తున్నంత సేపు ఒకటే ఆలోచన ఎలా, అసలు ఎలా శైలజకు ఎయిడ్స్ వచ్చింది అని……( ఇంకా ఉంది)
Advertisements
Advertisements
CLICK HERE : PART 10