Advertisement
మనదేశంలో కటిక పేదవాడి దగ్గర నుండి బాగా డబ్బున్నవాడి వరకు సొంతిల్లు అనేది ఒక కల..అటువంటి ఇంటిని తమ తాహుతుకు తగ్గట్టు అపురూపంగా నిర్మించుకుంటారు..మరి మన దేశంలో ఉన్న బిలియనీర్ల ఆస్తులకు తగ్గట్టుగానే వారి వారి జీవనశైలి ఉంటుందనేది అందరికి తెలిసిన విషయమే.. అపర కుబేరులైనటువంటి అంబాని, రతన్ టాటా , రుయా మరియు ఇతరుల అత్యంత విశాలమైన గృహాలు ఎలా ఉంటాయి..ఎంత ఖరీదు చేసేవి..వాటి ప్రత్యేకత ఏంటి లాంటి ఆసక్తికర విషయాలు మీకోసం..
ముఖేష్ అంబానీ-ఆంటిలియా
అత్యంత ఖరీదైన భవనం గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా “ఆంటిలియా” గురించి చెప్పుకోవాలి..రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని,నీతా అంబానిల కలల సౌదం. దక్షిణ ముంబైలో ఉన్న ఈ ఇల్లు మొత్తం 27 అంతస్తులు. దాని ఖరీదు అక్షరాలా రూ.12వేల కోట్లు. అందులో 24 గంటల పాటు పనిచేయడానికి మొత్తం 600 మంది దాకా సిబ్బంది ఉంటారు.సెలూన్, ఐస్ క్రీమ్ పార్లర్,స్విమ్మింగ్ ఫూల్, జిమ్ ఇలా అన్ని రకాల సదుపాయాలు ఆంటిలియాలో ఉన్నాయి. ఒక ఫ్లోర్ మొత్తం మిని థియేటర్ ఉంటుంది..ముఖేష్ అంబానికి హిందీ సినిమాలంటే అమితమైన ఇష్టం.
సైరస్ పూనావాలా-లింకన్ హౌజ్
Advertisements
పూనావాలా గ్రూప్ చైర్మన్ సైరస్ పూనావాలా..సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వీరిదే..దీని ఆధ్వర్యంలో మెడిసిన్స్‌ను తయారు చేసే కంపెనీలు వీరికి ఉన్నాయి.ముంబైలోని ఒకప్పటి US కాన్సులేట్ “లింకన్ హౌజ్” ని ముంబై ప్రభుత్వం నుండి 750 కోట్లు పెట్టి కొనుగోలు చేశారీయన.
అనిల్ అంబాని-అబోడ్
ధీరూబాయ్ అంబాని చిన్న కుమారుడు అనిల్ అంబానికి కూడా పెద్ద భవంతే ఉంది..దాని ఖరీదు సుమారు 5వేల కోట్లు..
సజ్జన్ జిందాల్ – జిందాల్ హౌజ్
జిందాల్ స్టీల్ ఇండియా చైర్మన్ సజ్జన్ జిందాల్ . సముద్రం ఒడ్డున సీ ఫేసింగ్ తో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు..దీని విలువ సుమారు రూ.500 కోట్లు . అందులోనూ చాలా మంది పనివారు ఉంటారు.
Advertisement
కుమార మంగళం బిర్లా – జటియా హౌజ్
ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగలం బిర్లా.. రూ.450 కోట్లు. విలువైన సీ ఫేసింగ్ జటియా హౌజ్ ని ఇండస్ట్రియలిస్ట్ MP జటియా కుమారుల నుండి కొనుగోలు చేశారు..
గౌతమ్ సింగానియా – JK హౌజ్
రేమండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింగానియా ఇల్లు JK హౌజ్ ఖరీదు రూ.150 కోట్లు.
నవీన్ జిందాల్ – జిందాల్ హౌజ్ (ఢిల్లీ)
జిందాల్ పవర్ కంపెనీ చైర్మన్ నవీన్ జిందాల్ కూడా అత్యంత ఖరీదైన భవనాన్ని కలిగి ఉన్నారు..ఇతని ఇంటి విలువ సుమారు 150కోట్ల రూపాయలు..
రతన్ టాటా-రిటైర్మెంట్ హోమ్
టాటా గ్రూప్ యజమాని రతన్ టాటా పేరు తెలియని వారుండరు..2015లో విశాలమైన ఇంటిని కొనుగోలు చేశారు..దీనిని రిటైర్మెంట్ హోం గా పిలుచుకుంటారు. దీని విలువ రూ.150 కోట్లు.
శశి రుయా,రవిరుయా – రుయా హౌజ్
ఎస్సార్ గ్రూప్ యజమానులు శశి రుయా,రవి రుయా. వారి ఇంటి ఖరీదు రూ.120 కోట్ల వరకు ఉంటుంది.
విజయ్ మాల్యా – స్కై హౌజ్
మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ విజయ్ మాల్యా పేరు మారుమోగి పోతుంది. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ఈయన గారి ఇంటిని బ్యాంక్ వారు అటాచ్ చేసుకున్నారు..స్కై హౌజ్ గా పిలువబడే ఆ ఇంటి విలువ రూ.100 కోట్లు.
Advertisements